శంకర్కు రకరకాలా ఆలోచనలు వస్తున్నాయి. కానీ అవి ఏవి అంత సాటిస్ఫ్యాక్టరీగా అనిపించలేదు. తనకు చాలా కన్స్ట్రేంట్స్ వున్నాయి. ఉన్నపలంగా ఏదన్నా బిజినెస్ మీద, లక్షలు లక్షలు పోసి ఇన్వెస్ట్ చెయ్యలేడు. అందుకే కాస్త కాస్ట్ ఎఫెక్టివ్గా తన జాబ్ డిస్టర్బ్ అవ్వకుండా ఏదన్నా చెయ్యాలనుకున్నాడు. ఆలోచనలతో పాటు తను కూడా దొర్లుతూ తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు.నెక్స్ట్ డే రోటీన్ లైఫ్లోకి ఎంటర్ అవుతూనే మైండ్లో ఒక థ్రెడ్ను పారలెల్గా మిషన్ మీద పెట్టాడు. సాయంత్రం 5 గంటలకు సుకుమార్ అనే ఫ్రెండ్ ఫోన్ చేసి: "హాయ్ శంకర్, పాస్పోర్ట్ పని మీద బెంగుళూరు నుంచి వచ్చాను, ఇప్పుడు అమీర్పేట్ మైత్రివనం దగ్గర వున్నాను. నీకు వీలుంటే కలుద్దామా ?" అన్నాడు. సుకుమార్, శంకర్ B.Tech క్లాస్మేట్స్. ఇద్దరు మరీ అంత క్లోజ్ ఫ్రెండ్స్ కాదు అలాగని బద్ధ శత్రువులూ కాదు. ఒకరంటే ఒకరికి మంచి అభిప్రాయం వుంది. శంకర్ కూడా కాలేజ్ అయ్యాక అస్సలు కలవలేదు, మళ్ళీ ఎప్పుడు వస్తాడో అని, ok అని చెప్పి వెంటనే బయలుదేరాడు.రోజు శంకర్ బైక్ సర్వీసింగ్కు ఇవ్వడం వల్ల షేర్డ్ ఆటోలో వెళ్దాం అని అనుకుంటుండగానే RTC బస్సు ఖాళీగా కనపడడంతో రోజేంటి ఇంత ఖాళీగా వుంది అని అనుకుంటూ బస్సు ఎక్కాడు శంకర్. కానీ అస్సలు మ్యాటర్ అప్పుడే తెలిసింది.బస్సుకు ఏదో ప్రోబ్లం ఉండి అక్కడే ఆగిందని, అది సాల్వ్ అయ్యి ఇప్పుడే రీస్టార్ట్ అయ్యిందని. నెక్స్ట్ నానో సెకండ్లో బస్సు మామూలు కెపాసిటి కన్నా నాలుగైదు రెట్లు పెరిగిపోయింది. శంకర్ దిగాలన్నా దిగే పరిస్థితి లేదు. అమీర్పేట్ వచ్చే వరకు బస్సు తొమ్మిది నెలల నిండు VLCC (Obesity Centre) ప్రెగ్నంట్ లేడీ లాగనే వుంది. కాని డెలివరీ పెయిన్స్ మాత్రం శంకరే ఎక్స్పీరియన్స్ చెయ్యాల్సి వచ్చింది. కొద్ది గ్యాప్లోనే నరకాన్ని నాలుగైదు రకాలుగా చుపించారు తోటి ప్రయాణికులు. అమీర్పేట్ రాగానే, ఫ్రెష్గా విడాకులు పొందిన పెళ్ళైన బ్యాచిలర్లా తయారయ్యింది బస్సు. ఒద్దు బాసూ బస్సు గొడవ అనుకుంటూ శంకర్ భయపడుతూ, బాధపడుతూ...