శభాష్ శభాష్ శభాష్ - 8
2004లో ఇంటర్నెట్ వాడకం అప్పుడప్పుడే ఊపందుకుంటున్న టైం. మా ఫ్రెండ్ ఒకడు బెంగుళూరు వెళ్లిపోతుండడంతో ఆంధ్రాలో ఉండే తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయికి నెట్‌ని ఇంట్రొడ్యూస్ చేసాడు. సో దట్ నెట్ ద్వారా టచ్‌లో ఉండొచ్చని. తనకొక రెడిఫ్ మెయిల్ ఐ.డి క్రియేట్ చేసాడు. పాస్‌వర్డ్ మార్చుకోవడం చూపించాడు. తర్వాత తను మార్చుకుంది. నెక్స్ట్ డే ఈడు బెంగుళూరు వెళ్లిపోయాడు. వెళ్లిన రోజే నాకు ఫోన్ చేసాడు. బాబోయ్ మనమంటే ఈడికి ఇంత ఇష్టమా, అని నేను ఫీల్ అయ్యేంతలోనే చావుకబురు చల్లగా చెప్పాడు. వాడు తొందరపడి ఏదో ఎమోషనల్ మెయిల్ కొట్టాడంట. దాన్ని ఆ అమ్మాయి చూడకుండా చెయ్యాలి, ఎలా రా అని అడిగాడు. ఆ అమ్మాయి ఇంక జీవితంలో ఇంటర్నెట్ ముట్టకూడదని నీ బట్టతలపై శపథం చెయ్యించుకో అని చెప్పాను. కాని వాడు సీరియస్‌గా అడుగుతుంటే నేనూ సీరియస్‌గా ఆలోచించడం మొదలెట్టా. మహా అంటే ( ఆర్ అన్నా అనకపోయినా ) రెండు మూడు రోజులు ఆపగలం, ఆ తర్వాత ఎప్పుడైనా తను మెయిల్ అకౌంట్ ఒపెన్ చెయ్యొచ్చు. ఒక్కసారి మెయిల్ చేసాక రివర్ట్ చేసుకునే ఛ్యాన్సే లేదే అని ఆలోచిస్తున్నాం. తను మెయిల్ ఐ.డి పూర్తిగా వాడడం లేదు. సో ఆ ఐ.డి పోయినా పర్లేదు ఆ మ్యాటర్ మాత్రం చూడకూడదు అంటున్నాడు కాని ఆ మ్యాటరేంటో చెప్పట్లేదు. నేనూ ఇంక అడగడం వేస్టని వదిలేసాను.

ఒక ఆప్షన్, తన అకౌంట్ వీడే క్రియేట్ చేసాడు కాబట్టి, ' Forgot Password' ఆప్షన్స్‌కు వెళ్లి పాస్‌వర్డ్ మార్చెయ్యడం. తర్వాత పర్సనల్ డీటెయిల్స్, సీక్రెట్ క్వెషన్/ఆన్సర్ కూడా మార్చెయ్యడం, సో దట్ ఆ ఆమ్మాయి మళ్ళీ పాస్‌వర్డ్ మార్చుకోలేదు. ఆ ఐ.డి తనకి దూరం అయినట్టే. ఇదేదో బానే ఉందిరా అని, ట్రై చేస్తానన్నాడు. కానీ పాస్‌వర్డ్ మరిచిపోయినప్పుడు వచ్చే ప్రశ్నకి సమాధానం మనోడు మర్చిపోయాడు. క్రియేట్ చేసేటప్పుడు ఏదో క్యాజువల్‌గా ఇచ్చేసాడు. ఎంత ట్రై చేసినా ఇలా పాస్‌వర్డ్ మార్చడం కుదరలేదు.


