ఛీ నా బతుకు - 2

Posted by అశోక్ వర్మ | 10:01 AM

ఛీ నా బతుకు - 2

మనకి ఇప్పటికీ డ్రైవింగ్ లైసెన్స్ ఇల్లే. అయినా ఎంతో తెలివిగా, ఠీవీగా తిరిగేస్తుంటాం అన్న బిల్డప్ అలియాస్ బలుపు ఉంది. చాలా సార్లు ట్రాఫిక్ పోలిస్‌లకు మస్కా కొట్టిన, వాళ్ళకే లిఫ్ట్ ఇచ్చి వాళ్ళను బక్రా చేసిన విషయాలను చాలా గర్వంగా ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకునే వాడిని. కాని ఒక రోజు నా pun పండింది.

ఒక ఫ్రెండ్‌ను కలవడానికి అమీర్‌పేట్ మైత్రీవనంకు వెళ్తుండగా సారధి స్టూడియోస్ దగ్గరకు రాగానే....సర్కిల్ దగ్గర వున్న టర్న్ దగ్గర నలుగురు ట్రాఫిక్ పోలీసులు అడ్డంగా నిల్చొని రసీదులు రాస్తున్న విషయం గమనించాను....ఆహా అనుకుని వెంటనే రివర్స్ తిరిగి ఫాస్ట్‌గా వెల్దామని ట్రై చేస్తుండగా అస్సలు ట్విస్ట్ తగిలింది...

అక్కడ పోలీస్‌లను చూసి ఇలా రివర్స్ టర్న్ అయ్యి వెళ్తున్న వారినొక్కరినే పట్టుకోడానికే ఇంకో పోలీస్ బస్ స్టాప్ దగ్గర వున్న పబ్లిక్‌లో కలిసిపోయి అబ్జర్వ్ చేస్తున్నాడని తెలిసి షాక్ అయ్యా. సరిగ్గా అతని ఎదురుగా వెళ్ళి దొరికిపొయాను.

తను లైసెన్స్ అనగానే...'మా అయ్య MLA' అందాం అనుకుంటుండగా తన ట్రీట్‌మెంట్‌కి...ఆ తర్వాత 'మా నాన్న...MA' అని లో వాయిస్‌లో అనాల్సి వచ్చి....తగు పైకం సమర్పించుకొని.. మొదటిసారి రికార్డ్ దొబ్బినందుకు ' ఛీ నా బో ఛీ నా బ ' అని తలను రక్షించాల్సిన హెల్మెట్‌కే తలను కొట్టుకుంటూ అనుకున్నా..

1 comments
  1. నేస్తం April 27, 2009 at 5:13 PM  

    :))