24-మార్చి-2010
లప్పంగిరిగిరి - 14
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!
- చాలా రోజులనుంచి నేను బ్లాగింగ్ చెయ్యకపోయినా ఈ బ్లాగ్‌కు విజిటర్స్ వస్తున్నారే అని మొన్నీమధ్య ఆశ్చర్యం వేసింది. తీరా చూస్తే ఆ క్రెడిట్ మొత్తం ' ఆంటి 'కి దక్కుతుంది అని తెలిసి ఆరెంజ్ మొహం వేసాను. ఏదో తెలియక ' ఆంటి ' అన్న పదం బ్లాగ్‌లో వాడినందుకు ఇంత ఫాలోయింగ్ ఉంటుందా అనిపించింది. గూగుల్ లో ' ఆంటి ' అన్న పదాన్ని ఇంతగా మన తెలుగు వాళ్లు సెర్చ్ చేస్తారా అని ఆలోచిస్తూ ఈ సారి మెరిండా మొహం వేసాను !!!
- నిన్ననే నా మీసానికి మంగళం పాడాను. ఇరవై రోజులనుంచి గెడ్డం మరియు మీసం పెంచి మరీ రాత్రింపగల్లు ఎంత శ్రమించినా ఫిక్స్‌కాని ఒక కాంప్లికేటెడ్ ఆఫీస్ ప్రాబ్లం, నేను పరధ్యానంలో ఉండగా గెడ్డం మాత్రమే గీసుకుని మీసాన్ని గాలికి, వెలుతురికి ...ఇలా పంచభూతాలకి వదిలేసి ఆఫీస్‌కు వెళ్లి పనిచేస్తే అత్యంత విచిత్రంగా ఆ రోజే ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. అప్పటి నుంచి తెగ సెంటిమెంట్ ఏర్పడి కేవలం మీసం విత్అవుట్ గెడ్డం మెయింటెయిన్ చెయ్యడం వల్లే తెగ కలిసొస్తోందని ఫాలో అయిపోవడం మొదలెట్టా.
ఇది గమనించిన స్నేహితులు ' రే కావాలంటే ఒకడు బ్లేడ్, ఇంకోడు రేజర్ ఇంకోడు నీ బదులు మీసం పెంచుతాడు ' కాని చూడలేక చస్తున్నాం నీకు దండం పెడతాం అది తీసెయ్ రా ' అన్నారు, ' ఒరే చిట్టి నాయుడు..ఉ..ఉ..ఉ..ఉ ' అని రెడీ సినిమా లో జయప్రకాష్ రెడ్డి ఇచ్చే రియాక్షన్ టైప్స్‌లో ఇచ్చే సరికి వాళ్ళే నిదానంగా అడ్జస్ట్ అయిపోయారు. నిన్న నాకే సిరాక్ దొబ్బి మీసాన్ని గీకేసా !!! దానితో మా బాస్బాసు (బాసు కు బాసు) సహితం ' అరే ఏంటి తేడాగా ఉన్నావ్. అవును నీకు ఇది వరకు మీసం ఉండేదిగా ' అని ఆశ్చర్యపడ్డాడు. ' అవును సార్ దానివల్లే మన ఇష్యూ సాల్వ్ అయ్యింది ' అని చెబుదామనుకుని ఒకసారి స్నేహితుల దిక్కు చూస్తే ' వద్దురా మా మూతులకు అన్యాయం చెయ్యొద్దురా ' అన్నట్టు చాలా దీనంగా మూతి ముడుచుకుని అర్ధిస్తుంటే జాలి వేసి ఆగిపోయా.
ఆఫీస్‌లో చాలా మంది నన్ను సరిగ్గా గుర్తుకూడాపట్టలేదు !!! మొత్తానికి సాయంత్రానికి జ్వరంకూడా వచ్చింది. డాక్టర్ దగ్గరకు వెళ్తే ఏంటి ప్రాబ్లం అన్నాడు. ' మీసం తీయడం వల్ల జ్వరం వచ్చింది ' అన్నాను. దెబ్బకు షాక్ తిన్న డాక్టర్ చేతిలో ఉన్న స్తెథస్కోప్‌ను తల మీద కూడా పెట్టి చూసి, ' ఏంటి బాబూ ఇంకో సారి చెప్పూ అన్నాడు...' అంటే జనవరిలో మీసం మాత్రమే పెంచడం వల్ల సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి సార్. మార్చిలో తీయడం వల్ల జ్వరం వస్తుంది ' అని చెప్పా. ఈ సారి దిక్కులు చూస్తున్న డాక్టర్ అవస్థను గమనించి, ' నిజం సార్ నిన్న మీసం తీయడం వల్ల దిష్టి తగిలి జ్వరం వచ్చింది, అన్నాను. " దిష్టి తగిలితే జ్వరం వస్తుందో రాదో నాకు తెలియదుకాని ఏదన్నా డిస్టర్బన్స్ జరిగితే వస్తుంది..." అన్నాడు. 'అదే సార్ ఆ డిస్టర్బెన్సే దిష్టి వల్ల వస్తుంది ' అని నేను చెప్పబోతుంతే 5ml అని రాసిన ఇంజెక్షన్‌ను కాస్తా 10ml అని మార్చి చక చకా రాసిచ్చాడు - 5ml దిష్టి కి 5ml డిస్తర్బెన్స్‌కి అన్నట్టు !!!

సాదారణంగా కొంత మందికి వారు వేసుకున్న డ్రెస్స్ వలన ఆత్మవిశ్వాసము పెరుగుతుంది. అలా మీకు కుడా మీ మీసము కొంచెము ఆత్మవిశ్వాసము పెంచి ఉండవచ్చు.ఆత్మవిశ్వాసము ఉన్నప్పుడు కొంచెము మన ప్రయత్నం చెయ్యటం ఉంటుంది.
దిష్టి తగిలితే జ్వరం వస్తుందో రాదో నాకు తెలియదుకాని ఏదన్నా డిస్టర్బన్స్ జరిగితే వస్తుంది..." అన్నాడు. 'అదే సార్ ఆ డిస్టర్బెన్సే దిష్టి వల్ల వస్తుంది
రచ్చ రచ్చ
chalaaaaaaaaaaaaaaaa baguntayi mee posts :) okokkati enni sarlu chadivano cheppalenu... bore kottina, upset ayina mee posts ee sharanyam! thanks :)
~ur fan