ఇప్పుడెలారా అని మళ్ళీ ఫోన్ చేసాడు. ఆ అమ్మాయి మెయిల్ ఏ టైంలో చూస్తుందో కూడా తెలీదు. సో సాధ్యమయినంత త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి అని టెన్షన్ పడుతున్నాడు, పెడుతున్నాడు. అప్పుడు తట్టింది ఒక ఐడియా. ఆ రోజుల్లో చేతనా గ్రూప్స్, మరి కొన్ని ఫోరమ్స్‌లో ఫ్రెషర్స్ IT ఓపెనింగ్స్‌కు టూ మచ్‌గా ఫాలోయింగ్ ఉండేది. సో ' Dummy Dudes' అని ఒక కంపెని ఫ్రెషర్స్‌ను రెక్రూట్ చేసుకుంటోందని మెసేజ్ పెట్టు, అందులో రెజ్యూమ్స్ పంపించాల్సిన మెయిల్ ఐ.డి అని ఈ అమ్మాయి ఐ.డి ఇవ్వమన్నాను. కొన్ని వేల రెజ్యూమ్స్ ఆ మెయిల్ ఐ.డికి వస్తాయి కాబట్టి నీ మెసేజ్ చుసే ఛ్యాన్సెస్ తక్కువ. మోస్ట్లీ తన ఐ.డి దొబ్బేస్తుందని చెప్పను. కాని ఇది ఫ్రెషర్స్‌కు ఆశ పెట్టి నువ్వు మాత్రం టిఫిన్‌గా దోశ, వడ, మీల్స్‌లో అప్పడం తిన్నట్టవుతుంది. అఫ్‌కోర్స్ పాపం అంటే మరీ అంత పాపం కాదు, చాలా మంది CC లో మెయిల్ ఐ.డీలు పెట్టి చాలా కంపెనీస్‌కు ఒకేసారి CV పంపిస్తారు, అందులో ఇది ఒకటవుతుంది. ఆ పాపం నువ్వు మోసుకుంటానంటే పెట్టు అని చెప్పా.

వాడు ఎగ్జైట్ అయ్యాడు. ఆడు జాబ్స్ అప్లయ్ చేసే ఫ్లోలో ఉన్నాడు, సొ అలాంటి ఓపెనింగ్స్ నోటిఫికేషన్‌లు ఎలా వుంటాయో బాగా తెలుసు. ట్రై చేస్తానని చేసాడు. కట్ చేస్తే ఆ అమ్మాయి మెయిల్ ఐ.డీకి 25,000 CVలు వచ్చాయి. 15,000కే మెయిల్ ఐ.డి స్పేస్ అయిపోయింది....రోజు రోజుకి ఇంకా పెరుగుతున్నాయంట. తను వీడికే ఫోన్ చేసి, నా మెయిల్ ఐ.డిలో వేలకు వేలకు రెజ్యూమ్స్ వస్తున్నాయి ఏమి చెయ్యాలి అని అడిగింది. అయ్యయ్యో నీ మెయిల్ ఐ.డి నీ రెజ్యూంలో ఆర్ ఎల్స్ ఎక్కడో చూసి అలా అలా ఫార్వర్డ్ అయినట్టుంది. ఈ సారి ఇంకోటి క్రియేట్ చేసుకుని జాగ్రత్తగా ఉంచుకో. తెలిసిన వాళ్లకి తప్ప ఎవరికీ చెప్పకు అని మన వాడు క్లాస్‌గా క్లాస్ తీసుకున్నాడు. మొత్తానికి సేవ్ అయ్యాడు. ఆ తర్వాత చాలా రోజుల వరకు టచ్‌లో లేడు. 6 నెలల తర్వాత కలిసినప్పుడు అడిగితే మెయిల్ ఐ.డి మార్చుకున్నా, నీకు తప్ప అందరికీ చెప్పానురా...సారీ అన్నాడు !!!

ఛీ నా బతుకు - 8

Posted by అశోక్ వర్మ | 6:13 AM

ఛీ నా బతుకు - 8
మా ఫ్రెండ్స్ బ్యాచ్‌లో ఒక టూ మచ్ కామెడీ గాడు ఉండేవాడు <= వడివేలు టైప్స్ అన్నమాట. బి.టెక్ అయ్యాక వీడికి చాలా రోజులు ఉద్యోగం రాలేదు. కాలేజీలో ఒక పని ఉన్నా జాబ్ లేకుండా వెళితే పరువు పోతుందని జాబ్ వచ్చేంత వరకూ వెళ్లకూడదని ' మంగయ్య ' శపథం చేసుకున్నాడు. మొత్తానికి ఒక సంవత్సరం తర్వాత వీడికి జాబ్ వచ్చింది , విత్ ఎ సాలరీ ఆఫ్ 5000 ఇన్ బెంగుళూరు.

