05-మార్చి-2010

లప్పంగిరిగిరి - 12
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!

చాలా రోజుల తరువాత మల్లీ బ్లాగింగ్ చెయ్యాలని మనసు టెల్లింగ్.......
నచ్చావులే మూవీలో మనోడికి మావిడి చెట్టు సీన్లో ఙ్ఞానోదయం అయినట్టు నాక్కూడా అయ్యింది, అదే జీవితంలో ఏదన్నా సాధించాలంటే ఫోకస్ చాలా ముఖ్యం అని. జీవితంలో నేను ఇంతవరకు నన్ను నేను మార్చుకోలేని ప్రధాన విషయాలు రెండు,

1. పీకల దాకా వచ్చేవరకు యే విషయాన్ని తెచ్చుకోకూడదు, 9 కుట్లు పడే దెబ్బ కన్నా ఒకటే కుట్టు పడే దెబ్బ మేలని యెన్ని దెబ్బలు తగిలినా ఇప్పటికీ లివింగ్ ఆన్ ద ఏడ్జే మన లైఫ్ స్టైల్.
2. ఇది వరకు చెప్పుకున్నట్టు ఒకేసారి ఎక్కువ పనుల మీద పడితే ఫోకస్ ఉండదు, ఒక్క దాన్ని ఎంచుకుని దాని మీద ఏకాగ్రత పెడితే ఎక్కడికో ...........వెళ్లిపోతామని !!!

చాలా ప్రయత్నం చేసాను దీనివల్ల రోజూ నిద్రలో కలలో ఎక్కడికో పోవడం తప్ప జీవితంలో ఇది వరకు ఉన్నంత కిక్ కూడా ఇప్పుడు లేకుండా పోయిందని తెలిసొచ్చింది. కొన్ని జీవితాలు ఇంతే కాబట్టి బాక్ టు పిచ్ (బాక్ టు పెవీలియన్ కు వ్యతిరేకం) !!!

-- ఇంటర్నెట్‌లో కొత్త సినిమా రివ్యూస్ చదివి వాళ్లు సూపరు అంటేనే ధియేటర్‌లో సినిమా చూసే ఎన్.ఆర్.ఐ ల టైప్స్‌లో నేను ఒట్టి ఆర్.ఐ అయినా కూడా అదే ఫాలో అవుతుంటాను. అలా ఈ మధ్య కాలంలో అత్యధిక రేటింగ్ ఇచ్చిన 'ఏ మాయ చేసావే' సినిమాకు సాధారణ వాతావరణ పరిస్థితుల్లో పళ్ళు తోముకునే దాని కన్నా రెండు గంటల ముందుగా తోముకుని మరీ తెల తెల వారుతుండగా ఆదివారం పది గంటలకు పరిగెత్తుకుంటూ వెళ్లాను. కానీ సినిమా చూసి దిమ్మ తిరిగింది. ఈ ప్రపంచంలో నమ్మదగని వాళ్ల జాబితాలో ఆ మూడు (సాక్షి పత్రిక ఆ రెండు పత్రికలు ...అన్న స్టైల్‌లో) వెబ్‌సైట్స్‌ను కూడా చేర్చేసాను.

గౌతం మీనన్ స్నేహితులు, తనని ఎలా భరిస్తున్నారో ఏమో...వామ్మో ఇంత భారీ బోరింగ్, సెల్ఫ్ అండ్ సోది, సోడియం నైట్రేట్ డబ్బా ఎప్పుడు వినలేదు..ఇంక చూడడం నా వళ్ల కాలేదు. ఈ చిత్రం నుంచి తెలుసుకున్న నీతి ఏంటంటే ఎంత పరమ పరమెస్ట్ యాక్ స్క్రిప్ట్ అయినా వాక్‌చాతుర్యంతో కాని, అవాక్‌చాతుర్యంతో కాని పెద్ద పెద్ద పితామహులనుకూడా బురిడీ కొట్టించి సినిమా చెయ్యొచ్చని !!!

ఒంటరిగా వెళ్ళాను కాబట్టి సినిమా ఆసాంతం ఒకరి మోహాలు ఒకరు చూసుకోడానికి ఎవరూ లేకపోయారు. మరీ పక్కన కూర్చున్న అమ్మాయిల మొహాలు పదే పదే చూస్తే పెడార్ధం వస్తుందని అటు అదీ చెయ్యలేక ఇటు విసుగుని ఎలా వ్యక్త పరచాలో అర్ధం కాక, తెలుగు ' కాక కాక ' అయిపోయాను.

ఈ సినిమా గురించి ఆలోచిస్తుంటే శిరోభారం శీర్షాసనమేసినట్టుంది....మళ్ళీ కలుస్తా.

6 comments
  1. రవిచంద్ర March 5, 2010 at 2:34 AM  

    అయ్ బాబోయ్ ఎనిమిది నెల్లుగా బ్లాగుల్లో తిరుగులాడుతున్నా ఇప్పటిదాకా కనిపించనే లేదు మీరు. కడుపుబ్బ నవ్వుకున్నా మీ టపాలు చూసి. Thanks a lot for a great friday.

  2. Indian Minerva March 5, 2010 at 2:45 AM  

    అన్న ఏమయిపోనవే? ఇన్ని రోజులూనూ.... ఎప్పుడీ చీ.నా.బ రాసినప్పుడు చదివిణ్ణు చూసిణ్ణు.

  3. నాగప్రసాద్ March 5, 2010 at 3:49 AM  

    :))).

    చాలా రోజులు కన్పించకుండా మాయమయ్యారు. మాంద్యం ప్రభావమా. :)).

  4. హరే కృష్ణ March 5, 2010 at 9:00 AM  

    Hi Ashok
    Welcome back

    చాలా ప్రయత్నం చేసాను దీనివల్ల రోజూ నిద్రలో కలలో ఎక్కడికో పోవడం తప్ప జీవితంలో ఇది వరకు ఉన్నంత కిక్ కూడా ఇప్పుడు లేకుండా పోయిందని తెలిసొచ్చింది. కొన్ని జీవితాలు ఇంతే కాబట్టి బాక్ టు పిచ్ (బాక్ టు పెవీలియన్ కు వ్యతిరేకం) !!!

    kevv :D

  5. సుజ్జి March 5, 2010 at 9:24 AM  

    :))

  6. RAVEENDRA ATHOTA March 23, 2010 at 1:37 AM  

    aa cinema nachalante jeevitham lo evarnina love chesi undali annayya....