2006 సంవత్సరం....

రోటీ/బటర్ నాన్/స్టఫ్‌డ్ కుల్చా...ఆ మాట కొస్తే రెస్టారెంట్ మెనులో ఏ ఐటమ్ ఐనా ఆర్డర్ చేసే సౌలబ్యం,
కాస్ట్‌లీ కప్‌డా,
ముద్దొచ్చే మకాన్.....(అట్‌లీస్ట్ రెంటెడ్ వన్)
ఇవి అన్నీ వున్నా కూడా శంకర్ చాలా ఫ్రస్ట్రేషన్లో వున్నాడు. రూం టాప్ కేసి అలా శూన్యంలో చూస్తున్నాడు. అంతా బ్లాంక్‌గా కనిపిస్తోంది. ఏం శంకరయ్యా అంత ధీర్ఘంగా ఆలోచిస్తున్నావ్ అని అడగడానికి ఇంట్లో ఎవ్వరూ లేరు, usually ఉండరు. మన వాడు సింగిల్‌గా వుంటాడు కాబట్టి. ఇంతలో ఫోన్ కాల్ రావడంతో, లిఫ్ట్ చేసాడు. ఫ్రెండ్ అయిన

శ్రీను : "హాయ్ ఛీనాబ" అన్నాడు. అంతే వెంటనే కాల్ కట్ చేసాడు, శంకర్. శ్రీను మళ్ళీ కాల్ చేసాడు, శంకర్‌కు విసుగొచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు. చెవిలో 'ఛీనాబ ఛీనాబ' అని ఫ్రెండ్ అన్న మాటే రీప్లే అవుతోంది. ఛీనాబ అనేది శంకర్‌కు కొందరు ఫ్రెండ్స్ పెట్టిన ముద్దు పేరు. ఛీనాబ అంటే ' ఛీ నా బతుకు ' కు షార్ట్ ఫార్మ్. ఇది ఒకప్పుడు శంకర్ ఊత పదం.

నిజానికి శంకర్ సర్కిల్‌లో రోగిష్టి రిలేటివ్స్, పాపిష్టి ప్రాజెక్ట్ మేనేజర్స్, గిఫ్ట్-ఇష్టి గర్ల్ ఫ్రెండ్స్ లేరు. పెద్ద ప్రోబ్లమ్స్ ఏవీ లేవు. కానీ తనది తపనతో కూడిన బాధ. తనకు కొద్దో గొప్పో క్లోజ్ ఫ్రెండ్స్ అయిన శ్రీను , క్రిష్ణా రెడ్డి, వినాయక్‌లకు కూడా శంకర్ అస్సలు సమస్య ఏంటో ఇప్పటికీ అర్థం కాలేదు. శంకర్ ముందు నుంచే వీళ్ళకు కాస్త డిఫరెంట్‌గా మిగతా వారికి తేడాగా కనిపించేవాడు.

శంకర్ రాసే ఏ స్లామ్ బుక్‌లో అయినా తన కామన్ అన్సర్స్ ఇవి...

Email id: rupees.friendship.only@gmail.com
Favorite Film: గురు
Favorite Books: డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు,డబ్బు సంపాదించడం ఎలా ?, Rich Dad Vs Poor Dad....

ఇవి చాలవూ తను మనీ మైండెడ్ అని చెప్పడానికి.
శంకర్‌కు ఎప్పటినుంచో బాగా డబ్బు సంపాదించాలాన్న కోరిక. తన లక్ష్యం ఆ డబ్బుతో ఆ తర్వాత జల్సా చెయ్యొచ్చు అని కాదు. ఈ ప్రపంచం మొత్తం డబ్బు మీదనే నడుస్తుంది, దాని నుంచి ఫ్రీ అయిపోయి నిజమైన లైఫ్‌ని ఆస్వాదించాలన్నది తన యాంబిషన్.

శంకర్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు. అందులో ఉండే సుఖాల కన్నా కష్టాలు ఎక్కువ చూసాడు. తను అనుకున్న దాని కన్నా IT బూమ్ పుణ్యమా అని, ఎక్కువ కష్టపడకుండానే తన తండ్రి 38 ఏండ్ల సర్వీస్ చివర్లో వచ్చిన Rs 15,000 సాలరీని తన మొదటి జీతం తోనే దాటేసాడు. నాన్న గారి P.F డబ్బులు, ఇంకా అన్ని సేవింగ్స్ కలిపి చెల్లి పెళ్ళి కోసం అని ఎన్నో సంవత్సరాలు కష్టపడి కూడబెట్టిన సొమ్ము ఇప్పుడు తన yearly సాలరీ కన్నా తక్కువ. ఈ పరిస్థితి చూసి ఆనందించాలో, విచారించాలొ అర్థం కాని పరిస్థితి తండ్రి-కొడుకులిద్దరిదీ. ఒక యావరేజ్ డిగ్రీ వల్ల ఒక మనిషి జీవితాంతం కష్టపడాల్సి వస్తే, వన్ డే బాటింగ్‌లతో ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించినా, అత్యంత సులువుగా IC అనే MNC లో జాబ్ పొందగలిగాడు శంకర్. ఎందరో అతి కష్టం మీద సంపాదించే డబ్బు కన్నా ఇంత సులువుగా చాలా మంది ఎన్నో రెట్లు ఎక్కువగా సంపాదించడం విచిత్రంగా తోచింది శంకర్‌కు. ఇలానే సమాజంలో చాలా మంది తమ తెలివిని/తర్కాన్ని ఉపయోగించి డబ్బు సంపాదించటానికి సులువైన మార్గాలను కనుక్కొని రాణిస్తున్నారు, కాని కొందరు మాత్రం తమ మదిలో ఇలాంటి ఆలోచనలను రానివ్వట్లేదు, అనుకున్నాడు.

శంకర్ పని చేస్తున్న కంపెనిలో ఒక సెక్యూరిటీ గార్డ్‌ది దయనీయ గాధ. ఎక్కడో జార్ఖండ్ నుంచి వలస వచ్చి ఇక్కడ జాబ్ చేస్తుంటే, వస్తున్న జీతం సరిపోదని డబుల్ డ్యూటీ చేస్తూ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా రోజంతా ఆఫిస్‌లోనే వుంటూ రెండు జీతాలు వచ్చేలా పని చేస్తున్నాడు. అయినా కుడా తన వార్షిక ఆదాయం ఆ MNCలో ఒక యావరేజ్ ప్రోజెక్ట్ మేనేజర్ నెల జీతం కన్నా చాలా తక్కువ. వంద రుపాయలు సంపాదించడం కోసం రోజూ ఎంతో కష్టపడే ఎందరినో చూసాడు శంకర్, అలాగే ఎంతో తెలికగా వంద రూపాయలను ఖర్చుచేసే వారినీ చూసాడు. జీవితంలో డబ్బు ప్రాముఖ్యతను తను చిన్నప్పటినుంచి చాలా అబ్జర్వ్ చేస్తూ, తెలుసుకుంటూ వచ్చాడు. యండమూరి లాంటి రచయితలు, 'డబ్బు ఆనందాన్ని ఇవ్వదేమో కాని సుఖాన్ని మాత్రం ఇస్తుంది" అన్న మాటలు అక్షర సత్యం అనిపించాయి శంకర్‌కు.

