W

Posted by అశోక్ వర్మ | 4:44 AM

( టింగ్లిష్ లో ఈ టపా ఇక్కడ )
W

టైటిల్ ఏంటి ఇలా వుందనుకుంటున్నారా ? సెప్తా సెప్తా..

W = U + U అంటే 'నువ్వే నువ్వే' అన్నమాటా

టైటానిక్ మూవీని గురువుగారు త్రివిక్రం శ్రీనివాస్ కున్న అశేష అభిమానుల్లో నాలాంటోడొకడు తీస్తే ఎలా వుంటుందో అని సరదాగా రాసిన టపా. దయచేసి అన్యథా భావించకండి. ఆర్కుట్ లో ఒక కమ్యూనిటీలో ఒక టాపిక్ కింద వ్రాసినది. ఓవర్ టు ద టాపిక్.
---------------------
హీరో 'జాక్ రిచీ' ఆవారాగాడు. హీరోయిన్ 'ఏంజిల్ లీ' అంటే తన అయ్య విష్ నాథ్ కు ఫైవ్ పాయింట్ సంవన్ (పంచ ప్రాణాలకన్నా ఎక్కువ). ఏంజిల్ లీ కి డాడ్, బర్త్ డే గిఫ్ట్ కింద టైటానిక్ టూర్ ఇస్తాడు. అక్కడక్కడ ఆడుకోడానికి ఒక బుల్లి బోట్ కొనిపెడతాడు. మన హీరో గారు, సముద్రంలో తెప్ప మీద జల్సా చేసుకుంటూ వచ్చీ టైటానిక్లో కూలి పనులు చేసుకునే అమ్మాయిలకు బీట్ ఏస్తూ ఏంజిల్ లీ బోట్ను తెప్పతో గుద్దేస్తాడు.

అప్పుడు ఏంజిల్ లీ: కొని వారం కూడా అవ్వలేదు. కళ్ళు దొబ్బాయా ?
అని క్లాస్స్లు..

దానికి రిచీ గాడు: తెప్ప నడపడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా ? సముద్రానికి క్రొత్తా ? సీనియర్స్ అంటే భయం లేదా ?
అని కౌంటర్స్ ఇచ్చీ..పద కాంటీన్ కెళ్దామని, టైటానిక్ లోనికి తీసుకెళ్తాడు. బాగా మేస్తాడు. బిల్ కట్టే టైంలో ఏంజిల్ లీ డబ్బులు నిల్ అని చెప్పడంతో, వీడు పర్స్ కోసం బాక్ పాకెట్ చూసుకుంటే...బెబ్బే..అప్పుడూ ఏంజిల్ లీ వీడ్ని చూస్తుంటే...
రిచీ: షిప్ ను చూడాలనుకో తప్పులేదు, హిప్ ను చూడాలనుకోకు చచ్చిపోతావ్, అస్సలే నాకు బలుపెక్కువ
అని అంటాడు. అలా పరిచయం స్టార్ట్ అవుతుంది.

--------
నెక్స్ట్ సీన్లో...
రిచీ: సరదాగా టానిక్ తాగుదామా ?
ఏంజిల్ లీ: మనం బానే వున్నాం కదా టానిక్ ఎందుకు ?
రిచీ: దగ్గు వున్నప్పుడు టానిక్ ఏ ఎదవన్నా తాగుతాడు, కాని లేనప్పుడు తాగే వాడే రోమాంటిక్ ఫెలో. సో లెట్స్ ట్రై టానిక్ ఇన్ టైటానిక్
--------

ఇలా లవ్ ముదిరి ముదిరి కుళ్ళుతుంటుంది...

ఆ టైంలో
ఏంజిల్ లీ: నాకు భయమేస్తోంది రిచీ, నాకు ఈత రాదని, ఈవ్ టీజింగ్ చేస్తున్నావ్ అనిపిస్తోంది. బోర్ కొట్టెస్తే వదిలేస్తావా ?
రిచీ: పిచ్చి ఏంజిల్ లీ, అల్లరి-ఆకలి-ఏంజిల్ లీ ఎప్పుడు బోర్ కొట్టవ్...

ఏంజిల్ లీ .......ఫ్లాట్
----------
విష్ నాథ్ కు విషయం తెలుస్తుంది. రిచీనీ తన అసిస్టంట్ సారా.డి తో పిలిపిస్తాడు. బీచ్ వాలీ బాల్ ఆడుతుంటున్న, రిచీ వస్తాడు. ఇప్పుడు రెండు ముక్కులతో ముఖా ముఖి.

