శభాష్ శభాష్ శభాష్ - 6
లాంగ్ లాంగ్ అగో, ఒక ఆదివారం....డోంట్ నో ఇఫ్ ఇట్ వాజ్ అమావాస్యా ఆర్ నాట్. నైట్ 10:30 కు నేను సిటీ బస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఒక పని పడి చాలా దూరం వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు రిటర్నింగ్ అన్నమాట. అట్ లాస్ట్ ఒక బస్ వచ్చింది. రష్ కూడా తక్కువ వుండడంతో సీట్ దొరికింది. హమ్మయ్య అనుకునేంతలో టికెట్ టికెట్ అని కండక్టర్ వచ్చాడు. మహా కోపంగా ఉన్నాడు. షార్ట్ టెంపర్ క్యాండిడేట్ అనుకుంటా. నేను వెళ్లాల్సిన ఏరియా చెప్పి 10 రుపీస్ ఇచ్చాను. చిల్లర ఇవ్వు అన్నాడు. టికెట్ ఎంతా అన్నాను. 5 అన్నాడు. మరి 10 రుపీస్ చిల్లరేగా అన్నా. సర్రున కాలినట్టుంది. ఏం చిల్లర అడుగుతుంటే.....5 రుపీస్ చిల్లర ఉంటే ఇవ్వు లేకుంటే దిగిపో అన్నాడు. దిగేటప్పుడు చిల్లర తీసుకుంటాలే అన్నాను. హట్, ఎవడూ చిల్లర ఇవ్వడు, అయినా ఇంకెవడెక్కుతాడు ? దిగు దిగు అంటున్నాడు. ఈ సారి నాకు కాలింది. రెండు టికెట్స్ ఇవ్వు అన్నాను. రెండెందుకు ? ఇంకొకరు ఎవరు అన్నాడు. ' ఊర్కే ' అన్నాను.

తను షాక్‌డ్. ఆ షాక్ కి టికెట్ కొట్టకుండా అలానే ఉండిపోయాడు. అంత డబ్బులెక్కువైతే ఆ 5 రుపాయలు మాకే ఇవ్వొచ్చుగా, ఊరికే టికెట్ కొట్టడం ఎందుకు ? అన్నాడు. నీకు మాత్రం ఇవ్వను, రెండు టికెట్స్ కొట్టు అన్నాను. అతను ఇంకా బ్లాంక్ ఫేస్ వేసుకుని వున్నాడు. టికెట్ తీసుకోకుంటే తప్పు కాని 2, 20, 200 టికెట్స్ తీసుకోకూడదని ఎక్కడన్నా రూల్ ఉందా ? అన్నాను. టికెట్స్ కొట్టేంత వరకు వదిలిపెట్టలా.

చాలా సేపటికి ఎవరో ఒకడు చాలా హుషారుగా బస్ ఎక్కాడు. కండక్టర్ టికెట్ అన్నాడు. అతను తీసుకునే లోపు, ' బాస్ నేను తీసుకున్నా...' అన్నా. ఆడు షాక్‌డ్, నాకు పబ్లిక్‌లో ఇంత ఫాలోయింగ్ ఉందా అన్న డవుట్‌ఫుల్ ఎక్స్ప్రెషన్‌తో...' నేను మీకు తెలుసా ? ' అన్నాడు. లేదు ' ఊర్కే ' తీసుకున్నా, అన్నా. జరిగిన మాటర్ అంతా తెలియని అతను బ్లాంక్ ఫేస్ వేసాడు - ' ఊర్కె నా....' అని. కండక్టర్ ఉరిమి ఉరిమి చూసాడు.

ఆ టైంలో దిగితే వేరే బస్ దొరకడం కష్టం, ఆటో్‌లో వెళ్తే మినిమం 50 రుపీస్ పైనే అవుతుంది. సో 5 రుపీస్ పోయినా ఇదే బెస్ట్ అని అలా ప్రొసీడ్ అయ్యాం అన్నమాట !!!

7 comments
  1. హరే కృష్ణ May 15, 2009 at 4:17 AM  

    .టికెట్స్ కొట్టేంత వరకు వదిలిపెట్టలా .. పబ్లిక్‌లో ఇంత ఫాలోయింగ్ ఉందా అన్న డవుట్‌ఫుల్ ఎక్స్ప్రెషన్‌తో...' నేను మీకు తెలుసా ?..బావున్నాయి ..శభాష్ ..శభాష్.

  2. నాగప్రసాద్ May 15, 2009 at 4:37 AM  

    శభాష్...శభాష్...శభాష్. :)

  3. కొత్త పాళీ May 15, 2009 at 6:35 AM  

    ఇది నిజ్జంగా సెబాసించాల్సిన క్రియ.
    సెబాసో సబాసు.

  4. బ్లాగాగ్ని May 15, 2009 at 7:22 AM  

    :) nice retart

  5. సృజన May 15, 2009 at 10:21 AM  

    భలే షాక్....

  6. panipuri123 May 15, 2009 at 12:35 PM  

    > ఆడు షాక్‌డ్, నాకు పబ్లిక్‌లో ఇంత ఫాలోయింగ్ ఉందా అన్న డవుట్‌ఫుల్ ఎక్స్ప్రెషన్‌తో...' నేను మీకు తెలుసా ? ' అన్నాడు. లేదు ' ఊర్కే ' తీసుకున్నా, అన్నా.
    :-)

  7. Sujata M June 16, 2009 at 10:06 AM  

    oh. tension pettesaru. nakkuda ee prapancham lo nacchani (bhayapade) praani balli. pooja gadi lo balli ante naaku hadal. pooja madhyalo vaste ? devudiki balli raavoddani praardhinchi, poojaki kurchunta.