ఎందరో ఆర్థికంగా విజయం సాధించిన వారి గాధలు విన్నాడు. అందరూ ' గురు ' సినిమాను మణి రత్నం/ఐశ్వర్యారాయ్/అభిషేక్ బచ్చన్/రహమాన్/శ్రేయా గోషల్ కోసం చూస్తే శంకర్ మాత్రం 30 సార్లు అందులో చూపించిన హీరో కసిని పట్టుకోడానికి చూసాడు. శంకర్‌కు ధీరూభాయ్ అంబానీ, బిల్ గేట్స్, వారెన్ బఫెట్....ఇలాంటి వారంటే వీరాభిమానం. అమీషా పటేల్, నయనతార లాంటి వారు కలల్లో రావాల్సిన వయసులో అజీమ్ ప్రేమ్‌జీ, నారాయణ మూర్తి లను కలవరిస్తూ గడుపుతున్నాడు.
శంకర్‌ది మొదటి నుంచి, 'గుంపులో Don't go-విందం' పాలసీ. కాని IT ఇండస్త్రీ ఇచ్చిన ఈజీ ఆఫర్‌ని కాదనలేకపోయాడు. సగటు 21+ ఆంధ్రా యువకుడిలానే శంకర్ కూడా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఈ ఇండస్ట్రీలో రెండేళ్ళు గడిచాక తను రియలైజ్ అవ్వడం మొదలయ్యింది. ఇప్పుడొస్తున్న మంచి సాలరికి సంతోషిస్తూ ఇలా వుండిపోతే ఎలా అని ? ఇప్పటికీ ఈ జీతం నిజానికి బొటా బొటిదే. ఇలాగే రోజుకి 10-12 గంటలు పని చేస్తుంటే 10-12 ఏండ్లు గడిచినా ఇలానే వుంటాం. ఇదీ ఒక రకంగా న్యూ జెనరేషన్ మిడిల్ క్లాస్ లైఫ్ అనిపించింది. తనకు క్రియేటివ్ ఫీల్డ్స్ అంటే ఇష్టం. ఒక రకంగా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్మింగ్ అంటే ఇష్టం కానీ ఒకరు నిర్దేశించిన ఫలానా వర్కు, ఫలానా బగ్గులు, ఇలానే చేసుకుంటూ పోతే తను ఫలానా అన్న ఐడెంటిటీ యే ఉండదు అనిపించింది. శంకర్‌కు ప్రతి రోజు పది గంటలకు సైబర్ టవర్స్(హైదెరాబాద్) సిగ్నల్ దగ్గరకు రాగానే కొన్ని వేల హెల్మెట్స్‌ను చూడగానే భయమేస్తుంది. ఇన్ని వేల హెల్మెట్స్‌లో నేను ఒకడిని కాకూడదు అని గట్టిగా చెప్పుకుంటాడు. తనకు అప్పుడు ఆశ్చర్య మనిపించే మరో విషయం, 'ఇన్ని వేల మంది తమ తెలివినంతా ఉపయోగించి ఎన్నో ప్రోబ్లమ్స్‌ను (కంపెనీవి) సాల్వ్ చేస్తుంటారు. కాని అదే తెలివిని తమ రియల్ లైఫ్ మెరుగుపర్చుకోడానికి అదే రేంజ్‌లో ఎందుకు వాడరు ?" అని.
ఒక స్టేజ్ కు వచ్చాక రోజంతా ఇంకెవరికోసమో పని చెయ్యడం శంకర్‌కు నచ్చలేదు. తన ఫ్రస్ట్రేషన్ ఫోర్ టైమ్స్ పెరిగింది.లాభం లేదు ఏదో ఒక్కటి చెయ్యాలనుకున్నాడు. తనకు తాను సంపద సృష్టించుకోవాలని, తన జీవితాన్ని, తనని డైరెక్ట్‌గా ఆడిస్తున్న డబ్బు పని పట్టాలని, డబ్బును కమాండ్ చేసే స్టేజ్‌కు తను రాగలిగితేనే తన జీవితాన్ని తను అనుకున్న విధంగా జీవించగలనని అనిపించింది. కోటీశ్వరుడు అవ్వంది డబ్బు మీద అంత కమాండ్ రావడం కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాగే జాబ్ చేస్తూ పోతే రెటైర్ అయ్యే స్టేజ్‌కు కోటేశ్వరుడు అవ్వొచ్చు. కాని అప్పటికి దానికి వాల్యు లేకుండా పోవచ్చు. అందుకే 3 yearsలో కోటీశ్వరుడు అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇందాక దాని గురించి ఆలోచిస్తుంటేనే శ్రీను కాల్ చేసాడు. కొద్దిగా డిస్టర్బ్ అయినా, ఎప్పటిలా శంకర్ ఈ ఆలోచనలను అక్కడితో ఆపెయ్యలేదు. ఈసారెందుకో తను కాస్త దృఢంగానే వున్నాడు. రోజు రోజుకి పెరుగుతున్న డబ్బు దౌర్జన్యం వళ్ళ కావొచ్చు. ఇంతటి కాన్సన్‌ట్రేషన్‌తో వున్న శంకర్‌ను చూసి, వామ్మో వీడు నిజంగానే బాగుపడిపోయేట్టు వున్నాడని గ్రహించి టక్కున ఉలిక్కిపడి లేచిన శంకర్ అంతరంగం, అంతరంగాలు టైటిల్ సాంగ్‌ను ప్లే చేస్తూ, 'రెయ్ శంకర్ గా మరీ మనకీ ఫ్రెండ్ కాకుండా, మనీ-కీ ఫ్రెండ్ వయ్యి మంకీ లా తయారవుతున్నావ్. నువ్వు చూసిన/చదివినవే చిత్రాలు, పుస్తకాలు కాదురా ప్రపంచంలో ఇంకా చాలామంది చాలా విషయాలు రాసారు. వాళ్ళు చెప్పేదేంటంటే, డబ్బు గురించి మరీ ఎక్కువ ఆలోచించకూడదు, మనకు నిన్న,రేపటికన్నా, నేడు ముఖ్యం. ప్రస్తుతం తప్ప మిగతాదంతా అప్రస్తుతం అనీ..... "

ఇవ్వన్నీ డిస్టర్బ్ చేస్తున్నా ఎందుకో శంకర్‌కు అవి వినపడట్లేదు. అవన్నీ 3 years తర్వాత చూసుకోవచ్చు. ఈ టైం మొత్తాన్ని నేను కోటి రూపాయలు సంపాధించడనికే స్పెండ్ చేస్తా....అనుకుని ఫిక్స్ అయిపోయాడు. శంకర్ అంతరంగం ఖంగు తిని ఏదో లోయలో పడుతున్నట్టు అరుస్తూ గాయబ్ అయ్యాడు. శంకర్ మాత్రం ఇప్పుడు సరికొత్త పంధాలో డబ్బు సంపాదించడం ఎలా అని తన రూఫ్ టాప్ కేసి చూస్తూ...శూన్యంలో సూపర్ అవిడియాలకోసం వెదుకుతున్నాడు....

(ఇంకా వుంది)

శాంతి స్వరూప్ వల్ల స్వరూపం మారిన వేళ !!!
చిన్నప్పుడు రెగ్యులర్‌గా డిడి-8లో శాంతి స్వరూప్ దర్శనమిచ్చేవాడు. ఒక రోజు ఆయన హెయిర్ స్టైల్ చాలా నీట్‌గా వుండడం గమనించాను. పాపిడి తీసే చోట (బట్టతలవల్ల) ట్రై యాంగిల్ షేప్‌లో గ్యాప్ రావడం వల్లే నీట్‌గా కనిపిస్తోందనిపించింది. వెంటనే బాత్‌రూంకి వెళ్ళిపోయి, మా డాడ్ రేజర్‌తో నేను హెయిర్ పాపిడి తీసే చోట గోకేసా. అంతే కొంచం హెయిర్ పోయింది. అప్పటికే సమ్మర్ కట్టింగ్ అని చాలా చిన్న జుట్టు వుంది. సో తీరా తీసాకా చూస్తే నేనే దడుసుకున్నా. దానిని ఎలా దాచాలో తెలియక చచ్చాను. అయినా ఇంట్లో కనిపెట్టారు. ఏమైంది అక్కడా అంటే 'శాంతి స్వరూప్'ని చూసి inspire అయ్యాను అనగానే నవ్వాపుకోలేకపోయారు. ఇప్పటికీ తనని చూసినప్పుడల్లా ఈ విషయమే గుర్తొస్తుంటుంది.