మొత్తానికి బయటపాడి, సుకుమార్కు కాల్ చేసాడు. తను సత్యం థియేటర్ ఆపోజిట్ బేకరీలో వున్నాను అనగానే, వస్తున్నా అని చెప్పి కాల్ కట్ చెయ్యబోతుండగా ఫట్ మని మొఖం మీద 5,6 పాంప్లేట్స్ పడ్డాయి. శంకర్కు కోపం చిర్రెత్తుకొచ్చింది. ఎవడ్రా అది అని అటువైపు తిరగబోతుండగానే తన చేతిని ఇంకో చెయ్యి లాక్కుని ఒక పాంప్లెట్, కాళ్ళ దగ్గర రెండు...ఇలా మొత్తం బాడీని పాంప్లెట్ వర్షంతో సన్మానం చేస్తుండడంతో ఆపండెహె అని అరుస్తూనే, ఇదేదో సినిమాల్లో హీరోయిన్ ఇంట్రోడక్షన్కు సెట్ అయ్యే సీన్లా వుందే అని అనుకుంటూ...నడవడం స్టార్ట్ చేసాడు.కొంచం తేరుకున్నాక నవ్వొచ్చింది. ఇసుకేస్తే dandruff ఏమో అని లైట్ తీసుకునేంత జనం వున్నారు వరల్డ్ రినౌన్డ్ అమీర్పేట్ వీధిలో. జనంను, అదిత్య ఎంక్లేవ్ ఫ్లోర్స్ను, బ్యానర్స్ను ప్రపంచపు ఏనిమిదో వింతను చూసినంత విచిత్రంగా చూస్తూ సుకుమార్ని కలిసాడు శంకర్. 'హాయ్ మామ్స్....' అన్న రొటీన్ పలకరింపులు అయ్యాక, తనతో వున్న మిత్రుడిని పరిచయం చేసాడు సుకుమార్. వాళ్ళిద్దరు B.Tech అయ్యాక అదే అమీర్పేట్ సెంటర్లో సాఫ్ట్వేర్ కోర్సు చేసినప్పుడు పరిచయమయ్యి, ఫ్రెండ్స్ అయిన వారని చెప్పుకొచ్చాడు. ఇలా పిచ్చాపాటిగా వారు కాసేపు మాటాడుతుండగానే మరో ముగ్గురు వచ్చి ముగ్గురికి తోడయ్యారు. శంకర్ తప్ప మిగిలిన అందరు ఒకే క్లాస్లో సాఫ్ట్ వేర్ కోర్స్ చేసారంట. సుకుమర్ తప్ప మిగతా నలుగురు B.Techలో క్లాస్మేట్స్ అంట.వారు అందరూ ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్. బ్యాక్డోర్ లోనో, ఫేక్ సర్టిఫికేట్స్తోనో, ఒరిజినల్ టాలెంట్తోనో మొత్తానికి అందరు IT లోకి ఎంటర్ అయ్యామని గర్వంగా చెప్పుకుంటున్నారు. శంకర్ మాత్రం ఎప్పుడు అమీర్పేట్ వాతావరణంను ప్రత్యక్ష ప్రసారంగా చూడకపోవడంతో అంతా కొత్త కొత్త అనిపిస్తోంది. ఎందరో చెప్పగా విన్నాడు కాని మొదటి సారి అంత పీక్ టైంలో ఏరియాలోకి ఎంటర్ అవ్వడంతో చాలా ఇంటరెస్టింగ్గా ఫీల్ అయ్యాడు. 20-20 IT Den/చిక్ చిక్ సేమ్యా సాఫ్ట్వేర్ సొల్లు-(ట్యూ)షన్స్/2 మినిట్ Maggi అని రక రకాలా ఇన్స్టిట్యూట్స్ గురించి చెప్తున్నారు. కొన్ని ఇన్స్టిట్యూట్స్లో బ్యాచ్కు 700 మంది ఉంటారు అని, 5 నుంచి 10 TVలు పెట్టి క్లాస్లు చెప్తారని, ఫీ మాటర్స్, ID కార్డ్, లాబ్/క్లాస్లో సీట్కోసం వుండే డిమాండ్, కొందరు Rs 100 కే జావా, డాట్ నెట్ నేర్పించేస్తారని...ఇలా నిరవధికంగా చెప్తూనే వున్నారు.
