Showing posts with label చిన్న నాటి (naughty) సంగతులు. Show all posts
Showing posts with label చిన్న నాటి (naughty) సంగతులు. Show all posts

శాంతి స్వరూప్ వల్ల స్వరూపం మారిన వేళ !!!
చిన్నప్పుడు రెగ్యులర్‌గా డిడి-8లో శాంతి స్వరూప్ దర్శనమిచ్చేవాడు. ఒక రోజు ఆయన హెయిర్ స్టైల్ చాలా నీట్‌గా వుండడం గమనించాను. పాపిడి తీసే చోట (బట్టతలవల్ల) ట్రై యాంగిల్ షేప్‌లో గ్యాప్ రావడం వల్లే నీట్‌గా కనిపిస్తోందనిపించింది. వెంటనే బాత్‌రూంకి వెళ్ళిపోయి, మా డాడ్ రేజర్‌తో నేను హెయిర్ పాపిడి తీసే చోట గోకేసా. అంతే కొంచం హెయిర్ పోయింది. అప్పటికే సమ్మర్ కట్టింగ్ అని చాలా చిన్న జుట్టు వుంది. సో తీరా తీసాకా చూస్తే నేనే దడుసుకున్నా. దానిని ఎలా దాచాలో తెలియక చచ్చాను. అయినా ఇంట్లో కనిపెట్టారు. ఏమైంది అక్కడా అంటే 'శాంతి స్వరూప్'ని చూసి inspire అయ్యాను అనగానే నవ్వాపుకోలేకపోయారు. ఇప్పటికీ తనని చూసినప్పుడల్లా ఈ విషయమే గుర్తొస్తుంటుంది.

పందులతో పందెం !!!

మా కాంపౌండ్‌కు కొద్ది దూరంలో ఒక పెద్ద పందుల పాక ఉండేది. ఇది మా కాలనీ వాళ్ళు పట్టించుకోకపోయినా భావి భారత, మునిసిపాలిటీ కాన్షియస్ పిల్ల వెధవల్లా మాలో ఆగ్రహ జ్వాలలు ఎగిసి పడ్డాయి. అంతే, అప్పుడు రామాయణం, మహాభారతం సీరియల్స్ ఎఫెక్ట్ అనుకుంటా, బాణాలు తయారు చేసాం. ఇంట్లో చీపుర్లు అన్నీ గాయబ్. అవి బాణాలు. ఇక వేటే వేట. భలే వెంటాడే వాళ్ళం. చూసేవాళ్ళకు ఎవరు పందులో అర్థం అయ్యేది కాదు. ఈ బాణాలకు స్పెషల్ ఎఫెక్ట్‌లా చింత పండును అతికించి దానికి కంప చెట్ల ముల్లులు పెట్టి అస్సలు సిసలు అడవి రాక్షసుల్లా ఎగబడేవాళ్ళం. భలే అటాక్ చేసే వాళ్ళం, పందెం పందుల్లా (పందెం కోడి టైప్). పాపం దారుణంగా పరిగెత్తేవి పందులు. సుఖంగా మురికి కాలువలో పడుకుంటే నిద్ర చెడగొడుతున్న ఈ ఎదవలు ఎవ్వర్రా అని పాపం తెగ ఫీల్ అయ్యేవి. నేను ఒక సారి ఒక షార్ప్ పంది, తెగ ఇంటెలిజెన్స్ చూపిస్తుంటే సినిమాల్లో అస్త్రాలు ప్రయోగించే టప్పుడు, స్ట్రైట్‌గా వెయ్యకుండా ఒకొక్కసారి ఆకాశం వైపుకు వేస్తారుగా అలా వేసా. చాలా హైట్‌కు పోయింది కాని లాండ్ అయ్యే టప్పుడే ఒకతను సైకిల్ మీద రోడ్‌లో పోతుంటే అతని కన్ను, spectacles మధ్య వున్న అతి చిన్న గ్యాప్ నుంచి spectaclesని లైట్‌గా రాసుకుంటూ Spectacularగా మిస్ అవుతూ వెళ్ళింది. ఆ రోజు ఎఫెక్ట్‌తో పందుల పందాలకు బ్రేక్ పడింది.

రాయి చేసిన రాచ(రచ్చ)కార్యం
ఇందాక దీపావళి మ్యాటర్‌లో చెప్పుకున్న వాడే ఇంకో ఇంటరెస్టింగ్ పనిచేసాడు. ఏదో చెట్టులో, ఏవో fruits కోసం, ట్రై అండ్ ట్రై అంటిల్ యు క్రై ఫిలాసఫి ప్రకారం, రాళ్ళతో వీర విజృంభణ చేసాడు. ప్రతీ సారీ, రాళ్ళు రివర్స్ వస్తున్నాయి, పండు రావట్లేదు. ట్రై చేస్తూనే వున్నాడు. మొత్తానికి ఈ సారి పండు వచ్చింది, వదిలెయ్యొచ్చుగా కాని రాయి రాలేదన్న విషయం గమనించి, రాయి ఏమయ్యింది అని తీక్షణంగా అబ్జర్వ్ చేస్తూ అది విసిరిన యంగిల్‌లో నిలబడి చూస్తున్నాడు. అది ఎందుకో, స్ట్రక్ అయ్యింది. ఇప్పుడు గాలి వల్ల మళ్ళీ రివర్స్‌లో పడింది. కాని కింద కాదు, వాడి తల మీద, మరుసటి రోజు బాండేజ్‌తో వచ్చాడు.

దీపావళి ధమాకా....
మా క్లాస్‌మేట్ వుండేవాడు. వాడు పిచ్చ అమాయకత్వపు అతి, అన్నమాట. కొంచం కక్కుర్తి కూడ ఎక్కువ ఎదవకి. ఒకసారి దీపావళి అప్పుడు, టపాకాయల్లో పేలని వాటినన్నింటినుంచి, గ్రే కలర్ మందు వుంటుంది కదా, అది కలెక్ట్ చేసి ఒక పేపర్లో పడేసి వెలిగించాలని ప్లాన్ వేసాడు. అప్పుడు స్పార్క్స్ వస్తాయని వీడికి స్పార్క్ అయ్యింది. అంతే వెంటనే అవి కలెక్ట్ చేసి పేపర్ అంటించాడు. కాని స్పార్క్స్ రాలేదు. సొ దగ్గరకు వెళ్ళి, మళ్ళీ చేస్తే సూపర్ స్పార్క్‌లు ఎంతగా అంటే వాడి మొహంలో కనుబొమ్మలు మొత్తం కాలిపోయి ఆ ఏరియా మొత్తం ఖాళీ అయ్యింది. మరుసటి రోజు స్కూల్‌కు వస్తే అంతా ధెయ్యం అనుకున్నారు. నేను కూడా భయపడిచచ్చా. మొహంలో eyebrowsను నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. కాని eyebrows లేకపోతే ఎంత బీ...బీ...భీభత్సంగా వుంటుందో అప్పుడే తెలిసింది.