పందులతో పందెం !!!

మా కాంపౌండ్‌కు కొద్ది దూరంలో ఒక పెద్ద పందుల పాక ఉండేది. ఇది మా కాలనీ వాళ్ళు పట్టించుకోకపోయినా భావి భారత, మునిసిపాలిటీ కాన్షియస్ పిల్ల వెధవల్లా మాలో ఆగ్రహ జ్వాలలు ఎగిసి పడ్డాయి. అంతే, అప్పుడు రామాయణం, మహాభారతం సీరియల్స్ ఎఫెక్ట్ అనుకుంటా, బాణాలు తయారు చేసాం. ఇంట్లో చీపుర్లు అన్నీ గాయబ్. అవి బాణాలు. ఇక వేటే వేట. భలే వెంటాడే వాళ్ళం. చూసేవాళ్ళకు ఎవరు పందులో అర్థం అయ్యేది కాదు. ఈ బాణాలకు స్పెషల్ ఎఫెక్ట్‌లా చింత పండును అతికించి దానికి కంప చెట్ల ముల్లులు పెట్టి అస్సలు సిసలు అడవి రాక్షసుల్లా ఎగబడేవాళ్ళం. భలే అటాక్ చేసే వాళ్ళం, పందెం పందుల్లా (పందెం కోడి టైప్). పాపం దారుణంగా పరిగెత్తేవి పందులు. సుఖంగా మురికి కాలువలో పడుకుంటే నిద్ర చెడగొడుతున్న ఈ ఎదవలు ఎవ్వర్రా అని పాపం తెగ ఫీల్ అయ్యేవి. నేను ఒక సారి ఒక షార్ప్ పంది, తెగ ఇంటెలిజెన్స్ చూపిస్తుంటే సినిమాల్లో అస్త్రాలు ప్రయోగించే టప్పుడు, స్ట్రైట్‌గా వెయ్యకుండా ఒకొక్కసారి ఆకాశం వైపుకు వేస్తారుగా అలా వేసా. చాలా హైట్‌కు పోయింది కాని లాండ్ అయ్యే టప్పుడే ఒకతను సైకిల్ మీద రోడ్‌లో పోతుంటే అతని కన్ను, spectacles మధ్య వున్న అతి చిన్న గ్యాప్ నుంచి spectaclesని లైట్‌గా రాసుకుంటూ Spectacularగా మిస్ అవుతూ వెళ్ళింది. ఆ రోజు ఎఫెక్ట్‌తో పందుల పందాలకు బ్రేక్ పడింది.

రాయి చేసిన రాచ(రచ్చ)కార్యం
ఇందాక దీపావళి మ్యాటర్‌లో చెప్పుకున్న వాడే ఇంకో ఇంటరెస్టింగ్ పనిచేసాడు. ఏదో చెట్టులో, ఏవో fruits కోసం, ట్రై అండ్ ట్రై అంటిల్ యు క్రై ఫిలాసఫి ప్రకారం, రాళ్ళతో వీర విజృంభణ చేసాడు. ప్రతీ సారీ, రాళ్ళు రివర్స్ వస్తున్నాయి, పండు రావట్లేదు. ట్రై చేస్తూనే వున్నాడు. మొత్తానికి ఈ సారి పండు వచ్చింది, వదిలెయ్యొచ్చుగా కాని రాయి రాలేదన్న విషయం గమనించి, రాయి ఏమయ్యింది అని తీక్షణంగా అబ్జర్వ్ చేస్తూ అది విసిరిన యంగిల్‌లో నిలబడి చూస్తున్నాడు. అది ఎందుకో, స్ట్రక్ అయ్యింది. ఇప్పుడు గాలి వల్ల మళ్ళీ రివర్స్‌లో పడింది. కాని కింద కాదు, వాడి తల మీద, మరుసటి రోజు బాండేజ్‌తో వచ్చాడు.

దీపావళి ధమాకా....
మా క్లాస్‌మేట్ వుండేవాడు. వాడు పిచ్చ అమాయకత్వపు అతి, అన్నమాట. కొంచం కక్కుర్తి కూడ ఎక్కువ ఎదవకి. ఒకసారి దీపావళి అప్పుడు, టపాకాయల్లో పేలని వాటినన్నింటినుంచి, గ్రే కలర్ మందు వుంటుంది కదా, అది కలెక్ట్ చేసి ఒక పేపర్లో పడేసి వెలిగించాలని ప్లాన్ వేసాడు. అప్పుడు స్పార్క్స్ వస్తాయని వీడికి స్పార్క్ అయ్యింది. అంతే వెంటనే అవి కలెక్ట్ చేసి పేపర్ అంటించాడు. కాని స్పార్క్స్ రాలేదు. సొ దగ్గరకు వెళ్ళి, మళ్ళీ చేస్తే సూపర్ స్పార్క్‌లు ఎంతగా అంటే వాడి మొహంలో కనుబొమ్మలు మొత్తం కాలిపోయి ఆ ఏరియా మొత్తం ఖాళీ అయ్యింది. మరుసటి రోజు స్కూల్‌కు వస్తే అంతా ధెయ్యం అనుకున్నారు. నేను కూడా భయపడిచచ్చా. మొహంలో eyebrowsను నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. కాని eyebrows లేకపోతే ఎంత బీ...బీ...భీభత్సంగా వుంటుందో అప్పుడే తెలిసింది.

--------------------------------------------------------------------------------
-- ఇంట్లో చెప్పకుండా వచ్చిన సినిమాకు డాడ్‌కూడా రావడం.
-- టూ మచ్ కష్టాల్లో వున్నప్పుడు...ఇక అయిపోయాం రా అని అనుకున్నప్పుడే మెలకువరావడం, అదంతా కల అని తెలియడం.
-- రోడ్‌లో పోతుంటే స్ట్రేంజర్ అమ్మాయి తనే సమ్ అడ్రెస్ హెల్ప్ అడగడం...!!!
-- మన పేరు పేపర్‌లో రావడం.
-- టికట్స్ దొరకవు అనుకున్నప్పుడు లాస్ట్ మినట్‌లో అనుకోకుండా సినిమా టికట్స్ దొరకడం.
-- స్లామ్ బుక్స్‌లో 'బెస్ట్ ఫ్రెండ్' కాలంలో మన పేరుని ఎవరన్నా రాసారని తెలియడం.
-- ఫిలిం సెలబ్రిటీస్ ఎక్కడన్నా రియల్ లైఫ్‌లో కనపడడం.
-- ఫోన్ కాన్వర్జేషన్ అయ్యాక...ఏదో గుర్తొచ్చి...నవ్వడం.
-- ఆర్కుట్‌లో ఎవరన్నా టెస్టిమోనియల్ రాసినప్పుడు.
-- ఫీవర్‌గా వున్న రోజే, ఇంట్లో నిద్ర రానప్పుడే క్రికట్ మ్యాచ్ వుండడం...
-- మనం వేసిన నార్మల్ జోక్ అబ్‌నార్మల్‌గా క్లిక్ అవ్వడం...
-- చిన్న చిన్న కరెంట్ షాక్స్ కొట్టడం.
-- బ్యాంక్..etc దగ్గర క్యూలో నిలబడినప్పుడు అందరికన్నా మన క్యూ ఫాస్ట్‌గా మూవ్
అవ్వడం...ఇంకా మన ముందరవాడు పనిపడి వెళ్ళిపోవడం..
-- గిఫ్ట్స్ షాప్..etc చోట పొరపాటున ఏదన్నా ఆర్టికల్ పగిలిపోతే వెంటనే ఎవరికీ తెలియకుండా దాన్ని పెట్టేసి జారుకోవడం.
-- పొరపాటున మన కాలు ఇంకొకడి కాలును తొక్కితే వాడు కెవ్వు మనడం.
-- హాస్టల్‌లో వార్డన్ రూంకు గొల్లెం పెట్టడం.
-- లేడీస్ హాస్టల్‌ను బైనోకులర్స్‌లో చూడడం.
-- లంచ్ అప్పుడు మనం స్టార్ట్ చేసే లోపలే మన ఫ్రెండ్ గాడి ప్లేట్‌లో బొద్దింక కనపడడం.
-- ర్యాగింగ్ టైంలో సేవ్ చేసే సీనియర్ కనిపించడం.
-- ప్రతీ ఇయర్ యాడ్ అయ్యే నార్మల్ బ్యాంక్ అకౌంట్ ఇంటరెస్ట్ ఆఫ్ Rs 100/-
--------------------------------------------------------------------------------