విష్ నాథ్: నువ్వు జీవితంలో ఏమి చెయ్యాలనుకుంటున్నావ్ ?
రిచీ: చాపలు పడదామనుకుంటున్నా...

విష్ నాథ్: ఆహా....ఆ తర్వాత
రిచీ: ఎండ బెడతా, అంకుల్

విష్ నాథ్: తర్వాత
రిచీ: దుమ్ము దులిపి, మళ్ళీ ఎండ బెడతా అంకుల్. అలాగే ఎండ బెడుతూ వుంటే మేము వుండమేమో అంకుల్...మరీ కంపుకొడతాయి.

విష్ నాథ్: అంతే తప్ప ఎండు సేపలతో ఎరైటీ బిజినెస్ చేద్దాము లాంటి ఆలోచనలు లేవా నీకు ? నేను ఒట్టి చేతులతో ఈ ఊరొచ్చాను, ఒట్టి సేపలతోనే కోట్లు సంపాదించాను.
రిచీ: మీ కొడుకేం చేస్తుంటాడు అంకుల్ ?

విష్ నాథ్: వాడు నా కంపెనీ లన్నింటికీ ఎం.డి
రిచీ: అదేంటండి మీ లెక్క ప్రకారం మీ అబ్బాయికి ఒకట్రెండు ఒట్టి సేపలు ఇచ్చి, బిజినెస్ చెయ్యమని చెప్పాలి కదా ? తప్పు అంకుల్ తప్పు. మనమొక పది సేపలు పడితే, మన పిల్లలు పదకొందో సేప నుంచి మొదలెట్టాలి కానీ........

విష్ నాథ్: నా కూతురు నీతో ఒట్టి సేపలు తినే స్టేజ్ కు వచ్చిందంటే, నువ్వు ఒట్టి మనిషివి కాదనుకున్నాను, కాని ఒట్టి ఎదవ వని తెలిసింది. కావాలంటే నీకు ఒక సేపల మార్కెట్ రాసిస్తాను, నా కూతుర్ని వదిలెయ్...

(ఇలా డిస్కషన్ సాగి........సాగి...)

విష్ నాథ్: మీరు ప్రేమించుకున్న ఈ టైటానిక్ లోనే నా కూతురి పెళ్లి సారా.డి తో చేస్తాను
(అని సవాల్ చేస్తాడు)

ఇప్పుడిక క్లైమాక్స్....
కరక్ట్ గా పెళ్లి కొడుకు సారా.డి, ఏంజి లీ కి తాళి కట్ట బోతుంటే, ఎవ్వరూ 'ఆపండీ అనకపోయినా ఐస్ బెర్గ్ వచ్చి టైటానిక్ ను స్లైట్ గా గుద్దేస్తుంది. పెళ్లి ఒక 5 మినిట్స్ డిస్తర్బ్ అవుతుంది. అంతే రిచీ వచ్చి, పాస్టర్ గారు టైం ఎంత అయ్యింది అంటాడు. ముహూర్తం దాటి 5 మినిట్స్ అయ్యింది అని కంఫర్మ్ చేసుకున్నాక
రిచీ: చూసావా విష్ నాథ్, పెళ్లికి ముఖ్యమైనవి ముహూర్తం మరియు మూడ్. అలాంటిది ఇప్పుడు రెండూ డిస్టర్బ్ అయ్యాయి. నువ్వు సరిగ్గా ఏంజిల్ లీ పెళ్లి చెయ్యలేకపోయావ్, నువ్వు ఓడిపోయావ్
అని క్లాస్ పీకడంతో, ఇంకా ఎక్కువ సేపు, క్లాస్ వింటూ కూర్చుంటే టైటానిక్ కూలి పోతుందని బాబ్బాబు, నీ తెప్పలో ఏవో తిప్పలు పడి మమ్మల్ని ఒడ్డుకు చేర్చు. నా కూతుర్ని నీకిచ్చి పెళ్లిచేస్తాను. అని గిచ్చి మరీ చెప్తాడు.

1 comments
  1. kiraN December 10, 2008 at 12:52 AM  

    అశోక్, బాగుంది మీ టై'టానిక్' స్టొరీ. వస్తూ ఉంటా..


    - కిరణ్
    ఐతే OK