శాంతి స్వరూప్ వల్ల స్వరూపం మారిన వేళ !!!
చిన్నప్పుడు రెగ్యులర్‌గా డిడి-8లో శాంతి స్వరూప్ దర్శనమిచ్చేవాడు. ఒక రోజు ఆయన హెయిర్ స్టైల్ చాలా నీట్‌గా వుండడం గమనించాను. పాపిడి తీసే చోట (బట్టతలవల్ల) ట్రై యాంగిల్ షేప్‌లో గ్యాప్ రావడం వల్లే నీట్‌గా కనిపిస్తోందనిపించింది. వెంటనే బాత్‌రూంకి వెళ్ళిపోయి, మా డాడ్ రేజర్‌తో నేను హెయిర్ పాపిడి తీసే చోట గోకేసా. అంతే కొంచం హెయిర్ పోయింది. అప్పటికే సమ్మర్ కట్టింగ్ అని చాలా చిన్న జుట్టు వుంది. సో తీరా తీసాకా చూస్తే నేనే దడుసుకున్నా. దానిని ఎలా దాచాలో తెలియక చచ్చాను. అయినా ఇంట్లో కనిపెట్టారు. ఏమైంది అక్కడా అంటే 'శాంతి స్వరూప్'ని చూసి inspire అయ్యాను అనగానే నవ్వాపుకోలేకపోయారు. ఇప్పటికీ తనని చూసినప్పుడల్లా ఈ విషయమే గుర్తొస్తుంటుంది.

3 comments
  1. Raji December 26, 2008 at 10:59 AM  

    oops!! మల్లీ ఎంత కాలం పట్టిందో, పోయింది తిరిగి రావటానికి?! :P

  2. వేణూశ్రీకాంత్ December 26, 2008 at 5:06 PM  

    హ హ మీ నాటీ కబుర్లు బాగున్నాయి :-)

  3. Unknown May 14, 2009 at 2:29 AM  

    ma nanne yenta la inpire ayyavante neeku jr santiswarup ani award ivvali.