మనం రోజూ చేసే చిన్న చిన్న ధింగ్స్...హాబిట్స్..హాబీస్‌లోనే ఎంతో మజా వుంటుంది. అవి అంతాగా మనం గుర్తించం. అలా మనలో స్మైల్ తెచ్చే చిన్న చిన్నవే అయినా చింపుడు థింగ్స్.!!!
-------------------------------------------------------
-- వర్షంలో ఐస్ క్రీం తినడం
-- కూల్ క్లైమేట్‌లో హాట్ బజ్జీలు తినడం
-- మార్నింగ్ మార్నింగ్ వేడి వేడి కాఫీ తాగడం
-- లేట్‌గా నిద్ర లేవడం
-- ఫ్రెండ్స్‌ని కాలితో తన్నడం
-- మమ్మీతో తలంటి స్నానం
-- డాడ్డీతో తన్నులు
-- అమ్మాయిలతో తిట్లు
-- పేపర్ చదువుతూ, TV చూస్తూ, ఫొన్‌లో మాట్లాడుతూ...ఇల్లు క్లీన్ చేస్తుంటే అటూ ఇటూ తిరుగుతూ....ఇలా రక రకాల పనులు చేస్తూ టిఫిన్ తినడం.
-- మంచి రొమాంటిక్ మువీని చూస్తూ హీరో ప్లేస్‌లోకి వెళ్ళిపోయి...తెగ ఊహించేసుకోవడం
-- దోభికి బట్టలు వేసేటప్పుడు పాకెట్స్ చెక్ చేస్తుంటే ఒక 10 రుపీస్ దొరకడం !!!
-- వీధిలో ఎవరన్నా గొడవపడితే యమ యమ ఇంటరెస్టింగ్‌గా చూడడం...!!!
-- పండుగల రోజు TVలో సినిమా ప్రొగ్రామ్స్...!!!
-- ఫర్స్ట్ డే ధియేటర్స్‌లో వుండే గోల
-- స్టేజ్ పై ఫ్రెండ్స్ డ్యాన్స్ చేస్తుంటే స్టేజ్ కింద ఆడియన్స్‌లో గుంపులో గోవిందం డ్యాన్స్...!!!
-- చిన్న చిన్న ఎగ్జామ్స్‌లో లెక్చరర్స్‌కు తెలియకుండా కాపీ కొట్టడం..
-- సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్‌లో బగ్‌ని బెగ్ చేసి..చేసి లాస్ట్‌కి అది కరుణించి కోడ్ రన్ ఐతే వచ్చే రిలీఫ్.
-- yahoo/gtalk/orkutలో తెలిసిన అమ్మాయి ఆన్‌లైన్ వస్తే...
-- గురువారం గుడికి వెళ్తే పద్ధతిగా ఉన్న తెలుగు జులియట్స్‌లాంటి అమ్మాయిలు కనిపిస్తే...
-----------------
-- వర్షం స్టార్ట్ అయినప్పుడూ వచ్చే స్మెల్.
-- క్రాకర్స్ కాల్చినప్పుడు వచ్చే స్మెల్.
-- కిరోసిన్, పెట్రోల్...సువాసనలు...
-- హనీని అరచేతిలో వేసుకుని నాకడం
-- చిన్నప్పుడు షార్ట్ హైట్‌తో లెన్‌తీ బెడ్ షీట్స్‌ను మడతబెట్టడం.
-- చిన్నప్పుడు బనియన్ వేసుకునేటప్పుడు చేతులు, హెడ్ చిక్కుకోవడం.
-- బంద్ అని స్కూల్‌కు హాలిడే ఇవ్వడం.
-- స్కూలింగ్లో శనివారాలు అంతా హాపీస్..ఎందుకంటే కలర్ డ్రెస్ వేసుకోవచ్చు కాబట్టి.
-- కరెక్షన్ మిస్టేక్ జరిగి ఎక్కువ మార్క్స్ రావడం.
-- కొత్త నోట్‌బుక్స్ కొని..అట్టలు వేసి, స్టాప్లెర్ పిన్స్ కొట్టి, స్టిక్కర్ అతికించి..నేమ్..etc రాసుకోవడం.
-- సమ్మర్ హాలిడేస్ హోమ్ వర్క్‌ను హాలిడేస్ అయిపోయాకా కూడా స్టార్ట్ చెయ్యకపోవడం.
ఒక రోజు స్కూల్ డుమ్మా కొట్టి మొత్తం ఆ రోజే రాయలేక చావడం.
-------------------------------------------------------

(టింగ్లిష్ లో టపా ఇక్కడ)
------------------------
* నువ్వు బీడు బడిన బ్లేడ్‌రా.
* చెత్తకుప్పలో విరిసిన చామంతి పువ్వు.
* సగం కంపైల్ అయిన కోడ్‌వి.
* ట్యాక్స్ కట్టేందుకు టికానా లేదుకాని ట్యాక్సీ కావాలన్నాడంట నీలాంటోడు.
* ఎండ్రిన్ డబ్బాలో ఏరుసెన్నక్కాయలు దాచుకుని తినే ఎర్రి పిల్ల.
* వైరస్ సోకిన వై.ఎస్‌లా వున్నావ్
* లాలి పాటను రీమిక్స్ చేసి మాటలు రాని పిల్లలతో బూతులు తిట్టించుకునే బూచోడా.
* ఇన్నోవాలో ఇసుక తోలుకునే మొహం.
* నువ్వు గ్రేట్ఆంధ్రా.కామ్ గాసిప్‌వి రా.
* నకిలి హార్లిక్స్ హోలోగ్రామ్‌లా అలా మెరిసిపొతున్నావ్ ఏంట్రా ?
* నువ్వు ఇన్‌స్టాలేషన్‌కు పనికి రాని సెట్అప్ ఫైల్‌వి.
------------------------

(టింగ్లిష్ లో టపా ఇక్కడ)
------------------------
* చీపురు కూడా చీప్‌ది కొనే చప్రాసెదవ.
* analysis అంటే paralysisకు అన్న అనుకునే ఆంగ్ల వైకల్యుడా.
* ధియేటర్‌లో ‘Balcony’ అని చూసి, బాల్ కొని వస్తేనే రానిస్తారు అనుకుని బాల్ యెక్కడ అమ్ముతారు అని అడిగే అరగుండెదవ.
* సత్తు సామానోడికి సాఫ్ట్‌వేర్ అమ్మాలనుకునే మొహం.
* ఐ-మాక్స్ సినిమాకు బైనోకులర్స్ పట్టుకెళ్ళే బేఖూఫ్ ఎదవ.
* వినాయక చవితి రోజు గణేష్ బీడిలమ్మే గలీజ్‌గా.
* బొచ్చు పీకిన bear (ఎలుగు బంటి )లా వున్నావ్.
* గండి పడిన చెరువులో ఈతకొట్టే మొహము చూడు.
* కలర్ TVని బ్లాక్ అండ్ వైట్ మోడ్‌లో చూసే ఎదవ.
* యుద్ధానికి పొతూ కత్తి మర్చిపోయే మొహం.
------------------------