సో ఇప్పుడు కాలేజ్‌లో పని చూడాలి అని ఆఫ్టర్ ఒకటిన్నర సంవత్సరం వెళ్లాడు. ఈడు కాలేజ్‌లో పెద్ద సెలబ్రిటీ. అందరితో పరిచయం ఉంది. ఎంటర్ అవ్వడం ఆలస్యం ఒక లెక్చరర్ కనపడ్డాడు. జాబ్ వచ్చింది సార్ బెంగుళూరులో 8000 సాలరీ అన్నాడు. కొంచం ఎక్కువ చెప్పుకున్నా ఏం పర్లేదులే ప్రెస్టీజ్ పెరుగుతుందని తనలో తను సర్ది చెప్పుకుంటూ - సాలరీ ఇంకా పెరుగుతుంది సార్ స్టార్టింగ్ కాబట్టి జీతాన్ని, స్టైఫండ్‌లా ఇస్తున్నారు అన్నాడు. భలే వాడివయ్య మాకు ఇక్కడ స్టైఫండ్‌నే జీతంగా ఇస్తున్నారు అని మాట్లాడుతుండగా ఆ లెక్చరర్ ఫ్రెండ్ ఇంకో కొత్త లెక్చరర్ వచ్చాడు. ఈయనకు మా వాడి గురించి తెలియదు. సో మెయిన్ లెక్చరర్ గారు, " ఇతను నా ఫేవరెట్ స్టూడెంట్ మాస్టారు, బెంగుళూరులో జాబ్ చేస్తున్నాడు సాలరీ 10,००० " అని తన ప్రెస్టీజ్ కోసం పెంచేసాడు.

తర్వాత మనోడు HODని కలిసాడు. లెక్చరర్స్ దగ్గర ఇప్పుడు సాలరీ 10,000 పలుకుతోంది, తక్కువ చెప్తే బాగోదని మా క్లాస్ పరువు కోసం 12,000 అని చెప్పాడు. HOD కొంచం హేపీ గా ఫీల్ అయ్యి జూనియర్స్‌కు ఒక మోటివేషన్ క్లాస్ తీసుకో అని ఒత్తిడి తెచ్చాడు. వీడి పని కూడా HOD చేతిలో ఉండడంతో ఒప్పుకోక తప్పలేదు. ఆ మోటివేషన్ క్లాస్ ఇంట్రొడక్షన్‌లో HOD వీడిని ఆ జూనియర్స్‌కు పరిచయం చేస్తూ, వాళ్లు ఎక్కువ మోటివేట్ అవ్వాలని ఎక్కువ సాలరీ చెప్పాడు 15,000 అని.

ఇదిలా జరుగుతుండగా ప్రిన్సిపల్ రౌండ్స్ వేస్తూ వచ్చి ఏమి జరుగుతోందా అని ఆసక్తిగా ఈ క్లాస్ దిక్కు గమనించడంతో..HOD, మనోడు బయటకు వెళ్లి పలకరించారు. అప్పుడు ఫ్రిన్సిపల్ దగ్గర మనవాడి సాలరీ బాగుంటే HOD వెయిట్ పెరుగుతుంది అని 18,000 అని చెప్పాడు. మనోడు బిక్క మొహం వేసాడు.

వీడిలా కాలేజ్‌లో గాలి తిరుగుళ్లు తిరుగుతూ తిరుగుతూ ఈవెనింగ్ అందరికీ బై చెప్పె టైంలో ఒక్కసారి ప్రిన్సిపాల్‌కు కూడా బై చెప్దాం, ఫ్యూచర్‌లో పనులు ఉండొచ్చు అని తన చేంబర్‌కు వెళ్తే అదే టైంలో JNTU ఇన్స్‌పెక్షన్ కమిటీ వాళ్లు ఆళ్ల పని ముగించుకుని వెళ్తున్నారు. టైంకు వచ్చాడురా అనుకుని, ఇతను మా కాలేజ్ Alumni. హీ ఈజ్ గెటింగ్ 25,000 పర్ మంత్ అని చెప్పడంతో మనోడికి స్టార్ ప్లస్ ఛానల్‌లో దూరదర్శన్ కనిపించినట్టయింది. ప్రెస్టీజ్ కోసం ఎవరికి వారు వీడిని ప్రెస్టీజ్ కుక్కర్‌లా వాడుకున్నారు.

ఇలా ఒక్క రోజులో వీడి సాలరీ 5,000 నుంచి 25,000 కు వెళ్లింది. వామ్మో...అని వీడు రిటర్న్ అవుతుండగా కరస్పాండెంట్ కనిపించాడు, ఇంకా చాలు రా బాబు, ఆయన దగ్గరకు వెళ్తే ఇంకెంత పెంచేస్తాడో అని తప్పించుకుని వచ్చేసాడు.

తర్వాత మాకు ఈ విషయం చెప్తే, సో నీ సాలరి ఫైవ్ థౌజండ్ అంటే ఇరవై ఐదు వేలు అని వెంకీ సినిమాలో కృష్ణ భగవాన్ స్టైల్‌లో కామెంటాం. అప్పుడు ఆడి ఫేస్‌లో ఒకే ఎక్స్‌ప్రెషన్, CNB అని !!!

