శభాష్ శభాష్ శభాష్ - 8
2004లో ఇంటర్నెట్ వాడకం అప్పుడప్పుడే ఊపందుకుంటున్న టైం. మా ఫ్రెండ్ ఒకడు బెంగుళూరు వెళ్లిపోతుండడంతో ఆంధ్రాలో ఉండే తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయికి నెట్‌ని ఇంట్రొడ్యూస్ చేసాడు. సో దట్ నెట్ ద్వారా టచ్‌లో ఉండొచ్చని. తనకొక రెడిఫ్ మెయిల్ ఐ.డి క్రియేట్ చేసాడు. పాస్‌వర్డ్ మార్చుకోవడం చూపించాడు. తర్వాత తను మార్చుకుంది. నెక్స్ట్ డే ఈడు బెంగుళూరు వెళ్లిపోయాడు. వెళ్లిన రోజే నాకు ఫోన్ చేసాడు. బాబోయ్ మనమంటే ఈడికి ఇంత ఇష్టమా, అని నేను ఫీల్ అయ్యేంతలోనే చావుకబురు చల్లగా చెప్పాడు. వాడు తొందరపడి ఏదో ఎమోషనల్ మెయిల్ కొట్టాడంట. దాన్ని ఆ అమ్మాయి చూడకుండా చెయ్యాలి, ఎలా రా అని అడిగాడు. ఆ అమ్మాయి ఇంక జీవితంలో ఇంటర్నెట్ ముట్టకూడదని నీ బట్టతలపై శపథం చెయ్యించుకో అని చెప్పాను. కాని వాడు సీరియస్‌గా అడుగుతుంటే నేనూ సీరియస్‌గా ఆలోచించడం మొదలెట్టా. మహా అంటే ( ఆర్ అన్నా అనకపోయినా ) రెండు మూడు రోజులు ఆపగలం, ఆ తర్వాత ఎప్పుడైనా తను మెయిల్ అకౌంట్ ఒపెన్ చెయ్యొచ్చు. ఒక్కసారి మెయిల్ చేసాక రివర్ట్ చేసుకునే ఛ్యాన్సే లేదే అని ఆలోచిస్తున్నాం. తను మెయిల్ ఐ.డి పూర్తిగా వాడడం లేదు. సో ఆ ఐ.డి పోయినా పర్లేదు ఆ మ్యాటర్ మాత్రం చూడకూడదు అంటున్నాడు కాని ఆ మ్యాటరేంటో చెప్పట్లేదు. నేనూ ఇంక అడగడం వేస్టని వదిలేసాను.
ఒక ఆప్షన్, తన అకౌంట్ వీడే క్రియేట్ చేసాడు కాబట్టి, ' Forgot Password' ఆప్షన్స్‌కు వెళ్లి పాస్‌వర్డ్ మార్చెయ్యడం. తర్వాత పర్సనల్ డీటెయిల్స్, సీక్రెట్ క్వెషన్/ఆన్సర్ కూడా మార్చెయ్యడం, సో దట్ ఆ ఆమ్మాయి మళ్ళీ పాస్‌వర్డ్ మార్చుకోలేదు. ఆ ఐ.డి తనకి దూరం అయినట్టే. ఇదేదో బానే ఉందిరా అని, ట్రై చేస్తానన్నాడు. కానీ పాస్‌వర్డ్ మరిచిపోయినప్పుడు వచ్చే ప్రశ్నకి సమాధానం మనోడు మర్చిపోయాడు. క్రియేట్ చేసేటప్పుడు ఏదో క్యాజువల్‌గా ఇచ్చేసాడు. ఎంత ట్రై చేసినా ఇలా పాస్‌వర్డ్ మార్చడం కుదరలేదు.
ఇప్పుడెలారా అని మళ్ళీ ఫోన్ చేసాడు. ఆ అమ్మాయి మెయిల్ ఏ టైంలో చూస్తుందో కూడా తెలీదు. సో సాధ్యమయినంత త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి అని టెన్షన్ పడుతున్నాడు, పెడుతున్నాడు. అప్పుడు తట్టింది ఒక ఐడియా. ఆ రోజుల్లో చేతనా గ్రూప్స్, మరి కొన్ని ఫోరమ్స్‌లో ఫ్రెషర్స్ IT ఓపెనింగ్స్‌కు టూ మచ్‌గా ఫాలోయింగ్ ఉండేది. సో ' Dummy Dudes' అని ఒక కంపెని ఫ్రెషర్స్‌ను రెక్రూట్ చేసుకుంటోందని మెసేజ్ పెట్టు, అందులో రెజ్యూమ్స్ పంపించాల్సిన మెయిల్ ఐ.డి అని ఈ అమ్మాయి ఐ.డి ఇవ్వమన్నాను. కొన్ని వేల రెజ్యూమ్స్ ఆ మెయిల్ ఐ.డికి వస్తాయి కాబట్టి నీ మెసేజ్ చుసే ఛ్యాన్సెస్ తక్కువ. మోస్ట్లీ తన ఐ.డి దొబ్బేస్తుందని చెప్పను. కాని ఇది ఫ్రెషర్స్‌కు ఆశ పెట్టి నువ్వు మాత్రం టిఫిన్‌గా దోశ, వడ, మీల్స్‌లో అప్పడం తిన్నట్టవుతుంది. అఫ్‌కోర్స్ పాపం అంటే మరీ అంత పాపం కాదు, చాలా మంది CC లో మెయిల్ ఐ.డీలు పెట్టి చాలా కంపెనీస్‌కు ఒకేసారి CV పంపిస్తారు, అందులో ఇది ఒకటవుతుంది. ఆ పాపం నువ్వు మోసుకుంటానంటే పెట్టు అని చెప్పా.
వాడు ఎగ్జైట్ అయ్యాడు. ఆడు జాబ్స్ అప్లయ్ చేసే ఫ్లోలో ఉన్నాడు, సొ అలాంటి ఓపెనింగ్స్ నోటిఫికేషన్‌లు ఎలా వుంటాయో బాగా తెలుసు. ట్రై చేస్తానని చేసాడు. కట్ చేస్తే ఆ అమ్మాయి మెయిల్ ఐ.డీకి 25,000 CVలు వచ్చాయి. 15,000కే మెయిల్ ఐ.డి స్పేస్ అయిపోయింది....రోజు రోజుకి ఇంకా పెరుగుతున్నాయంట. తను వీడికే ఫోన్ చేసి, నా మెయిల్ ఐ.డిలో వేలకు వేలకు రెజ్యూమ్స్ వస్తున్నాయి ఏమి చెయ్యాలి అని అడిగింది. అయ్యయ్యో నీ మెయిల్ ఐ.డి నీ రెజ్యూంలో ఆర్ ఎల్స్ ఎక్కడో చూసి అలా అలా ఫార్వర్డ్ అయినట్టుంది. ఈ సారి ఇంకోటి క్రియేట్ చేసుకుని జాగ్రత్తగా ఉంచుకో. తెలిసిన వాళ్లకి తప్ప ఎవరికీ చెప్పకు అని మన వాడు క్లాస్‌గా క్లాస్ తీసుకున్నాడు. మొత్తానికి సేవ్ అయ్యాడు. ఆ తర్వాత చాలా రోజుల వరకు టచ్‌లో లేడు. 6 నెలల తర్వాత కలిసినప్పుడు అడిగితే మెయిల్ ఐ.డి మార్చుకున్నా, నీకు తప్ప అందరికీ చెప్పానురా...సారీ అన్నాడు !!!