ఛీ నా బతుకు - 7
మనకు రోజూ పేపర్ చదవడం అలవాటు. అదే నా జీవితంలో ఒక రేంజ్ షాక్ ఇస్తుందని అప్పట్లో నాకు తెలియదు. 2000 ఎంసెట్ ఎగ్జాం టైంలో అలా పేపర్ చూస్తుండగా ఇంటర్‌లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి షార్ట్ టర్మ్ ఎంసెట్ కోచింగ్‌లో డిస్కౌంట్స్ అన్న ఆఫర్ చూసాను. కట్ చేస్తే గుంటూరు నలంద కాలేజ్‌లో ఉన్నా. అక్కడ ఎన్నో షార్ట్ కట్స్ చెప్తున్నారు, అవి రోజుకు ఒక్కసారి రివైజ్ చేసే టైం కుడా ఇవ్వనంత ఎక్కువ ఉన్నాయి. అలాంటి బిజీ బిజీ టైంలో కూడా నేను నా పేపర్ చదివే అలవాటు మానలేదు. ఒక రోజు ఒక ఆర్టికల్ చూసాను. నారా చంద్ర బాబు గారు ఈ సారి తెలుగు అకాడెమి బుక్స్ నుంచే ఎంసెట్ క్వెషన్స్ అన్నీ ఇవ్వాలని ఏదొ మీటింగ్లో డిసైడ్ చేసారని వున్నింది. అది చాలా చిన్న సైజ్ ఆర్టికల్‌గా వచ్చింది. దానిని మడిచి నా ట్రంక్ పెట్టలో భధ్రముగా పెట్టుకుని దాచుకున్నా. ఇంకెవరన్నా ఆ మ్యాటర్ చూస్తే, అది అలా అలా పాకిపోయి అందరూ తెలుగు అకాడెమినే ఫాలో అవుతారు. అప్పుడు మళ్ళీ అందరి మధ్య కాంపెటీషన్ వస్తుంది, అదే ఎవ్వరికీ చెప్పకపోతే నేనొక్కడినే చదువుకుని టాపర్ అయిపోవచ్చు అని మాస్టర్ ప్లాన్ వేసాను.
అక్కడి లోకలైట్స్‌తో ఇన్‌ఫర్మేషన్ సంపాదించి, గుంటూరు బ్రాడిపేట్ ఏరియాలో సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్ల్స్‌లో తెలుగు అకాడెమి ఎంసెట్ బుక్స్ గురించి వాకబు చేసాను. నాలుగైదు గంటలు శోధించి చివరికి సాధించాను.
ఆ రోజు నుంచి అస్సలు నలంద కోచింగ్ మెటీరియల్, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ కాకుండా ఎవరికీ కనపడకుండా, తెలుగు అకాడేమి తెలుగు మీడియం బుక్స్‌ని ( నేను ఇంగ్లిష్ మీడియం అయ్యుండి ) చదవడం మొదలెట్టాను. నాకు దొరికిన ఈ అల్లావుద్దిన్ అకాడెమి షార్ట్ కట్ ముందు ఈ కోచింగ్ సెంటర్ షార్ట్ కట్స్ అన్నీ వేస్ట్ అని లైట్ తీసుకున్నా. రోజూ ఆ TA బుక్స్ ని బట్టీ కొట్టే వాడిని. ఇలా పుణ్య కాలం కాస్తా గడిచిపోయింది. ఎంసెట్ ముందు రోజుకి తెలుగు అకాడెమిలో ఫలానా క్వెషన్ ఏ పేజీలో వుంది అన్నా కూడా చెప్పే రేంజ్‌లో బట్టీ కొట్టాను. ఒకవేల 200 క్వెషన్స్ అవే బుక్స్ నుంచి వస్తే ఖచ్చితంగా నేనే స్టేట్ టాపర్ అని ఫిక్స్ అయిపోయాను.
ఎంసెట్ ఎగ్జాం రోజు కూడా నేను ఆ తెలుగు మీడియం బుక్స్‌నే చదువుతుంటే మా నాన్నకు అర్థం కాలేదు. ఏమో లే అని ఊరుకున్నాడు. మొత్తానికి ఎంసెట్ పేపర్ చూడగానే ' యముడే సెట్ ' చేసినట్టు అనిపించింది. ఒక్కటంటే ఒక్క బిట్టు లేదు. OMR షీట్ యే ఆకాశం, అందులో సర్కిల్స్ యే చుక్కలుగా కనిపించాయి. అయిపోయానురోయ్...............అనుకున్నా.
ఆ రోజు తిన్నంత ఖంగు ( పేపర్ భాషలో ) జీవితంలో ఎప్పుడూ తినలేదు. రిజల్ట్స్ వచ్చేవరకు న్యూస్ పేపర్ జోలికి పోలేదు. చంద్రబాబు పైన విపరీతమైన కోపం వచ్చింది. కొన్ని నెలల తరువాత ట్రంక్ పెట్ట తవ్వకాల్లో ఆ ఆర్టికల్ కనిపించింది. ఈ సారి నిశితంగా అబ్జర్వ్ చేసి చూస్తే - " ఎంసెట్ క్వెషన్ పేపర్ తెలుగు అకాడెమి పుస్తకాల నుంచి ? " అని చివర్లో క్వెషన్ మార్క్ ఉండడం గమనించాను !!!
భలేగా ప్రెజెంట్ చేసావ్..ఒక కనువిప్పు కలిగింది అన్న మాట ..ఇలా పుణ్య కాలం కాస్తా గడిచిపోయింది..యముడే సెట్..బావున్నాయి
మీ టపా బాగుంది. న్యూస్ పేపర్ కూడా ఆది నుండి అంతం వరకు చదవాలి అనే జ్ఞానాన్ని భోధించారు.ఇంతకీ రిజల్ట్ మాట ఏవిటి బాస్?
ఖంగు బాగానే తిన్నారు .. ఇంతకీ seat వచ్చిందా లేదా? :)
మీరు భలేగా రాస్తున్నారండి.
> చివర్లో క్వెషన్ మార్క్ ఉండడం గమనించాను
mari CNB ani eppuDu anukunnAru :-)