ఛీ నా బతుకు - 4

Posted by అశోక్ వర్మ | 8:23 AM

ఛీ నా బతుకు - 4
ఇది ఓ....కాలం నాటి సంగతి:
చాలా రోజులనుంచి బ్యాంక్‌లో ఒక చెక్ డిపాజిట్ చెయ్యాలనుకుంటున్నా, అంత దూరం వున్న బ్యాంక్‌కు ఎవడెలతాడులే తీరిగ్గా వున్నప్పుడు వెళ్లొచ్చు అని వాయిదా వేస్తూ వేస్తూ ఆ చెక్ ఆర్కియాలజి డిపార్ట్‌మెంట్‌లో అరువు తెచ్చుకోడానికి వాడుకునేలా తయారయ్యేటప్పటికి ఇక లాభం లేదనుకుని వన్ ఫైన్ శనివారం హాలిడే కదా అని బయలుదేరాను. బ్యాంక్ మధ్యాహ్నం వంటి గంట వరకే ఉంటుందని, ఫ్రెండ్స్ సినిమా కెల్దామన్నా ఇంపార్టంట్ పని ఉంది రాలేను అని చెప్పాను. అసలే శనివారం ఫుల్ రష్ వుంటుంది, ఈరోజు బ్యాంక్‌కు నేనే మొదటి కష్టమర్ కావాలి అని చాలా తొందరగా బయలుదేరాను. మూడు బస్సులు మారి ఆఫ్టర్ ఎ లాంగ్ టెడియస్ టఫ్ జర్నీ అట్‌లాస్ట్ బ్యాంక్ లోకేషన్‌కు చేరుకున్నాను.
అప్పటికే చాలా అలసిపోయాను. బ్యాంక్ ఆ బిల్డింగ్‌లో ఒకటి కాదు, రెండు కాదు, మూడు అంతస్థులపైన వుంది అంటే నాలుగో ఫ్లోర్‌లో అన్నమాట. ఆ టైంకి పవర్ లేకపోవడంతో లిఫ్ట్ కూడా హ్యాండ్ ఇచ్చింది. సర్లే అని చచ్చీ చెడీ అన్ని ఫ్లోర్స్ ఎక్కి వెళ్తే అప్పుడు తగిలింది డబ డిబ డిష్ డిష్ డబ డబ లాంటి షాక్.
బ్యాంక్ క్లోజ్ చేసి వుంది. అదేంటి అని అడిగే ఓపిక లేక సైగల ద్వారా సెక్యూరిటి గార్డ్‌ని అడిగితే నేను డంబ్ అండ్ డెఫ్ కాంబో అనుకుని అతను కూడా సైగల ద్వారా , హోలీ క్రాస్ సింబల్ చేసి చూపించి చెప్పాడు ఆ రోజు క్రిస్మస్ డే అని !!!
హాలిడే రోజే ఈ హాలిడే రావడంతో దిసెంబర్ 25 అన్న విషయమే మర్చిపోయాను. ఒక్క సెకండ్, ' బ్యాంక్ ' అని ఫ్రెండ్స్ దగ్గర చెప్పుంటే వాళ్ళు చెప్పేవారు క్రిస్మస్ అని. ఇంటికి రాగానే నెను ఎంత వెదికినా దొరకకపోవడంతో చిరాకు పడుతూవుంటే రూంమేట్స్ అడిగారు దేని కోసం వెదుకుతున్నావని, అద్దం కోసం అన్నా !!!

1 comments
  1. పానీపూరి123 May 3, 2009 at 1:04 PM  

    > నెను ఎంత వెదికినా దొరకకపోవడంతో చిరాకు పడుతూవుంటే రూంమేట్స్ అడిగారు దేని కోసం వెదుకుతున్నావని, అద్దం కోసం అన్నా !!!

    :-))