ఇది మా బి.టెక్ ఫైనల్ ఇయర్ యాన్యువల్ డే సందర్భంగా నాలుగేళ్ళు హాస్టల్లో ఉన్న హాస్టల్‌మేట్స్ సుమారు 15 మంది చేసిన డ్యాన్స్ ప్రోగ్రాం యొక్క ఆడియో ఫైల్. ఇది మాకు లైఫ్ లో చాలా స్వీట్ మెమొరీగా మిగిలిపోయింది. చాలా మందికి డ్యాన్స్ లో 1,2,3 లు తెలియకపోయినా అద్భుతంగా క్లిక్ అయ్యింది. 27 మినిట్స్ లెంత్ ఉండడం వల్ల కొంత మంది ఆర్గనైజర్స్ మధ్యలో ఆపాలని చూసినా ఆడియన్స్ నుంచి 'కంటిన్యూ కంటిన్యూ......' అని రోరింగ్ రెస్పాన్స్ రావడంతో కొనసాగించలేక తప్పలేదు. ఈ ప్రోత్సాహంతో మేము రెట్టించిన ఉత్సాహంతో చెలరేగి నర్తించిన ఆ వండర్ఫుల్ మొమెంట్స్ 5 సంవత్సరాలు కావొస్తున్నా ఇంకా మా కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ఈ ప్రోగ్రాం అయ్యాక కాలేజ్ నుంచి మేము వీడ్కోలు తీసుకునేంతవరకూ సెలబ్రిటీ లైఫ్‌ను ఎంజాయ్ చేసాం.
అనూహ్యంగా ఇంతటి విజయం సాదించిన ఈ ప్రోగ్రాం వీడియో లభించకపోవడం మమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నా ఆడియో అన్నా ఉన్నందుకు ఆనందిస్తున్నాం.
ఇలాంటి మెమొరీస్ అంటే ఇష్టం ఉన్న వారు ఆ ఫైల్ ను ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Post a Comment