(టింగ్లిష్ లో టపా ఇక్కడ)
-------------------------------------------------------
* నువ్వు నంబర్ గోకేసిన రీఛార్జ్ కార్డ్‌విరా.
* TVలో వచ్చే సినిమాను కూడా రివ్యూ చదివి చూసే మొహం.
* ప్రొఫైల్ విజిటర్స్ పెరగడం కోసం ముమైత్ ఖాన్ ఫోటోను డిస్‌ప్లేగా పెట్టుకునే కక్కుర్తెదవా.
* కట్టింగ్ షాప్‌లో కత్తెర దొంగిలించే ఫేసు.
* తాత ఫోటోను టాట్టూ వేయించునే తలమాసిన ఎదవా.
* పిచుకల గూట్లో పీసుమిఠాయి వెతికే పింజారెదవా.
* కలలో కలాంను కలవరించే కలర్ బ్లైండ్‌నెస్ ఫెలొ.
* తుఫానులో తువాలు పొయిందని ఫీల్ అయ్యే తుప్రాసెదవ.
* అరోగ్య శ్రీ యాడ్‌ను పైరసీ చేసి అమ్మే అరమైండ్ ఎదవ.
* youtubeలో నంది పైపులు, tubeలు వెతికే మొహం.
-------------------------------------------------------

(టింగ్లిష్ లో టపా ఇక్కడ)

ప్రశ్న: కోపం వస్తే నీ ఎంకమ్మ అంటారు, కానీ నీ ఎంకయ్య అనరు ఎందుకబ్బా ?
ఒక సమాధానం: పూర్వకాలంలో ఒక సారి ఒక మాష్టారు, టెస్ట్ పేపర్స్ కరెక్షన్ చేస్తుంటే ఒక బుడుగు గాడి తెలివి తేటలకి తల తిరిగింది. ఇంతకీ సదరు స్టూడెంట్‌గారు ఏం చేసారంటే,
ఆన్‌సర్ షీట్లో ఆన్‌సర్స్ అన్నింటిలోనూ...
లైన్, పేజ్ చివరకి రాగానే అక్కడ నుంచి నెక్స్ట్ లైన్ స్టార్టింగ్ వరకు ఒక లైన్ గీసి డైరెక్షన్స్ వేసాడు.
ఏంట్రా ఇది బడుధ్ధాయ్ అంటే,
“కామా సర్, అక్కడ నుంచి కంటిన్యుయేషన్ ఇక్కడ వుంది అని కామాను, అన్‌కామన్‌గా వేసాను, అయినా కామా సైజ్ ఇంతే వుండాలి అని ఎవరు సెప్పలేదు కదా మాస్టారు ????" అన్నాడు.
"వార్నీ ఏం కామా, ఏం కామా.........." అని గురువుగారు ఆశ్చర్యపోయారు.
అప్పటి నుంచి వాడ్ని ఏం కామా, ఏం కామా అనడం మొదలెట్టారు. ఇది కాలక్రమంలో 'ఎంకమ్మాగా రూపాంతరం చెందింది.
అందువళ్ళ ఇక్కడ అమ్మ-అయ్య అనే ప్రస్తావనే ఇల్లే....!!!

(టింగ్లిష్ లో టపా ఇక్కడ)
కప్ప - The Frog (ఇది క్యాప్షన్)
బెక బెక బెక బెక (ఇది ఇంట్రొడక్షన్)
- Fog అంటే Frogsకు ఇష్టం.
- లక లక లక క్రియేషన్ బెక బెక బెక నుంచే వచ్చిందనుకుంటా.
- ఎవర్ స్మైలింగ్ ఫేస్. ఏడ్చినా నవ్వినట్టే వుంటుంది.
- పాములకు దిల్‌ఖుష్ డిష్.
- ఇంటర్ Bi.P.C గ్రూప్ వాళ్ళకు ఇవంటే చంపేంత ఇష్టం. ఆ డిసెక్షన్ వీటికి డెత్ సెక్షన్. ప్రజలకు పార్ట్స్ తెలియడం కోసం ప్రాణాలు అర్పించే పేట్రియార్ట్స్.
- ఇవి ఆంఫిబియాన్స్. వాటర్ లోను, వరండాలోను వుండగలవు. దుర్యోధనుడికి ఇవే ఇన్స్పిరేషన్ అనుకుంటా.
- ALL OUT మస్కిటో మటాషర్‌కి బ్రాండ్ అంబాసిడర్.
- వీటి పెట్‌నేమ్ టాడ్‌పోల్.
- బల్లి దీనికి చెల్లి లాంటిది.
- వీటికి వర్షాకాలం అంటే ఇష్టం. ఈ కాలం హీరోయిన్స్‌లా వర్షం పడిందంటే చాలు మంచి బెక బెక రేసీ ట్యూన్‌ని కుప్పలు కుప్పలు కప్పలు గ్రూప్ సాంగ్‌లా పాడుకుంటాయి.
- పాచి వీటికి అపాచి బైక్ లాంటిది. పాచంటే పడి చస్తాయి.
- ఆర్టిస్ట్‌లు ఆరంభంలో వేసే ఆక్రుతి వీటిదే. వెరీ సింపిల్ టు draw యాజ్ దె లుక్ raw. ఎంత
చండాలంగా గీసినా పోలికలు కనిపిస్తాయి. అదే వీటి గ్రేట్‌నెస్.
- హాసిని లాంటి కప్పలు ఎప్పుడు ఎగురుతూనే వుంటాయి.
- వీటికి సీటింగ్ ఫెసిలిటి వుంది. అందుకే సిట్టింగ్ కే ప్రిఫెరెన్స్ ఇస్తాయి.
- ఇవి అంత స్మార్ట్‌గా వుండవు. 21st సెంచురిలో కూడా వీటినింకా అన్‌టచబుల్స్‌గా చూస్తున్నారు.
- కప్ డిజైన్ కప్ప నుంచే వచ్చిందనుకుంటా.
- స్విమ్మింగ్, సింగింగ్, జంపింగ్, వెంట్రిలోక్విజం (పెదాలు కదిలించకుండా, గొంతుతో మాట్లాడటం)...etc అద్భుత వాణి వున్న మల్టి టాలెంటెడ్ ప్రాణి.
- వీటికి కళ్ళు కాయలు కాచినట్టుగా వుంటాయి. ఇలాంటి కళ్ళ వళ్ళే కాషియస్‌గా వుంటాయి.
- కప్పలు ఆర్ fond ఆఫ్ ponds.
- కప్పలు గురించి లోకానికి తెలిసింది తక్కువే, తెలియంది కూడా తక్కువే.
ఎనీవేజ్ బెక బెక లాడుతూ బిక్కు బిక్కు మంటూ బ్రతికే బడుగు జీవులైన కప్పలకు కాలం కలిసి రావాలని కోరుకుంటూ.
ది ఎండ్

ప్రశ్న: పవర్‌ఫుల్ ఛాలెంజ్ సీన్స్‌లో మన హీరోలు తొడనే ఎందుకు కొడతారు ?
ఒక సమాధానం:
తలకాయ్‌కు కొట్టుకుంటే తెలివి less అన్నట్టు వుంటుంది,
forehead, నోరుకు కొట్టుకుంటే ముసలి లేడిస్, 'నా ఖర్మ/నీ ఖర్మ/ఎంకమ్మా మేనరిజంలా వుంటుంది,
చెంపలేసుకుంటే ఈడు తప్పు చేసినట్టుంటుంది,
హార్ట్‌కు కొట్టుకుంటే మొహరం పండుగ అనుకునే చాన్స్ వుంది,
వీపుకు కొట్టుకుంటే భయపడినట్టుంటుంది,
కడుపుకు కొట్టుకుంటే జెలసి వళ్ళ అనుకునే చాన్స్ వుంది,
హిప్ కు కొట్టుకుంటే డ్యాన్స్ స్టెప్‌లా వుంటుంది,
కాళ్ళకి కొట్టుకుంటే ఎగ్సర్సైజ్‌లా వుంటుంది,
ఇంక మిగిలింది ఓన్లీ తొడ, సొ అందువల్లే హీరో్‌లు ఇది వాడుతున్నారనుకుంటా :)

(టింగ్లిష్ లో టపా ఇక్కడ)
—————————
స్టార్ట్:
ఇంటర్ ఎగ్జామ్స్ టైంలో ఒక ఇంట్లో ఒక కుర్రాడు పుస్తకాలు ముందేసుకుని మధ్య, మధ్యలో తల గోక్కుంటూ చదువుతుంటాడు. పేలు, చుండ్రు ప్రోబ్లెమ్ అని పాపం ఆ కన్నతల్లి large intestine తల్లడిల్లి కొడుకు తల దువ్వడానికి ట్రై చేస్తుంది. కానీ కొడుకు ప్లీజ్ మమ్మీ డోంట్ డిస్టర్బ్ మీ, ఎగ్జామ్స్ తర్వాతే దువ్వుకుంటాను, అంత వరకు చ-దువ్వుకుంటాను, పేలు గురించి ఆలోచిస్తే ఫేలు అవుతాను, అంటాడు.

