(టింగ్లిష్ లో ఈ టపా ఇక్కడ)
వైరస్ ప్రోగ్రాం గిఫ్ట్ గా ఇవ్వడం. అదెలా వుండాలంటే తను ఒక సారి క్లిక్ చేస్తే "ఐ లవ్ యు" నేం వున్న వందల, వేల ఫైల్స్ సిస్టం అంతా విచ్చలవిడిగా క్రియేట్ అవుతూనే వుండాలి. ఫర్స్ట్ లో తనకు చిరాకు వస్తుంది, సిస్టం దొబ్బింది కదరా ఎదవ సచ్చినోడా అనుకుంటూ తిట్టుకుంటూ, డిలీట్ చెయ్యాలని ట్రై చేస్తుంది. కానీ ఒకటా రెండా ఎన్నో వేల ఫైల్స్ :( కొద్ది కొద్దిగా నీ ప్రేమలో వున్న దోమల సంఖ్య అర్థం చేసుకుంటుంది....క్రమంగా..అక్రమంగా సిస్టం హాంగ్ అవుతుంది..అప్పుడు నిన్ను 'హ్యాంగ్ హ్యాంగ్ బజావో బ్యాంగ్ బ్యాంగ్' అన్నంత కోపం వస్తుంది. అప్పుడు మొద-లవ్-తుంది అస్సలు సినిమా. సిస్టం రిస్టార్ట్ చేస్తుంది. అప్పుడు బ్లాంక్ బ్లాక్ స్క్రీన్ పై కలర్ ఫుల్ గా నువ్వు కనిపిస్తావ్. ఇక అంతే తెగ నచ్చేస్తావ్ అప్పుడే టైమింగ్ కుదిరి 'ప ని ని స సా టైప్స్ లో విండోస్ డీఫాల్ట్ ఆడియో సౌండ్ వస్తుంది. అందులో ఇంత రోమాంటిక్ ఫీలింగ్ వుందా అని తనకు అనిపిస్తుంది.
నీకు ఫోన్ చేస్తుంది.
నువ్వేమో నీ రొమాంటిక్ ఐడియా కు రెస్పాన్స్ గా 'ఐ లవ్ యూ చెప్తుందని వెయిట్ చేస్తుంటావ్. తను మాత్రం 'ఐ కెవ్ యూ అన్నట్టు. 'నీ అబ్బ అసలే అరకొరగా ఆర్కుట్ వస్తోంది. ఇప్పుడు అది కూడా దొబ్బెట్టావు కదరా...' అని ఫీల్ అవుతుంటే
నో ప్రోబ్స్ డియర్..ప్రతీ లవ్ వైరస్ వెనకాలా ఒక సైరస్ వుంటాడు
సిస్టం నుంచి వైరస్ పోదా అన్న టెన్షన్ పట్టుకుంది చెప్పు రా బాబు అంటుంది. అప్పుడు నువ్వు, ఒసెయ్ పిచ్చి యెంకి అదే ప్రోగ్రాం ను మరో సారి క్లిక్ చేస్తే అన్ని డిలీట్ అవుతాయే అని నువ్వు చెప్పగానే...
'అస్సలు నీకు ఇన్నాళ్ళు ఆర్కుట్టింగ్ తప్ప ఏమి తెలీదనుకున్నా....నీలో ఇంతగా హార్ట్ కుట్టింగ్ అంటే నాలో కూడా ప్రేమ పుట్టింగ్' అనగానే నువ్వు :) :) :)
Post a Comment