ఛీ నా బతుకు
ఇది చాలా మందికి ఊత పదం. మన మీద మనకే అసహనం వచ్చినప్పుడు వచ్చేది. బై బర్త్ వచ్చిన కొన్ని అన్-వదిలించుకోవబుల్ అలవాట్లవల్ల గానీ, కొన్ని చిల్లీ చేష్టల వల్లగానీ ఈ పదం వాడాల్సిన అవసరం వస్తుంది.
ఉదాహరణలు:
1) 'వెంకీ' సినిమాలో ట్రెయిన్‌లో అద్దంలో తన ఇమేజ్ తో తనే మాట్లాడుకుంటూ రవి తేజ చెప్పుకునే సిట్యుయేషన్‌కు దారి తీసిన సీన్.
2) 'భద్ర ' సినిమాలో తన ఫోన్ కెమెరాతో తన ఫొటోనే తీసుకుంటూ 'చీ నా బ' అనుకోవడం...
ఇలాంటి సిట్యుయేషన్స్ తెప్పించిన సంఘటనలను, అలాంటి సందర్భాలలో 'ఛీ నా బ ' అని ఎలా అనుకుంటారో....అలాంటివి ఈ క్యాటగెరిలో పోస్టుతాను.
--------------------------------
అనగనగా ఒక ఇంటర్ కాలేజ్ మీట్। అక్కడ 'JAM - Just A Minute' కాంపిటీషన్ స్టార్ట్ అవుతోంది. స్టేజ్ పైన రౌండ్ టేబుల్ కాన్‌ఫెరన్స్‌లా అరేంజ్ చేసారు. ప్రతి ఒక్క చెయిర్ దగ్గర ఒక బజర్ ఉంది. మాడరేటర్/జడ్జ్ సీట్ స్పెషల్‌గా మధ్యలో వుంది.
అందరికీ రూల్స్ తెలుసు, కాని అక్కడ అన్ని రకాలుగా ఫ్రెషర్స్ అయిన మాలాంటి దద్దోజనం బ్యాచ్ కోసం రూల్స్ చెప్పారు।
పార్టీసిపెంట్స్ అందరికీ కలిపి ఒక టాపిక్ ఇస్తారు। ఒకరు మట్లాడుతున్నప్పుడు మిగతా అందరిలో ఎవరన్నా ఆ స్పీకర్ పాయింట్‌ని అపోజ్ చెయ్యొచ్చు. అది తడబడటం, ఇర్రెలెవెన్స్॥లాంటివి అవ్వొచ్చు. ఈ అబ్జెక్షన్‌ను సదరు జడ్జ్‌గారు అంగీకరిస్తే మనకు ఒక పాయింట్ వస్తుంది అండ్ నెక్స్ట్ మట్లాడే ఛ్యాన్స్ వస్తుంది. ఎంత ఎక్కువ సేపు మట్లాడితే అన్ని పాయింట్స్ అన్నమాట. ఒక వేల అబ్జెక్షన్ దొబ్బిందంటే ఒక పాయింట్ మైనస్ అవుతుంది, ఇంతక ముందు మట్లాడుతున్న వాడికి కంటిన్యూ చేసే ఛ్యాన్స్ వస్తుంది.
రూల్స్ క్లియర్‌గా వున్నా, వున్నది ఒక టాపిక్, ఒక్క నిమిషం, కాని పార్టీసిపెంట్స్ పది మంది, స్టార్ట్ అనడం ఆలస్యం 'ఆ' అంటే అబ్జెక్షన్‌లతో యమా ఎగ్జైటింగ్‌గా వుంటుంది। మా ముందు బ్యాచ్ వాళ్ళ సీన్ చూసి ఒక సారి పార్టిసిపేట్ చేసి చుద్దామనిపించి వెళ్లా.
మాకు వచ్చిన టాపిక్ - 'Life's best moments are experienced in Loo'
మనకున్న అప్పటి ఇంగ్లిష్ లెవెల్స్‌కు 'Loo' అంటే అర్థం తెలీదు. ఇప్పటికీ మీకు తెలియకపోతే నేన్ చెప్పా, వెళ్ళి డిక్షనరీలో చూసుకోండి. సో బై బర్త్ వచ్చిన లింక్ విథ్ లింకబుల్ థింగ్స్ లాజిక్‌తో... Loo అంటే Landscape కు పర్యాయపదం అయ్యుండొచ్చు అనుకున్నా. ఇంకేముంది పాపికొండలు...లాంటి లొకేషన్స్ కు వెళ్లిపోయా. ఫ్రెండ్స్ అందరూ కలిసి అలాంటి లొకేషన్‌లో టూర్ సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు ఊహించేసుకున్నా...ఇంతలో స్టార్ట్ అనగానే ఎవడో స్టార్ట్ చేసేసాడు.
అంతలో ఏదో అబ్జెక్షన్‌లా తోచింది. బజర్ ప్రెస్ చేసేసా...ఛ్యాన్స్ రాగానే ... 'Even my Friends say that Loo is a wonderful place to get together....' టైప్స్‌లో మాట్లాడెయ్యాలి అనుకున్నా....
చాలా మంది బజర్ ప్రెస్ చెయ్యడం వల్ల నా పక్కనున్న అమ్మాయికి మాట్లాడే ఛ్యాన్స్ వచ్చింది. తర్వాతే నాకు అస్సలు అర్థం ఆఫ్ Loo తెలిసింది. మైండ్ బ్లాక్ అయ్యింది. ఒక వేల నాకే ఛ్యాన్స్ వచ్చుంటే, నేను అనుకున్నది మట్లాడుంటే..ఏ రేంజ్‌లో బక్రా అయ్యుండే వాడినో తలుచుకుని 'ఛీ నా బొ ఛీ నా బ ' అనుకున్నా.

మీ కష్టాలు చూస్తుంటే నా పొట్ట తరుక్కుపోతుందండి....నవ్వలేక...మీకు ఫ్యాన్ అయిపోతిని....