కట్ చేస్తే...

ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయని ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. వీడు ఆత్రముగా అడిగితే, సారీ రా నీ నంబర్ కనిపించడం లేదు అంటాడు. వీడు షాక్ తిని ఫోన్ కట్ చేసి తల పట్టుకుని ఒకటే గోక్కోడం...తల్లి చూసి వెంటనే మన కంపెనీ దువ్వెన పట్టుకుని కొడుకుని ఓదారుస్తూ దువ్వుతుంది.

మళ్ళీ కాల్ వస్తుంది, ఈ సారీ ఆ ఫ్రెండ్ గాడు, "ఏంట్రా కట్ చేసావ్ ? నీ నంబర్ లేదూ ఏకంగా నీ పేరే వుంది, నువ్వు టాపర్ వని చెప్పాలనుకున్నా" అంటాడు.

అప్పుడు కన్నతల్లి కళ్ళ నుండి నాలుగు బొట్ల సుక్కలు దువ్వెన పై పడతాయి....వెంటనే గిఫ్ట్‌గా ఏమి ఇవ్వాలో తెలియక ఆ దువ్వెన్నె కొడుకు సేతిలో పెడుతుంది.

ఎండ్
—————————
మా దువ్వెనలు…అందిస్తాయి దీవెనలు…
మా దిక్కుమాలిన దువ్వెనలు మీ అదృష్టాన్ని కూడా దువ్వుతాయి…

ప్రకటన - 2

Posted by అశోక్ వర్మ | 12:15 PM

(టింగ్లిష్ లో టపా ఇక్కడ)
—————————
స్టార్ట్:
ఠాగూర్ సినిమా స్టార్టింగ్ సీన్స్ లాగా చూపిస్తాం....
పేపర్లో హెడ్లైన్స్, నిన్న ఒక్క సారిగా కర్నూల్ లో 15 కేసులు క్లియర్ అయ్యాయి....వైజాగ్ లో 20 కేసులు ....ఇలా రాష్ట్రం మొత్తం పెండింగ్ లో వున్న కేసులు చాలా ఒకే రోజు క్లియర్ అయ్యాయి అని. ఇది పెద్ద సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. ఇండియా మొత్తం ఉలిక్కి పడుతుంది. ఇది నమ్మసక్యంగా లేదు అని. రోజు నుంచి ప్రతి రోజు టూ మచ్ గా కేసులు క్లియార్ అయిపోతూ వుంటాయి.
ఇది ఎలా జరిగిందా అని ఎవరికీ అర్థం కాక గవర్నమెంటు కుతూహలం కొద్దీ విచారణ కమిషన్ వేస్తుంది. వాళ్ళు ఎన్నో రకాలుగా ట్రై చేసినా అర్థం కాదు. చివరకు మన హీరో గారు అస్సలు పాయింట్ కనుక్కుంటారు.

రాస్ట్రంలో వున్న అన్ని జైల్స్కు వెళ్ళే సోప్స్ కాంట్రాక్ట్ సారి 'హమామ్' కంపెనీకి రావడం వళ్ళ ప్రొప్రైటరీ, పేటెంటెడ్ నిజాయతీ ఇంగ్రేడియంట్ వళ్ళ నిందితులందరూ హమామ్ బాయ్స్ అయిపోయారని :)

ఎండ్
—————————

ప్రకటన - 1

Posted by అశోక్ వర్మ | 11:59 AM

(టింగ్లిష్ లో ఈ టపా ఇక్కడ)
—————————
స్టార్ట్:

ఒక రోడ్ పైన ఒక అమ్మాయి వెళ్తుంటుంది. అక్కడ చాలా మంది అబ్బాయిలు వుంటారు. తనను కామెంట్ చేసినవ్వుకుంటుంటే, కోపంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, నెక్స్ట్ ఫ్రేంలో పోలీస్ స్టేషన్లో అందరు బాయ్స్ నిలబడి వుంటారు. ఐడెంటిఫికేషన్ పరేడ్ అన్నమాట.

పళ్ళు రాల గొట్టండి ఒక్కొక్కడివి, అని తను ఐడెంటిఫై చేస్తూ వుంటుంది. అలా అందరినీ ఐడెంటిఫై చేస్తుండగా మన హీరోగారు కూడా గ్యాంగ్ లో వుంటారు. ఇప్పుడు లైన్లో వుంటాడు. హీరోయిన్ తన ముందుకు రాగానే తను స్మైల్ ఇస్టాడు. అప్పుడూ షైనింగ్ షైనింగ్ పళ్ళు
కనపడతాయి. అంతే హీరోయిన్ ఇతడు కాదు అంటుంది. హీరో గారు వాడేది మన కంపెనీతోం తోం తోం" (చంద్రముఖి స్టైల్....) టూత్ పేస్ట్ అన్నమాట.

"ట్యాగ్ లైన్: మా టుత్ పేస్ట్ మీ పళ్ళనే కాదు, ఎదుటి వారి మనస్సులను కూడా తోముతుంది.
జస్టిఫికేషన్: మన పేస్ట్ వాడిన పళ్ళని చూస్తే, పళ్ళు రాలగొట్ట మన్న వాళ్ళు కూడా పరవశించిపోతారన్నమాట.

