ఛీ నా బతుకు - 3

Posted by అశోక్ వర్మ | 11:13 AM

ఛీ నా బతుకు - 3

నా డ్రైవింగ్ లైసెన్స్ కష్టాలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి........

మా అయ్య పది నిమిషాల నాన్ స్టాప్ బ్రెయిన్ వాష్‌తో ఇప్పటికి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని కన్విన్స్ అయ్యా...లేదు లేదు అవ్వాల్సి వచ్చింది. బ్రోకర్ బాబాయిల కోసం ట్రై చేస్తే బోలెడుమంది వున్నారని తెలిసింది. ఒకడితో బక్రా-యింగ్ రాపో కుదరడంతో వీడే మనకు కరెక్ట్ అని డీల్ సెట్ చేసుకున్నా.

అంతా బానే వున్నింది కాని మరి మీకు నెట్ కనెక్షన్ వుందా ? అన్నాడు. ఎస్ యు సీ ఐ యాం ఏ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అని చెప్పా. అయినా చివర మాట పట్టించుకోకుండా మొదటి మాట మాత్రం విని తన షాప్‌లో వున్న నలుగురు నా నలువైపుల చుట్టేసి నన్ను సెంటర్ చేసి...ఆన్‌లైన్‌లో LLR కోసం ఎలా అప్లై చెయ్యాలో viva-rin-chaaru (exactly Viva + Rin + Chaaru కలుపుకొని తాగితే ఎలా వుంటుందో అలా వున్నింది నా పరిస్థితి.) www dot transport అని టైప్ చెయ్యాలి సర్ అని ఒకడు అనగానే ఇంకోడు....అహె అలా ఎందుకు సెప్తావ్.... గూగుల్ అని ఒకటుంటుంది సార్ [:ఒ] ఫర్స్ట్ దానిని కొట్టండి..అని ఇంకోడు...అరెవో డైరెక్ట్‌గా సైట్ సెప్టుంటే మళ్ళీ గూగుల్ అంటావ్ అని ఇంకోడు....ఇలా అందరూ వాళ్లల్లో వాళ్లు మట్లాడుకుంటూ నాకు ఆన్‌లైన్ ఫార్మ్ సబ్‌మిట్ చెయ్యడం చెప్పారు.

ఎలాగో వారి నుంచి తప్పించుకుని నెక్స్ట్ డే ఆ ఫార్మ్ ఫిల్ చేసి ఆ షాప్‌కు వెళ్తే, ఇంతకముందు కలిసిన వారు ఎవరూ లేరు ఇప్పుడు ఇంకో ఫ్రెష్ బ్యాచ్ వున్నింది. అందులో ఒక ఏజ్‌డ్ పర్సన్ వున్నాడు. నా అప్లికేషన్ ప్రింట్ అవుట్ ఇచ్చాను. LLR కావాలి అని చెప్పా.

అంతే, అతను నన్ను కిందకు పైకి మినిమం మూడు సార్లు చూసుంటాడు, నేనే నన్ను అన్ని సార్లు చూసుకోను ఈయనెవరబ్బా ??? అని అనుకుంటుండగా, మీకు ఏ లైసెన్స్ కావాలి ? అన్నాడు....

అబ్బా ఈ ముసలోల్లున్నారే !!! అనుకుని డ్రైవింగ్ లైసెన్స్, బండిది అన్నాను. 'అదే ఏ బండిది అన్నాడు ?' ..అహె అని నాకు విసుగొచ్చి..మా బండి గాడిని చూపించి..టూ వీలర్‌ది అన్నా. మరి ఇక్కడేంటి ఇది వుంది అన్నాడు. ఏది ? అని నేను తను చూపిస్తున్న పాయింట్ చూసా.
TRACTOR HEAVY - TRANSPORT అని వున్నింది.....
తన చూపుకి అర్థం, ఇప్పుడు అర్థమయ్యి నాకు తారే జమీన్ పర్. ఏదో హడావిడిలో ఓవర్ కాన్‌ఫిడెన్స్‌తో MOTOR CYCLE - NON TRANSPORT సెలెక్ట్ చేసా అనుకున్నా కాని అదెలాగో డీఫాల్ట్ ఆప్షన్‌కు వెళ్లినట్టుంది. ఆ ప్రింట్ అవుట్‌ని క్రాస్ వెరిఫై చెసుకోలా...
ఇంతలో మెయిన్ బ్యాచ్ వచ్చారు. వాళ్లకి పెద్దాయన మ్యాటర్ చెప్పడంతో ఈ సారి ఎనిమిది మంది కలిసి నా గురించి డిస్కస్ చెయ్యడం స్టార్ట్ చేసారు. అందుకే వొయ్ కస్టమర్స్‌తో ఫిల్ చెయ్యించొద్దని చెప్పేది. ఇలాంటి మిస్టేక్స్ చెస్తుంటారు. అయినా వాళ్లకేం తెలుసు. అని ఒక రేంజ్‌లో బ్యాటింగే బ్యాటింగు...

నేను నా బండి మిర్రర్‌లో చూసుకుని ఒక సారి వెకిలి నవ్వు నవ్వుకున్నా..ఆ నవ్వుకు అర్థం CNB


3 comments
  1. నేస్తం April 29, 2009 at 2:06 AM  

    hahaha :)

  2. కొత్త పాళీ April 29, 2009 at 4:32 AM  

    viva rin charu .. your creativity knows no bounds :)
    శీఘ్రమే లైసెన్స్ ప్రాప్తిరస్తు.

  3. పిచ్చోడు April 29, 2009 at 6:33 AM  

    viva-rin-chaaru (exactly Viva + Rin + Chaaru కలుపుకొని తాగితే ఎలా వుంటుందో అలా

    హహ్హహ్హాహ్హహహ....

    అశోక్ గారూ,, కేక :)