పందులతో పందెం !!!
మా కాంపౌండ్‌కు కొద్ది దూరంలో ఒక పెద్ద పందుల పాక ఉండేది. ఇది మా కాలనీ వాళ్ళు పట్టించుకోకపోయినా భావి భారత, మునిసిపాలిటీ కాన్షియస్ పిల్ల వెధవల్లా మాలో ఆగ్రహ జ్వాలలు ఎగిసి పడ్డాయి. అంతే, అప్పుడు రామాయణం, మహాభారతం సీరియల్స్ ఎఫెక్ట్ అనుకుంటా, బాణాలు తయారు చేసాం. ఇంట్లో చీపుర్లు అన్నీ గాయబ్. అవి బాణాలు. ఇక వేటే వేట. భలే వెంటాడే వాళ్ళం. చూసేవాళ్ళకు ఎవరు పందులో అర్థం అయ్యేది కాదు. ఈ బాణాలకు స్పెషల్ ఎఫెక్ట్‌లా చింత పండును అతికించి దానికి కంప చెట్ల ముల్లులు పెట్టి అస్సలు సిసలు అడవి రాక్షసుల్లా ఎగబడేవాళ్ళం. భలే అటాక్ చేసే వాళ్ళం, పందెం పందుల్లా (పందెం కోడి టైప్). పాపం దారుణంగా పరిగెత్తేవి పందులు. సుఖంగా మురికి కాలువలో పడుకుంటే నిద్ర చెడగొడుతున్న ఈ ఎదవలు ఎవ్వర్రా అని పాపం తెగ ఫీల్ అయ్యేవి. నేను ఒక సారి ఒక షార్ప్ పంది, తెగ ఇంటెలిజెన్స్ చూపిస్తుంటే సినిమాల్లో అస్త్రాలు ప్రయోగించే టప్పుడు, స్ట్రైట్‌గా వెయ్యకుండా ఒకొక్కసారి ఆకాశం వైపుకు వేస్తారుగా అలా వేసా. చాలా హైట్‌కు పోయింది కాని లాండ్ అయ్యే టప్పుడే ఒకతను సైకిల్ మీద రోడ్‌లో పోతుంటే అతని కన్ను, spectacles మధ్య వున్న అతి చిన్న గ్యాప్ నుంచి spectaclesని లైట్‌గా రాసుకుంటూ Spectacularగా మిస్ అవుతూ వెళ్ళింది. ఆ రోజు ఎఫెక్ట్‌తో పందుల పందాలకు బ్రేక్ పడింది.
"చూసేవాళ్ళకు ఎవరు పందులో అర్థం అయ్యేది కాదు."
lol.. too much ఇది..
next బాగా గొడవ జరిగినట్లుందే?! ;)
:)
ha ha ha ....super
"చూసేవాళ్ళకు ఎవరు పందులో అర్థం అయ్యేది కాదు."
:) memu koodaa chesevallamu idi.
"చూసేవాళ్ళకు ఎవరు పందులో అర్థం అయ్యేది కాదు." :))
"స్పెషల్ ఎఫెక్ట్‌లా చింత పండును అతికించి దానికి కంప చెట్ల ముల్లులు పెట్టి ", Same to same, naalage... :)
"అస్సలు సిసలు అడవి రాక్షసుల్లా", comparison adhurs...
"అటాక్ చేసే వాళ్ళం, పందెం పందుల్లా", idi keka...
By the way, అశోక్, నీ Style of expression చూస్తూ ఉంటే, Hyderabad కంటే కూడా, కరీంనగర్ కి, Perfect matching లాగా ఉంది. So, Child life ఏమీ miss అవ్వలేదన్న మాట. Good!!
> చూసేవాళ్ళకు ఎవరు పందులో అర్థం అయ్యేది కాదు
:-))
చూసేవాళ్ళకు ఎవరు పందులో అర్థం అయ్యేది కాదు
kekaa.