ఎండ్
—————————

(టింగ్లిష్ లో ఈ టపా ఇక్కడ)
*****
కన్న తల్లి ప్రేమ కటింగ్ ప్లేయర్ లాంటిది. ఎంత కటింగ్ ఇచ్చే కొడుకైనా ఈ ప్లేయర్ ప్రేయర్ కు బెండ్ అవ్వాల్సిందే.
*****
జీవితం జీబ్రా లాంటిది.
బ్లాక్ లైన్స్ ==> కష్టాలు…
వైట్ లైన్స్ ==> సుఖాలు..
*****
కష్టాలు కాకి లాంటివి.
– ఎవరన్నా అతిధులు వస్తే కావ్ కావ్ అంటాయి.
– అవి టచ్ చేస్తే బ్యాడ్ జరుగుతుంది.
– మనం కరంట్ తీగళ్ళ వుంటే మాత్రం చస్తాయి.
– దానికి మన నుంచి ఫుడ్ దొరికేంత వరకూ ఎంత అదిలించినా అక్కడక్కడే తిరుగుతుంటాయి.
*****
సున్నం సున్నా లాంటిది.
సింగిల్ గా వుంటే సినిమా లేదు. మల్టీ స్టారర్ ఐతేనే హిట్ అవుతుంది.
Eg: సున్నం + వాటర్ ==> వైట్ వాషింగ్.
సున్నం + ఆకు + వక్క ==> తాంబూలం.
*****(టింగ్లిష్ లో టపా ఇక్కడ)
అంబాఆఆఆఆఆఆ…..(ఇది ఇంట్రోడక్షన్)
ఆవు చాలా లావు
ఆవులకు బలం వున్నా బలుపు లేదు.
– Ponds, Palmolive
లేకున్న బ్రతకొచ్చుగానీ పాలు లెకుండా బ్రతకలేము, సరిగ్గా పయింట్లోనే టచ్ చేస్తుంది ఆవు.
ఆవుకి క్లోజ్ కాంపిటీటర్ బర్రె. కాని కలెక్షన్స్, క్రేజ్ ఆవుకే ఎక్కువ వుంటాయి. అంటే బాక్గ్రౌండ్ తో వచ్చిన హీరో టైప్ అన్నమాట. ఎంత కష్టపడ్డా బర్రె ని అంత పట్టించుకోరు. మేకలు, గాడిదలు చిన్న చిన్న హీరోలు అన్న మాట.
ఆవు ఆవురావుర మంటూ గడ్డి మేయును. ఆర్ఫన్ ఆవులు అప్పుడప్పుడు కాగితాలు కూడా మేయును…కాని ఆవు ప్యుర్ వెజ్జి.
ఆం ఆవులకు జెర్సి ఆవులను చూస్తే జెలసి. అందుకే అవి అంత మాట్లాడుకోవు. తెలుగు హీరోయిన్స్ Vs ముంబై మోడల్స్ కు వున్నంత కాంఫ్లిక్ట్ వుంది వీటిల్లో.
ఆవులు IAS ఆఫీసర్ అంత గౌరవం పొందుతాయి. కుక్కల నుంచి, క్రిమినల్స్ వరకు అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. ఆవు అంటే ’sacred’ ఫీలింగ్ వున్నందున సన్నాసులకు కూడా ‘scared’ ఫీలింగ్.
లేడీస్ కు నడుము యెలాగనో, ఆవూలకు తోక అలాంటిది. యంగ్ ఆవులు భలే వయ్యరంగా ఊపుతూ డ్యాన్స్ చేస్తాయి. సో తోక ఆవుల బ్యుటీ స్పాట్.
సైలెంట్ హీరోయిన్లా వుంటుంది. యెక్కువ మాట్లాడదు.
మాగ్జిమం అన్ని ఆంటీ ఆవులకు ఒబేసిటి ప్రాబ్లం వుంటుంది. అందుకే ఎక్కువగా వాకింగ్ కు వెళ్తుంటాయి.:
చ్యూయింగ్ గం తింటున్నట్టు గా గడ్డిని తింటూనే వుంటాయి.
ఆవు ఫేవరెట్ కలర్స్ గ్రీన్/యెల్లో. గ్రీన్ గడ్డిని చూస్తే గుడ్డిగా తినడం తప్ప ఏమి తెలియని అమాయకురాలు. కాని తెలుగు భాషలొ తనకు నచ్చని ఒకే ఒక పదం ఎరుపు. వీళ్ళ హబ్బీస్ కు వీటికన్నా ఎక్కువ కోపం కలర్ పైన. కలర్ డ్రెస్ వెసుకుని కనపడితే రంగు పడే చాన్స్ వుంది.
ఆవుల హబ్బీస్..ఆంబోతులన్న మాట. అవి చాలా రెక్లెస్స్…అస్సలు ఫ్యామిలీ మాటర్స్ పట్టించుకోవు. సెంటిమెంట్ సీన్స్ అన్నీ ఆవుకే వదిలేసి…వెళ్తుంటాయి. సిన్సియర్ పతి(హస్బండ్) లేకపోవడం వళ్ళే ఆవులకు సింపతి వస్తుంది.
పండగలప్పుడు ఆవులు పండగ చేసుకుంటాయి….చాలా మంది పార్టి ఇస్తారు ఆరోజు. చాలా వెరైటీ ఐటమ్స్ టేస్ట్ చేసే చాన్స్ ఉంటుంది, కొత్త బట్టలు…ఇంకా అడిషనల్ రెస్పెక్ట్, ఆహా..ఓహో.
పెట్ గా పెట్టుకోవలసిన యానిమల్.
సో రోజుకు ఒక్కసారైనా హార్ట్ పూర్తిగా ఆంభాఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ అని అల్టి యానిమలైన ఆవుకు సెల్యుట్ చేద్దాం.

(టింగ్లిష్ లో ఈ టపా ఇక్కడ)
వైరస్ ప్రోగ్రాం గిఫ్ట్ గా ఇవ్వడం. అదెలా వుండాలంటే తను ఒక సారి క్లిక్ చేస్తే "ఐ లవ్ యు" నేం వున్న వందల, వేల ఫైల్స్ సిస్టం అంతా విచ్చలవిడిగా క్రియేట్ అవుతూనే వుండాలి. ఫర్స్ట్ లో తనకు చిరాకు వస్తుంది, సిస్టం దొబ్బింది కదరా ఎదవ సచ్చినోడా అనుకుంటూ తిట్టుకుంటూ, డిలీట్ చెయ్యాలని ట్రై చేస్తుంది. కానీ ఒకటా రెండా ఎన్నో వేల ఫైల్స్ :( కొద్ది కొద్దిగా నీ ప్రేమలో వున్న దోమల సంఖ్య అర్థం చేసుకుంటుంది....

క్రమంగా..అక్రమంగా సిస్టం హాంగ్ అవుతుంది..అప్పుడు నిన్ను 'హ్యాంగ్ హ్యాంగ్ బజావో బ్యాంగ్ బ్యాంగ్' అన్నంత కోపం వస్తుంది. అప్పుడు మొద-లవ్-తుంది అస్సలు సినిమా. సిస్టం రిస్టార్ట్ చేస్తుంది. అప్పుడు బ్లాంక్ బ్లాక్ స్క్రీన్ పై కలర్ ఫుల్ గా నువ్వు కనిపిస్తావ్. ఇక అంతే తెగ నచ్చేస్తావ్ అప్పుడే టైమింగ్ కుదిరి 'ప ని ని స సా టైప్స్ లో విండోస్ డీఫాల్ట్ ఆడియో సౌండ్ వస్తుంది. అందులో ఇంత రోమాంటిక్ ఫీలింగ్ వుందా అని తనకు అనిపిస్తుంది.
నీకు ఫోన్ చేస్తుంది.
నువ్వేమో నీ రొమాంటిక్ ఐడియా కు రెస్పాన్స్ గా 'ఐ లవ్ యూ చెప్తుందని వెయిట్ చేస్తుంటావ్. తను మాత్రం 'ఐ కెవ్ యూ అన్నట్టు. 'నీ అబ్బ అసలే అరకొరగా ఆర్కుట్ వస్తోంది. ఇప్పుడు అది కూడా దొబ్బెట్టావు కదరా...' అని ఫీల్ అవుతుంటే
నో ప్రోబ్స్ డియర్..ప్రతీ లవ్ వైరస్ వెనకాలా ఒక సైరస్ వుంటాడు
సిస్టం నుంచి వైరస్ పోదా అన్న టెన్షన్ పట్టుకుంది చెప్పు రా బాబు అంటుంది. అప్పుడు నువ్వు, ఒసెయ్ పిచ్చి యెంకి అదే ప్రోగ్రాం ను మరో సారి క్లిక్ చేస్తే అన్ని డిలీట్ అవుతాయే అని నువ్వు చెప్పగానే...
'అస్సలు నీకు ఇన్నాళ్ళు ఆర్కుట్టింగ్ తప్ప ఏమి తెలీదనుకున్నా....నీలో ఇంతగా హార్ట్ కుట్టింగ్ అంటే నాలో కూడా ప్రేమ పుట్టింగ్' అనగానే నువ్వు :) :) :)

W

Posted by అశోక్ వర్మ | 4:44 AM

( టింగ్లిష్ లో ఈ టపా ఇక్కడ )
W

టైటిల్ ఏంటి ఇలా వుందనుకుంటున్నారా ? సెప్తా సెప్తా..

