25-మార్చి-2010
లప్పంగిరిగిరి - 15
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!
-- ఈ మధ్యే ఉగాది కన్నా ప్రపంచ పిచ్చుకల దినాన్ని ఘనంగా, ఏమిచెయ్యకుండా ఆలోచిస్తూ జరుపుకున్నా। ఇన్ని రోజులు హైదరాబాద్ కాకులు మాత్రమే దూరని కారడవి అనుకునేవాడినే కాని పిచ్చుకలు కూడా దూరడం లేదని తెలిసి కడు విచారం వ్యక్తపరచాను. ఇన్ని పక్షులు దూరడానికి కష్టపడుతుంటే పావురాల పాపులేషన్ మాత్రం ఇంత భారీగా ఉందేంటబ్బా అని ఆశ్చర్యపడ్డా. నాకు పావురం యొక్క ' తుర్‌ర్‌ర్‌ర్‌ర్ ' శబ్దం కన్నా, కాకి యొక్క ' కావ్ కావ్ ' శబ్దమే ఇష్టం, ఇంక పిచ్చుకల యొక్క ' చిక్‌చుక్‌చిక్‌చంప్‌చిక్‌చింగ్‌చుక్‌చంట్‌చుస్స్‌చటక్‌చిక్॥' లాంటి శబ్దం మీద పెద్ద అవగాహన లేదు. కాని ఇంతవరకు నాదెప్పుడు కాకి గోలే, ఇక మీదట పిచ్చుక గోల కూడా అలవాటు చేసుకుంటా. మొత్తానికి కనీసం పిచ్చుకలకైన పీస్ దొరకాలని గాలి పీల్చకుండా రెండు సెకన్ల మౌనం పాటించి కోరుకున్నా.
-- మాధాపూర్ పోలిస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న (అంటే పేపర్ భాషలో దగ్గరగా ఉన్న అని అర్థం) ద మోస్ట్ ఫేమస్ మహా రాజా చాట్ బండార్‌కు స్థానచలనం జరిగిందోచ్.........
మొన్న కొత్త లొకేషన్ వెతుక్కుంటూ వెళ్తే మన టాలివుడ్ మ్యూజిక్ డైరక్టర్ ఆర్.పి.పట్నాయక్ కనిపించారు. అక్కడి చాట్ కన్నా స్పైసీగా వున్నారు...అంటే అపార్థం చేసుకోకండి డ్రెస్ బానే వేసుకున్నారు, కాని యమా హుషారుగా అటూ ఇటూ తిరుగుతూ ఎవరెవరినో విమర్శిస్తూనో/కామెంట్ చేస్తునో/కామెడి చేస్తునో...అంటే ఏం చేస్తున్నారో సరిగ్గా అర్థం కాకుండా ఏదో చేస్తూ కనపడ్డారు. నా ఐటంను లాగిస్తూనే తనతో ఎలా డిస్‌కషన్ మొదలెట్టాలో అర్థం కాక రెండు మూడు సార్లు ఆయన తన స్నేహితులతో నిల్చున్న ప్రదేశంలో రెక్కి నిర్వహించాను. నా ప్లేట్ ఖాళీ అవుతున్నా నా యెదవ మొహమాటం కొద్దీ ఇంకా మాట కలపలేదే అన్న ఆత్రుతతో సరిగ్గా ఆయన పానీ పూరికి ఉపక్రమిస్తున్న సమయంలో వెళ్ళి మాటకలిపా. ' మ్యుజిక్‌ని కంపోజ్ చేయ్యటం ఎలా సార్ ? ' అనడిగితే ' అది చాట్ బండర్లో చెప్పేది కాదమ్మా' అన్నాడు. దెబ్బకు నాకు చుక్కలు పానీ పూరి, పూరీల్లా కనిపించాయి. అంతటితో అక్కడనుంచి జంప్ జిలాని.
-- తెలుగును ఇంగ్లిష్‌లో టైప్ చేసి చాటింగ్ చెయ్యడం చాలా ఈజీగా ఉంటుంది కదా అలా బాగా అలవాటైన వాళ్ళకు తెలుగు బ్లాగింగ్ కష్టం అనిపించొచ్చు. చేతికొచ్చింది ఇష్టం వచ్చిన్నట్టు రాసే వెసులుబాటు చాటింగ్‌లో ఉంది. దాన్నే యథాతథంగా లేఖినిలో వేస్తే లెంపకాయలే లెంపకాయలూ, వాటిని బ్రూతులు అనొచ్చు ( బ్రూ కాఫీ అంత ఘాటైన బూతులన్నమాట ).
ఇలా రాసిన టెక్స్ట్‌ని ఎడిట్ చేసుకోవాలంటే బై బర్త్ బద్దకం డిగ్రీతో పుట్టిన నాలాంటి వారికి బహు కష్టం। అందు వల్ల ఎవరన్నా ఇలాంటి టెక్స్ట్‌ని లేఖినిలో తెలుగులో కరెక్ట్‌గా కన్వర్ట్ అయ్యే టెక్స్ట్‌లా మార్చే టూల్ తయారు చేసుంటే తెల్పగలరు। తెలిపిన వాళ్ళకు ఓ రెండు రోజులు, తయారు చేసిన వాళ్ళకు ఒక మూడు రోజులు రుణపడుంటాను. ఒకవేల ఇలాంటి టూల్ లేకపోతే నేనే ఒకటి రాసేద్దామా అన్న కొంటె ఆలోచనలు కూడ అప్పుడప్పుడు జంపింగ్ జంపింగ్ !!!