శభాష్ శభాష్ శభాష్ - 7
నాకు బల్లి అంటే చాలా అలర్జి. అఫ్‌కోర్స్ ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుందిలేండి !!! మా ఓనర్ వాళ్ల ఆస్థాన బల్లి ఒకటుంది. నాకు అదంటే అస్సలు పడదు. నిజానికి ఆ ప్రాణి పేరంటేనే పడదు. అందువల్ల ఎప్పుడైనా దానిని రెఫర్ చెయ్యాల్సి వస్తే కష్టంగా ఉంటుందని దానికో నాన్-నిక్ నేం ( ముద్దు పేరుకు ఆపోజిట్ ) పెట్టుకున్నా - ' బ్రెట్ లీ ' అని. క్రికెటర్ బ్రెట్ లీ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇలా పిలుచుకుంటే కాస్తన్నా అలర్జీకి శాంతి చేసినట్టుంటుంది అని అలవాటు చేసుకున్నా.

ఇక విషయానికి వస్తే మా ఇంట్లో హాల్ లాంటి రూంలో నెక్స్ట్ రూం ఎంట్రన్స్ పైన ట్యూబ్ లైట్ ఉంటుంది. దానికి లెఫ్ట్ సైడ్ నా కంప్యూటర్ ఉంటుంది. ఎదురుగా పైన వెంటిలేటర్స్ ఉన్నాయి. ఒక రోజు ఈవినింగ్ కాస్తా రాత్రవుతున్న సమయంలో, నేను యమ హుషారుగా ఉన్నప్పుడు బ్రెట్ లీ గాడు ఎంటర్ అయ్యాడు. ఆడు ట్యూబ్ లైట్ దగ్గరకు వెళ్లేలోపలే, నేను నా సిస్టం దగ్గరనుంచి ' హుష్ హుష్....ఉఫ్ ఉఫ్ఫ్ ..........జూం పచక్..' ఇలా రక రకాల సౌండ్స్, గట్టిగా చప్పట్లు కొట్టి వాడిని తరిమేసాను. 1 మినిట్ తర్వాత వాడు మళ్ళీ వచ్చాడు. ఈ సారి ఇంకా విచిత్రమైన సౌండ్స్ చేసి బెదరగొట్టి పంపించేసాను. ఈ సారి 10 మినిట్స్ తర్వాత 100 మీటర్స్ స్ప్రింట్ రేస్‌లా ' ఒక్క సారి వచ్చిపోమ్మా మెరుపు తీగా ' సీన్ లోలా నేను సౌండ్ చేసే లోపలే చటుక్కున వచ్చి లటుక్కున లైట్ దగ్గరకు చేరుకున్నాడు.

ఛ అనుకున్నా. అడుంటే నాకు ఏ పని జరగదు. నేను ఏది ఆలోచించాలన్నా అటూ ఇటూ తిరుగుతూ నడుస్తూ అలోచిస్తేనే మైండ్ వర్క్ అవుతుంది. అలా ఒక విషయం గురించి ఆలోచించాల్సిన పని ఉన్నింది. దానికోసం ఆ ట్యూబ్ లైట్ కింద నుంచి నెక్స్ట్ రూంకీ ఈ రూంకి వాక్ చేస్తూ ఆలోచించాలి. ఇప్పుడు బ్రెట్ లీ గాడు ఎక్కడ మీద పడతాడో అన్న భయం పట్టుకుంది. వాడిని ఎలాగైనా తరిమెయ్యాలని నా ఆరాటం కమ్ పోరాటం.

రక రకాల ప్రయత్నాలు చేసాను. ట్యూబ్ లైట్‌కి సమాంతరంగా చీపురు కట్ట పుచ్చుకుని....' ఆ జజ్జినక జజ్జినక జనారే.....' అని ఎంత ట్రై చేసినా, ఫుల్ బాటిల్ మూత నిండా మందు కొట్టిన వాడిలా బ్రెట్ లీ గాడు అస్సలు పట్టించుకోలేదు.

