శభాష్ శభాష్ శభాష్ - 5
ఈ సంఘటన ఒక అనామకుడి జీవితంలో జరిగినది. కథానాయకుడి పేరు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇవ్వడం లేదు.
ఈడు ఏకాకిగా 1st ఫ్లోర్ లో ఒక పోర్షన్‌లో అద్దెకు వుంటున్నాడు. ఈడి పక్కన పోర్షన్‌లో ఇంకో ఏకాకి ఉంటున్నాడు. ఇతనిని అనామకుడు++ అనుకోవచ్చు. ఇలా ఈ దో-కాకుల వల్ల ఆ ఇంటి ఓనర్‌కు రెంటు బాగా గిట్టుబాటు అవుతోంది. అలా వుండగా ఒక రోజు మన వాడు House Rent Allowance క్లెయిమ్ చెయ్యడం కోసం ఓనర్ ఆంటీని ఆఫీస్‌లో OC గా ఇచ్చే మేరీ గోల్డ్ పసుపు పచ్చ గడ్డి బిస్కట్స్ రెండు ఇచ్చి సాంప్రదాయ బద్ధంగా సంప్రదించాడు.
ఏంటి బాబు విషయం అని ఆంటి అడిగితే, "మరేం లేదు ఆంటి House రెంటు కడుతున్నామని ఆఫీస్‌లో సబ్‌మిట్ చేస్తే ట్యాక్స్ సేవ్ అవుతుంది. అందుకోసం అంకుల్ సంతకం కావాలి...." అనగానే, అంకుల్ ఊర్లో లేడు బాబు అని ఆంటి చెప్పింది. ' పర్లేదు ఆంటి సంతకం అంటే ఎగ్జాక్ట్లీ సంతకం కాదు, సంతకం లాంటిది అయినా పర్లేదు. అంకుల్ పేరు రాస్తే చాలు. బై ద వే అంకుల్ పేరు ???" అని ఈడు అడిగాడు. ఆంటి తెగ సిగ్గు పడి సాయంత్రం మా చింటుగాడు ఉంటాడు వాడిని అడుగు అంది.
వామ్మో నీ సిగ్గుని శీను వైట్ల కామెడి సీన్‌లకు వాడుకోనూ....అనుకుని అస్సలు విషయం నాంచడం వేస్టని, "ఆంటి మరి నేను 5000 రెంట్ కడుతున్నా కదా ఎక్కువ ట్యాక్స్ సేవ్ కావడం కోసం 10000 అని క్లెయిం చేస్తున్నా పర్లే.....................దా ? అని ఈడు అనేంతలో, " ఆ ఇంటికి 10000 రెంట్ అంటే, 10000 అంటే ఏంటో తెలిసిన ఎవడూ నమ్మడు. మాకెందుకు బాబు ఆ రిస్కులు. వెరిఫికేషన్‌కు వస్తే కష్టం" అంది. ఏం కాదు ఇది ఫార్మాలిటీ అని ఎంత కన్విన్స్ చేసినా ఆంటి ఒప్పుకోకపోవడంతో, "ఐతే ఒక పని చెయ్యండి ఇన్స్పెక్షన్ వాళ్లు వస్తే 1st ఫ్లోర్ రెండు పోర్షన్స్‌లో నేనే ఉంటున్నా అని చెప్పండి" అన్నాడు. ఆంటి కొంచం షాక్ అయ్యింది. నో చెప్పలేక పోయింది. కొంచం ఆలోచించాక ఆంటి బల్బ్ ఎలిగింది. "మరి నీ పక్కన పోర్షన్‌లో ఉండే అతను కూడా HRA సబ్‌మిట్ చెయ్యాలి కదా అతనికి ఇన్స్పెక్షన్‌కు వస్తే ? " అంది. ఈ సారి వీడికి కౌంటర్ పడడంతో ఈడు ఆలోచనలో, ఆంటి ఆనందంలో పడ్డారు.
మనవాడు త్వరగా కోలుకుని, " అతని పోర్షన్, నా పోర్షన్ రెండిటిలోనూ అతనే ఉంటున్నాడని చెప్పండి. మేము ఇద్దరం వేరే వేరే కంపెనీస్ కాబట్టి ఒకేసారి ఇన్స్పెక్షన్‌కు రారాంటి. నా గురించి అడిగితే రెండూ నావే అని చెప్పండి. అతని గురించి వస్తే రెండూ తనవే అని చెప్పండి. మ్యాటర్ సాల్వ్, మ్యాటర్ సాల్వ్, మ్యాటర్ సాల్వ్ " అని చెప్పడంతో ఆంటి డెడ్ లాక్ అయ్యి ఒప్పుకుంది !!!
సరిగ్గా వారం తర్వాత దర్శనం ఇచ్చారు ...లేట్ గా ఆయినా మీకు రెండు సార్లు సభాష్ సభాష్..కొంచెం frequent గా రాయండి పోస్ట్స్ దో-కాకి లాజిక్ బాగా కుదిరింది ...పోస్ట్ బావుంది
"దో-కాకులు"
" ఆ ఇంటికి 10000 రెంట్ అంటే, 10000 అంటే ఏంటో తెలిసిన ఎవడూ నమ్మడు."
:))))
> ఇతనిని అనామకుడు++ అనుకోవచ్చు
> ఆఫీస్‌లో OC గా ఇచ్చే మేరీ గోల్డ్ పసుపు పచ్చ గడ్డి బిస్కట్స్
:-))
ఆ అనామకుడు తమరేనా సార్ :)
ఏకాకులు దోకాకులు, అంతకంటే ఎక్కువైతే చికాకులు :)
వెర్రీ ఫన్నీ
నాకు తెలిసిన చాలామంది అనామకులు అసలిలాంటి చిన్నచిన్న విషయాల కోసం ఇంటి ఓనర్లనికాని సదరు భర్తా/భార్యా మణులని కాని ఇబ్బంది పెట్టనేపెట్టరు :-)