W = U + U అంటే 'నువ్వే నువ్వే' అన్నమాటా

టైటానిక్ మూవీని గురువుగారు త్రివిక్రం శ్రీనివాస్ కున్న అశేష అభిమానుల్లో నాలాంటోడొకడు తీస్తే ఎలా వుంటుందో అని సరదాగా రాసిన టపా. దయచేసి అన్యథా భావించకండి. ఆర్కుట్ లో ఒక కమ్యూనిటీలో ఒక టాపిక్ కింద వ్రాసినది. ఓవర్ టు ద టాపిక్.
---------------------
హీరో 'జాక్ రిచీ' ఆవారాగాడు. హీరోయిన్ 'ఏంజిల్ లీ' అంటే తన అయ్య విష్ నాథ్ కు ఫైవ్ పాయింట్ సంవన్ (పంచ ప్రాణాలకన్నా ఎక్కువ). ఏంజిల్ లీ కి డాడ్, బర్త్ డే గిఫ్ట్ కింద టైటానిక్ టూర్ ఇస్తాడు. అక్కడక్కడ ఆడుకోడానికి ఒక బుల్లి బోట్ కొనిపెడతాడు. మన హీరో గారు, సముద్రంలో తెప్ప మీద జల్సా చేసుకుంటూ వచ్చీ టైటానిక్లో కూలి పనులు చేసుకునే అమ్మాయిలకు బీట్ ఏస్తూ ఏంజిల్ లీ బోట్ను తెప్పతో గుద్దేస్తాడు.

అప్పుడు ఏంజిల్ లీ: కొని వారం కూడా అవ్వలేదు. కళ్ళు దొబ్బాయా ?
అని క్లాస్స్లు..

దానికి రిచీ గాడు: తెప్ప నడపడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా ? సముద్రానికి క్రొత్తా ? సీనియర్స్ అంటే భయం లేదా ?
అని కౌంటర్స్ ఇచ్చీ..పద కాంటీన్ కెళ్దామని, టైటానిక్ లోనికి తీసుకెళ్తాడు. బాగా మేస్తాడు. బిల్ కట్టే టైంలో ఏంజిల్ లీ డబ్బులు నిల్ అని చెప్పడంతో, వీడు పర్స్ కోసం బాక్ పాకెట్ చూసుకుంటే...బెబ్బే..అప్పుడూ ఏంజిల్ లీ వీడ్ని చూస్తుంటే...
రిచీ: షిప్ ను చూడాలనుకో తప్పులేదు, హిప్ ను చూడాలనుకోకు చచ్చిపోతావ్, అస్సలే నాకు బలుపెక్కువ
అని అంటాడు. అలా పరిచయం స్టార్ట్ అవుతుంది.

--------
నెక్స్ట్ సీన్లో...
రిచీ: సరదాగా టానిక్ తాగుదామా ?
ఏంజిల్ లీ: మనం బానే వున్నాం కదా టానిక్ ఎందుకు ?
రిచీ: దగ్గు వున్నప్పుడు టానిక్ ఏ ఎదవన్నా తాగుతాడు, కాని లేనప్పుడు తాగే వాడే రోమాంటిక్ ఫెలో. సో లెట్స్ ట్రై టానిక్ ఇన్ టైటానిక్
--------

ఇలా లవ్ ముదిరి ముదిరి కుళ్ళుతుంటుంది...

ఆ టైంలో
ఏంజిల్ లీ: నాకు భయమేస్తోంది రిచీ, నాకు ఈత రాదని, ఈవ్ టీజింగ్ చేస్తున్నావ్ అనిపిస్తోంది. బోర్ కొట్టెస్తే వదిలేస్తావా ?
రిచీ: పిచ్చి ఏంజిల్ లీ, అల్లరి-ఆకలి-ఏంజిల్ లీ ఎప్పుడు బోర్ కొట్టవ్...

ఏంజిల్ లీ .......ఫ్లాట్
----------
విష్ నాథ్ కు విషయం తెలుస్తుంది. రిచీనీ తన అసిస్టంట్ సారా.డి తో పిలిపిస్తాడు. బీచ్ వాలీ బాల్ ఆడుతుంటున్న, రిచీ వస్తాడు. ఇప్పుడు రెండు ముక్కులతో ముఖా ముఖి.

విష్ నాథ్: నువ్వు జీవితంలో ఏమి చెయ్యాలనుకుంటున్నావ్ ?
రిచీ: చాపలు పడదామనుకుంటున్నా...

విష్ నాథ్: ఆహా....ఆ తర్వాత
రిచీ: ఎండ బెడతా, అంకుల్

విష్ నాథ్: తర్వాత
రిచీ: దుమ్ము దులిపి, మళ్ళీ ఎండ బెడతా అంకుల్. అలాగే ఎండ బెడుతూ వుంటే మేము వుండమేమో అంకుల్...మరీ కంపుకొడతాయి.

విష్ నాథ్: అంతే తప్ప ఎండు సేపలతో ఎరైటీ బిజినెస్ చేద్దాము లాంటి ఆలోచనలు లేవా నీకు ? నేను ఒట్టి చేతులతో ఈ ఊరొచ్చాను, ఒట్టి సేపలతోనే కోట్లు సంపాదించాను.
రిచీ: మీ కొడుకేం చేస్తుంటాడు అంకుల్ ?

విష్ నాథ్: వాడు నా కంపెనీ లన్నింటికీ ఎం.డి
రిచీ: అదేంటండి మీ లెక్క ప్రకారం మీ అబ్బాయికి ఒకట్రెండు ఒట్టి సేపలు ఇచ్చి, బిజినెస్ చెయ్యమని చెప్పాలి కదా ? తప్పు అంకుల్ తప్పు. మనమొక పది సేపలు పడితే, మన పిల్లలు పదకొందో సేప నుంచి మొదలెట్టాలి కానీ........

విష్ నాథ్: నా కూతురు నీతో ఒట్టి సేపలు తినే స్టేజ్ కు వచ్చిందంటే, నువ్వు ఒట్టి మనిషివి కాదనుకున్నాను, కాని ఒట్టి ఎదవ వని తెలిసింది. కావాలంటే నీకు ఒక సేపల మార్కెట్ రాసిస్తాను, నా కూతుర్ని వదిలెయ్...

(ఇలా డిస్కషన్ సాగి........సాగి...)

విష్ నాథ్: మీరు ప్రేమించుకున్న ఈ టైటానిక్ లోనే నా కూతురి పెళ్లి సారా.డి తో చేస్తాను
(అని సవాల్ చేస్తాడు)

ఇప్పుడిక క్లైమాక్స్....
కరక్ట్ గా పెళ్లి కొడుకు సారా.డి, ఏంజి లీ కి తాళి కట్ట బోతుంటే, ఎవ్వరూ 'ఆపండీ అనకపోయినా ఐస్ బెర్గ్ వచ్చి టైటానిక్ ను స్లైట్ గా గుద్దేస్తుంది. పెళ్లి ఒక 5 మినిట్స్ డిస్తర్బ్ అవుతుంది. అంతే రిచీ వచ్చి, పాస్టర్ గారు టైం ఎంత అయ్యింది అంటాడు. ముహూర్తం దాటి 5 మినిట్స్ అయ్యింది అని కంఫర్మ్ చేసుకున్నాక
రిచీ: చూసావా విష్ నాథ్, పెళ్లికి ముఖ్యమైనవి ముహూర్తం మరియు మూడ్. అలాంటిది ఇప్పుడు రెండూ డిస్టర్బ్ అయ్యాయి. నువ్వు సరిగ్గా ఏంజిల్ లీ పెళ్లి చెయ్యలేకపోయావ్, నువ్వు ఓడిపోయావ్
అని క్లాస్ పీకడంతో, ఇంకా ఎక్కువ సేపు, క్లాస్ వింటూ కూర్చుంటే టైటానిక్ కూలి పోతుందని బాబ్బాబు, నీ తెప్పలో ఏవో తిప్పలు పడి మమ్మల్ని ఒడ్డుకు చేర్చు. నా కూతుర్ని నీకిచ్చి పెళ్లిచేస్తాను. అని గిచ్చి మరీ చెప్తాడు.