ఇక నా సోలో వాయిస్ ఏమి చెయ్యలేదు అని, దీన్ని భయపెట్టడం ఎలాగా అని ఆలోచిస్తూ నా సిస్టం దిక్కు చూసా, అప్పుడు ఐడియా తట్టి బీభత్సమైన సినిమా సాంగ్స్ ప్లే చేస్తే పారిపోతుందని, ' హే మండపేట మలక్‌పేట నాయుడుపేట పెటరాప్...' సాంగ్ ప్లే చేసా. అయినా వాడు నో రెస్పాన్స్. పక్షవాతం ఏమన్న వచ్చిందేమో అని డవుట్ వచ్చి, వాల్యూం పెంచా, కొంచం కదలిక వచ్చింది. దాంతో సౌండ్ ఫుల్‌గా పెంచేసా. బయటకు ఏమన్నా వినిపిస్తోందేమోనని బయటకు వచ్చి సౌండ్ వింటే టూ మచ్ గా వస్తోంది. మా ఇంటి చుట్టు పక్కన వాళ్లంతా ఒల్లంతా పెటరాప్ తుల్లింతలతో తట్టుకోలేకపోతుండడం చూసి వామ్మో అని సౌండ్ తగ్గించా. నెక్స్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రజలను పరుగులు పెట్టించడంలో పేరు గాంచిన మహా మహా సెగ--బ్రిటీస్ పాటలన్నీ ట్రై చేసా, అయినా బ్రెట్ లీ గాడు పోలేదు.

ఒరెయ్ బ్రెట్ లీ గా ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు ? ఈ రేంజ్ లో సావ గొడుతున్నావ్ !!! నువ్వు కడుపుకి పురుగులు తింటున్నావా ? లేక అవి తినే గడ్డి తింటున్నావా ? నీ కన్నా నీ తమ్ముడు బ్రూస్ లీ గాడు ఎంతో మేలు. చంగ్ చంగ్ మని ఎగురుకుంటూ వచ్చినా ఎక్కువ సేపు ఉండకుండా వెళ్లిపోతాడు. అస్సలు నువ్వు బల్లివా పశువ్వా ? నన్ను బలి పశువు చేస్తున్నావ్ కదరా !!!! అని రకరకాలుగా తిట్టుకున్నా.

అప్పుడే పవర్ పోయింది. ' ఎస్ ఎస్...' అని గంగూలీ వికెట్ తీస్తే ఇచ్చే ఎక్స్‌ప్రెషన్‌తో ఆనంద పడ్డా. ఇప్పుడు బ్రెట్ లీ గాడు కొంచం కదిలాడు. ఆడు ఎళ్లిపోతున్నాడోచ్ అని ఆనందపడేంతలో పవర్ వచ్చింది. మళ్ళీ వాడు లటుక్కున లైట్ కిందకు పరిగెత్తాడు. ఓ నో....అనుకున్నా, కాని వెంటనే ఐడియా తట్టింది. నేనే లైట్ ఆఫ్ చేసా. అయినా వాడు మహా ముదురులా ఉన్నాడు, ఇంచ్ కూడా కదలలేదు. ఇలా కాదు అని బయటకు వెళ్లి బయట లైట్స్ మూడు వేసా. పక్కింటి పోర్షన్ వాడు, నిద్రపోతున్నట్టు ఉన్నాడు. వాడిని నిద్రలేపి మీ ట్యూబ్ లైట్ వెలుగుతోందా ? పవర్ పోయి వచ్చింది. 2 - ఫేజ్ వచ్చిందనుకుంటా. మీది ఒక సారి వేసి చూస్తారా అని అడిగా. వాడు వేసాడు. బానే ఉందే అన్నాడు. వెయిట్ బాసు వెయిట్, నాది కూడా ఇలాగే వెలిగింది, కొంచం సేపు అలానే ఉంచు ప్రాబ్లం రాకపోతే నా లైట్ స్టార్టర్‌లో ప్రాబ్లం ఉనట్టు, మార్చుకుంటా అని చెప్పి కన్విన్స్ చేసా.

ఇప్పుడు మా ఇంట్లో చీమ కూడా ఎంటర్ కాలేనంత చిమ్మ చీకటి. బయట మాత్రం వెలుగే వెలుగు. పక్క పోర్షన్‌లో లడ్డూలా లైట్ ఊరిస్తోంది. ఇదంతా సైలెంట్‌గా అబ్జర్వ్ చేస్తున్న లీ గాడు, ఛీ నీ ఎంకమ్మ ఎంత కక్కుర్తి గాడివిరా !!! అన్న ఎక్స్‌ప్రెషన్‌తో చివరికి విస విసా వెళ్లిపోయాడు !!!

