దీపావళి ధమాకా....
మా క్లాస్‌మేట్ వుండేవాడు. వాడు పిచ్చ అమాయకత్వపు అతి, అన్నమాట. కొంచం కక్కుర్తి కూడ ఎక్కువ ఎదవకి. ఒకసారి దీపావళి అప్పుడు, టపాకాయల్లో పేలని వాటినన్నింటినుంచి, గ్రే కలర్ మందు వుంటుంది కదా, అది కలెక్ట్ చేసి ఒక పేపర్లో పడేసి వెలిగించాలని ప్లాన్ వేసాడు. అప్పుడు స్పార్క్స్ వస్తాయని వీడికి స్పార్క్ అయ్యింది. అంతే వెంటనే అవి కలెక్ట్ చేసి పేపర్ అంటించాడు. కాని స్పార్క్స్ రాలేదు. సొ దగ్గరకు వెళ్ళి, మళ్ళీ చేస్తే సూపర్ స్పార్క్‌లు ఎంతగా అంటే వాడి మొహంలో కనుబొమ్మలు మొత్తం కాలిపోయి ఆ ఏరియా మొత్తం ఖాళీ అయ్యింది. మరుసటి రోజు స్కూల్‌కు వస్తే అంతా ధెయ్యం అనుకున్నారు. నేను కూడా భయపడిచచ్చా. మొహంలో eyebrowsను నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. కాని eyebrows లేకపోతే ఎంత బీ...బీ...భీభత్సంగా వుంటుందో అప్పుడే తెలిసింది.

3 comments
  1. Anonymous December 26, 2008 at 10:32 AM  

    మీ చిన్ననాటి ముచ్చట్లు చాలా బాగున్నాయి.

  2. Raji December 26, 2008 at 10:47 AM  

    బాబోయ్.. ఏం ప్రమాదం జరగలేదా?? వెంటనే school కి ఎలా వచ్చేసారు?

  3. Anonymous September 11, 2011 at 5:55 AM  

    monalisa ki eye brows undavu thelusandi.