ఆ తర్వాత అందరూ కలిసి ఎర్రగడ్డలో ఉన్న గోకుల్ ధియేటర్లో సినిమాకెళ్దాంసినిమా అని ఫోర్స్ చెయ్యడంతో శంకర్ అవుననక తప్పలేదు. శంకర్, సుకుమర్‌లని మిగతావారు బైక్ పై ఎక్కించుకుని బయలుదేరగా శంకర్ మాత్రం ఇంకా అమీర్‌పేట్ హాట్ స్పాట్ దిక్కే చూస్తున్నాడు. టికెట్స్ తీసుకున్నాక పక్కనే వున్న హోటల్‌లో టిఫిన్ చేస్తున్నంతసేపూ, ఇంకా ఇంటర్వల్ గ్యాప్‌లో ఎక్కడ సందు దొరికితే అక్కడ IT ముచ్చట్లు. వీటికన్నింటికీ ఎక్కడో ఒక చోట అమీర్‌పేట్ లింకు. ఇవి వింటూ ఏదో ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయాడు శంకర్.

ఎక్కడో US..అబ్రాడ్‌లో జీవం పోసుకున్న కంప్యూటర్స్, సాఫ్ట్‌వేర్స్‌లను మనకు తెలిసిన పల్లీ బఠానీలు మాదిరి లోకలైజ్ చేసి క్రియేట్ చేసిన ఈ కొత్త ప్రపంచాన్ని చూసి శంకర్ మైండ్లో ఒక చిచ్చు బుడ్డి, రెండు కాకరొత్తులు, మూడు నాలుగు రాకేట్లతొ..చిన్న సైజ్ దివాళి సెలబ్రేషన్స్ జరిగాయి. అదే సమయంలో, ఇన్ని వేల మంది ఇక్కడ ఇంత టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటున్నారు అని కూడా అనిపించింది. ఇదంతా కేవలం వేలం వెర్రిగా తోచింది.

సెకండ్ షో సినిమా అయిపోయాక ఆ ఫ్రెండ్స్ బ్యాచ్ శంకర్, సుకుమార్‌లను మళ్ళీ అమీర్‌పేట్ సిగ్నల్ దగ్గర డ్రాప్ చేసారు. ఇప్పుడు అదే మైత్రివనం వీధిని చూస్తున్న శంకర్ ఆశ్చర్యపోతూ ఒక చిన్న నవ్వు నవ్వాడు. ఆ వీధిమొత్తం నిర్మానుషంగా వుంది. వెంటనే తన బుర్రలో బల్బ్ ఆన్ అయ్యింది....తన మైండ్ చురుగ్గా పనిచెయ్యడం స్టార్టెడ్....ఇందులో పెద్ద బిజినెస్ ఆపర్‌చ్యునిటి ఉందని అర్థమయ్యింది. కాని దానిని తను ఎలా యూజ్ చేసుకోగలడా అని ఆలోచిస్తున్నాడు.

ఈ వీధిని పీక్ టైంలో కూడా ఇలా చూడగలిగితే ??? దానికోసం అమీర్‌పేట్‌కు ఆల్టర్నేటివ్‌గా వేల మందికి ఉపయోగంగా తను ఏదన్నా చెయ్యగలిగితే !!! కాని ఏం చెయ్యాలి ??? ఇంత పవర్‌ఫుల్‌గా ఎస్టాబ్లిష్ అయిన ఈ సిస్టంను బ్రేక్ చెయ్యడం ఎలా ? దీని చుట్టూ అల్లుకున్న సమస్యలను సాల్వ్ చెయ్యడం ఎలా ? అని తనను తానే ప్రశ్నించుకుంటుండగానే అవిడియా స్త్రయిక్ అయ్యింది....., ఒక వేల ఇవే కోర్సెస్ ను చాలా డిఫరెంట్‌గా, యూజ్‌ఫుల్‌గా వి.సి.డి/డి.వి.డిలలో అందుబాటులోకి తెస్తే ?

0 comments