శభాష్ శభాష్ శభాష్ - 6
లాంగ్ లాంగ్ అగో, ఒక ఆదివారం....డోంట్ నో ఇఫ్ ఇట్ వాజ్ అమావాస్యా ఆర్ నాట్. నైట్ 10:30 కు నేను సిటీ బస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఒక పని పడి చాలా దూరం వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు రిటర్నింగ్ అన్నమాట. అట్ లాస్ట్ ఒక బస్ వచ్చింది. రష్ కూడా తక్కువ వుండడంతో సీట్ దొరికింది. హమ్మయ్య అనుకునేంతలో టికెట్ టికెట్ అని కండక్టర్ వచ్చాడు. మహా కోపంగా ఉన్నాడు. షార్ట్ టెంపర్ క్యాండిడేట్ అనుకుంటా. నేను వెళ్లాల్సిన ఏరియా చెప్పి 10 రుపీస్ ఇచ్చాను. చిల్లర ఇవ్వు అన్నాడు. టికెట్ ఎంతా అన్నాను. 5 అన్నాడు. మరి 10 రుపీస్ చిల్లరేగా అన్నా. సర్రున కాలినట్టుంది. ఏం చిల్లర అడుగుతుంటే.....5 రుపీస్ చిల్లర ఉంటే ఇవ్వు లేకుంటే దిగిపో అన్నాడు. దిగేటప్పుడు చిల్లర తీసుకుంటాలే అన్నాను. హట్, ఎవడూ చిల్లర ఇవ్వడు, అయినా ఇంకెవడెక్కుతాడు ? దిగు దిగు అంటున్నాడు. ఈ సారి నాకు కాలింది. రెండు టికెట్స్ ఇవ్వు అన్నాను. రెండెందుకు ? ఇంకొకరు ఎవరు అన్నాడు. ' ఊర్కే ' అన్నాను.

తను షాక్‌డ్. ఆ షాక్ కి టికెట్ కొట్టకుండా అలానే ఉండిపోయాడు. అంత డబ్బులెక్కువైతే ఆ 5 రుపాయలు మాకే ఇవ్వొచ్చుగా, ఊరికే టికెట్ కొట్టడం ఎందుకు ? అన్నాడు. నీకు మాత్రం ఇవ్వను, రెండు టికెట్స్ కొట్టు అన్నాను. అతను ఇంకా బ్లాంక్ ఫేస్ వేసుకుని వున్నాడు. టికెట్ తీసుకోకుంటే తప్పు కాని 2, 20, 200 టికెట్స్ తీసుకోకూడదని ఎక్కడన్నా రూల్ ఉందా ? అన్నాను. టికెట్స్ కొట్టేంత వరకు వదిలిపెట్టలా.

చాలా సేపటికి ఎవరో ఒకడు చాలా హుషారుగా బస్ ఎక్కాడు. కండక్టర్ టికెట్ అన్నాడు. అతను తీసుకునే లోపు, ' బాస్ నేను తీసుకున్నా...' అన్నా. ఆడు షాక్‌డ్, నాకు పబ్లిక్‌లో ఇంత ఫాలోయింగ్ ఉందా అన్న డవుట్‌ఫుల్ ఎక్స్ప్రెషన్‌తో...' నేను మీకు తెలుసా ? ' అన్నాడు. లేదు ' ఊర్కే ' తీసుకున్నా, అన్నా. జరిగిన మాటర్ అంతా తెలియని అతను బ్లాంక్ ఫేస్ వేసాడు - ' ఊర్కె నా....' అని. కండక్టర్ ఉరిమి ఉరిమి చూసాడు.

ఆ టైంలో దిగితే వేరే బస్ దొరకడం కష్టం, ఆటో్‌లో వెళ్తే మినిమం 50 రుపీస్ పైనే అవుతుంది. సో 5 రుపీస్ పోయినా ఇదే బెస్ట్ అని అలా ప్రొసీడ్ అయ్యాం అన్నమాట !!!

ఛీ నా బతుకు - 7

Posted by అశోక్ వర్మ | 3:45 AM

ఛీ నా బతుకు - 7
మనకు రోజూ పేపర్ చదవడం అలవాటు. అదే నా జీవితంలో ఒక రేంజ్ షాక్ ఇస్తుందని అప్పట్లో నాకు తెలియదు. 2000 ఎంసెట్ ఎగ్జాం టైంలో అలా పేపర్ చూస్తుండగా ఇంటర్‌లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి షార్ట్ టర్మ్ ఎంసెట్ కోచింగ్‌లో డిస్కౌంట్స్ అన్న ఆఫర్ చూసాను. కట్ చేస్తే గుంటూరు నలంద కాలేజ్‌లో ఉన్నా. అక్కడ ఎన్నో షార్ట్ కట్స్ చెప్తున్నారు, అవి రోజుకు ఒక్కసారి రివైజ్ చేసే టైం కుడా ఇవ్వనంత ఎక్కువ ఉన్నాయి. అలాంటి బిజీ బిజీ టైంలో కూడా నేను నా పేపర్ చదివే అలవాటు మానలేదు. ఒక రోజు ఒక ఆర్టికల్ చూసాను. నారా చంద్ర బాబు గారు ఈ సారి తెలుగు అకాడెమి బుక్స్ నుంచే ఎంసెట్ క్వెషన్స్ అన్నీ ఇవ్వాలని ఏదొ మీటింగ్లో డిసైడ్ చేసారని వున్నింది. అది చాలా చిన్న సైజ్ ఆర్టికల్‌గా వచ్చింది. దానిని మడిచి నా ట్రంక్ పెట్టలో భధ్రముగా పెట్టుకుని దాచుకున్నా. ఇంకెవరన్నా ఆ మ్యాటర్ చూస్తే, అది అలా అలా పాకిపోయి అందరూ తెలుగు అకాడెమినే ఫాలో అవుతారు. అప్పుడు మళ్ళీ అందరి మధ్య కాంపెటీషన్ వస్తుంది, అదే ఎవ్వరికీ చెప్పకపోతే నేనొక్కడినే చదువుకుని టాపర్ అయిపోవచ్చు అని మాస్టర్ ప్లాన్ వేసాను.

అక్కడి లోకలైట్స్‌తో ఇన్‌ఫర్మేషన్ సంపాదించి, గుంటూరు బ్రాడిపేట్ ఏరియాలో సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్ల్స్‌లో తెలుగు అకాడెమి ఎంసెట్ బుక్స్ గురించి వాకబు చేసాను. నాలుగైదు గంటలు శోధించి చివరికి సాధించాను.

ఆ రోజు నుంచి అస్సలు నలంద కోచింగ్ మెటీరియల్, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ కాకుండా ఎవరికీ కనపడకుండా, తెలుగు అకాడేమి తెలుగు మీడియం బుక్స్‌ని ( నేను ఇంగ్లిష్ మీడియం అయ్యుండి ) చదవడం మొదలెట్టాను. నాకు దొరికిన ఈ అల్లావుద్దిన్ అకాడెమి షార్ట్ కట్ ముందు ఈ కోచింగ్ సెంటర్ షార్ట్ కట్స్ అన్నీ వేస్ట్ అని లైట్ తీసుకున్నా. రోజూ ఆ TA బుక్స్ ని బట్టీ కొట్టే వాడిని. ఇలా పుణ్య కాలం కాస్తా గడిచిపోయింది. ఎంసెట్ ముందు రోజుకి తెలుగు అకాడెమిలో ఫలానా క్వెషన్ ఏ పేజీలో వుంది అన్నా కూడా చెప్పే రేంజ్‌లో బట్టీ కొట్టాను. ఒకవేల 200 క్వెషన్స్ అవే బుక్స్ నుంచి వస్తే ఖచ్చితంగా నేనే స్టేట్ టాపర్ అని ఫిక్స్ అయిపోయాను.

ఎంసెట్ ఎగ్జాం రోజు కూడా నేను ఆ తెలుగు మీడియం బుక్స్‌నే చదువుతుంటే మా నాన్నకు అర్థం కాలేదు. ఏమో లే అని ఊరుకున్నాడు. మొత్తానికి ఎంసెట్ పేపర్ చూడగానే ' యముడే సెట్ ' చేసినట్టు అనిపించింది. ఒక్కటంటే ఒక్క బిట్టు లేదు. OMR షీట్ యే ఆకాశం, అందులో సర్కిల్స్ యే చుక్కలుగా కనిపించాయి. అయిపోయానురోయ్...............అనుకున్నా.

ఆ రోజు తిన్నంత ఖంగు ( పేపర్ భాషలో ) జీవితంలో ఎప్పుడూ తినలేదు. రిజల్ట్స్ వచ్చేవరకు న్యూస్ పేపర్ జోలికి పోలేదు. చంద్రబాబు పైన విపరీతమైన కోపం వచ్చింది. కొన్ని నెలల తరువాత ట్రంక్ పెట్ట తవ్వకాల్లో ఆ ఆర్టికల్ కనిపించింది. ఈ సారి నిశితంగా అబ్జర్వ్ చేసి చూస్తే - " ఎంసెట్ క్వెషన్ పేపర్ తెలుగు అకాడెమి పుస్తకాల నుంచి ? " అని చివర్లో క్వెషన్ మార్క్ ఉండడం గమనించాను !!!

శభాష్ శభాష్ శభాష్ - 5

ఈ సంఘటన ఒక అనామకుడి జీవితంలో జరిగినది. కథానాయకుడి పేరు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇవ్వడం లేదు.

ఈడు ఏకాకిగా 1st  ఫ్లోర్ లో ఒక పోర్షన్‌లో అద్దెకు వుంటున్నాడు. ఈడి పక్కన పోర్షన్‌లో ఇంకో ఏకాకి ఉంటున్నాడు. ఇతనిని అనామకుడు++ అనుకోవచ్చు. ఇలా ఈ దో-కాకుల వల్ల ఆ ఇంటి ఓనర్‌కు రెంటు బాగా గిట్టుబాటు  అవుతోంది. అలా వుండగా ఒక రోజు మన వాడు House Rent Allowance క్లెయిమ్ చెయ్యడం కోసం ఓనర్ ఆంటీని ఆఫీస్‌లో OC గా ఇచ్చే మేరీ గోల్డ్ పసుపు పచ్చ గడ్డి బిస్కట్స్ రెండు ఇచ్చి సాంప్రదాయ బద్ధంగా సంప్రదించాడు.

ఏంటి బాబు విషయం అని ఆంటి అడిగితే, "మరేం లేదు ఆంటి House రెంటు కడుతున్నామని ఆఫీస్‌లో సబ్‌మిట్ చేస్తే ట్యాక్స్ సేవ్ అవుతుంది. అందుకోసం అంకుల్ సంతకం కావాలి...." అనగానే, అంకుల్ ఊర్లో లేడు బాబు అని ఆంటి చెప్పింది. ' పర్లేదు ఆంటి సంతకం అంటే ఎగ్జాక్ట్లీ సంతకం కాదు, సంతకం లాంటిది అయినా పర్లేదు. అంకుల్ పేరు రాస్తే చాలు. బై ద వే అంకుల్ పేరు ???" అని ఈడు అడిగాడు. ఆంటి తెగ సిగ్గు పడి సాయంత్రం మా చింటుగాడు ఉంటాడు వాడిని అడుగు అంది. 
వామ్మో నీ సిగ్గుని శీను వైట్ల కామెడి సీన్‌లకు వాడుకోనూ....అనుకుని అస్సలు విషయం నాంచడం వేస్టని, "ఆంటి మరి నేను 5000 రెంట్ కడుతున్నా కదా ఎక్కువ ట్యాక్స్ సేవ్ కావడం కోసం 10000 అని క్లెయిం చేస్తున్నా పర్లే.....................దా ? అని ఈడు అనేంతలో, " ఆ ఇంటికి 10000 రెంట్ అంటే, 10000 అంటే ఏంటో తెలిసిన ఎవడూ నమ్మడు. మాకెందుకు బాబు ఆ రిస్కులు. వెరిఫికేషన్‌కు వస్తే కష్టం" అంది. ఏం కాదు ఇది ఫార్మాలిటీ అని ఎంత కన్విన్స్ చేసినా ఆంటి ఒప్పుకోకపోవడంతో, "ఐతే ఒక పని చెయ్యండి ఇన్స్పెక్షన్ వాళ్లు వస్తే 1st ఫ్లోర్ రెండు పోర్షన్స్‌లో నేనే ఉంటున్నా అని చెప్పండి" అన్నాడు. ఆంటి కొంచం షాక్ అయ్యింది. నో చెప్పలేక పోయింది. కొంచం ఆలోచించాక ఆంటి బల్బ్ ఎలిగింది. "మరి నీ పక్కన పోర్షన్‌లో ఉండే అతను కూడా HRA సబ్‌మిట్ చెయ్యాలి కదా అతనికి ఇన్స్పెక్షన్‌కు వస్తే ? " అంది. ఈ సారి వీడికి కౌంటర్ పడడంతో ఈడు ఆలోచనలో, ఆంటి ఆనందంలో పడ్డారు.

మనవాడు త్వరగా కోలుకుని, " అతని పోర్షన్, నా పోర్షన్ రెండిటిలోనూ అతనే ఉంటున్నాడని చెప్పండి. మేము ఇద్దరం వేరే వేరే కంపెనీస్ కాబట్టి ఒకేసారి ఇన్స్పెక్షన్‌కు రారాంటి. నా గురించి అడిగితే రెండూ నావే అని చెప్పండి. అతని గురించి వస్తే రెండూ తనవే అని చెప్పండి. మ్యాటర్ సాల్వ్, మ్యాటర్ సాల్వ్, మ్యాటర్ సాల్వ్ " అని చెప్పడంతో ఆంటి డెడ్ లాక్ అయ్యి ఒప్పుకుంది !!!