శభాష్ శభాష్ శభాష్ - 4
బి.టెక్‌లో మా HOD చాలా స్ట్రిక్ట్‌గా వుండేవాడు. మిని ప్రాజెక్ట్స్ చెయ్యాలని కొత్త రూల్ పెట్టాడు. ఆ లైట్‌లే ఇలాంటివి చాలా చెప్తారు, మళ్ళీ ఎగ్జామ్స్ బిజీలో పడితే గాలికి వదిలేస్తారు, ఎన్ని చూడలేదు అని మా ల్యాబ్ టీం ఆఫ్ 4 లైట్ తీసుకున్నాం.
కానీ మా HOD ఎన్నడూలేనిది మిని ప్రాజెక్ట్స్ విషయం మాత్రం రెగ్యులర్‌గా మా క్లాస్‌కు గుర్తుచేస్తూ వస్తున్నాడు. ఒక సారి సీరియస్ అయ్యి ఏంటి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు...ఖబర్దార్ అని లైట్ వార్నింగ్ ఇచ్చి, రెండు రోజుల్లో నాకు మీరు చెయ్యబోయే ప్రాజెక్ట్ టైటిల్-సినాప్సిస్ ఇవ్వాలి అని చెప్పి వెళ్లిపోయాడు.
మా ల్యాబ్ టీం వాళ్లు కాస్త ఖంగారుపడితే మై హూ నా అని, లైట్ తీసుకొండ్రా...ఏమి కాదు, అన్నా. కాని మిగతా క్లాస్ అంతా హెవీ్‌గా తీసుకుని దబ దబా సబ్‌మిట్ చేసేసారు. అవ్వన్నీ నాకే ఇచ్చారు యాజ్ ఏ CR. నేనే తీసుకెళ్లి సబ్‌మిట్ చెయ్యాలి. నేనే ప్రెపేర్ చెయ్యలేదు అంటే
శాల్తీ లేచిపోయే ఛ్యాన్స్ వుందని, అప్పటికప్పుడు ఏం ప్రాజెక్ట్ చేద్దామా అని అలోచిస్తుంటే, ఆ రోజు మా కాలేజ్ దగ్గర్లో వున్న టౌన్‌లో ఒక కాకా హోటల్ ఎంట్రన్స్ దగ్గర డెకరేషన్ కోసం డిస్కో లైట్స్ పెట్టారు. "ఈ పేటకు నేనే మేస్త్రీ............" అన్న సాంగ్ తో సింక్ అయ్యేలా వస్తున్నింది. మా టీమ్‌మేట్ నాతో, " రేయ్ రేపు సబ్‌మిట్ చెయ్యాలి, లేకపోతే అయిపోతాం " అంటే, "అవును నేనూ అదే ఆలోచిస్తున్నా ఏం పెడదామా అని......????" అని అనుకుంటుంటే వెంటనే తట్టింది, ఈ డిస్కో లైట్స్ ప్రాజెక్టే పెడదాం అన్నాను. వాడు తెగ నవ్వాడు. కామెడీగా అంటున్నా అనుకున్నాడు. మరుసటి రోజు డిస్కో లైట్స్ ప్రాజెక్టే టైటిల్ చాలా పోష్‌గా పెట్టి సబ్‌మిట్ చేసాను.
తర్వాత HOD బిజీ అయిపోయి అవి అస్సలు చూడనేలేదు. "I know...I know" అనుకుని మా టీమ్‌మేట్స్ దగ్గర గర్వంగా చెప్పుకున్నా. డిస్కో లైట్స్ ప్రాజెక్ట్ ఏంట్రా ??? అని మా బ్యాచ్ వాళ్లు మొదట
షాక్ అయినా, అహే అస్సలు ప్రాజెక్ట్ చేస్తే కదరా...!!! అని చెప్పి కన్విన్స్ చేసా.

అలా జరుగుతుండగా ఒకసారి ఒక రీజన్ వల్ల మా HODకు మా క్లాస్ పైన భలే కోపం వచ్చింది. ఈళ్లకు బుద్ధి చెప్పాలి అని, " అవునూ మిని ప్రజెక్ట్స్ గురించి చెప్పి మూడు నెలలు అయ్యింది. అస్సలు అవి ఎమయ్యాయి ? వన్ వీక్‌లో ప్రెజెంటేషన్ ఇవ్వాలి లేకపోతే అయిపోతారు " అని ఈసారి సివియర్‌గా చెప్పి వెళ్లిపోయాడు. చచ్చాం రోయ్...అని మా టీమ్ వాళ్లు అన్నారు. నేను కూడా మా HOD కోపం చూసి ఖంగారు పడ్డా. మిగత టీమ్ వాళ్లు అందరూ కొద్దో గొప్పో అప్పటికే ఫినిష్ చేసారు. స్మోక్ డిటెక్టర్....ఇలా చాలా ప్రొఫెషనల్‌గా ఉన్నాయి. మాకు అస్సలు అలాంటివి చేసే టైం ఇంక అస్సలు లేదు. ఆల్రెడీ టైటిల్ సబ్‌మిట్ చేసాం కాబట్టి మళ్ళీ మార్చాలన్నా ఇరుక్కునే ఛ్యాన్సెస్ వున్నాయని అదే చేద్దామని టీమ్‌మేట్స్‌కు చెప్పా. వాళ్లు వద్దు, వద్దు అన్నా ఐ విల్ హ్యాండిల్ అని చెప్పి ఏదో ధైర్యం చెప్పా కానీ లోలోపల నాక్కూడా భయం మొదలయ్యింది.

ఒక టీమ్‌మేట్‌కు సోల్డరింగ్ ఐడియా వుండడంతో LEDs (చిన్న లైట్స్)తో, బ్రెడ్ బోర్డ్ పైన లైన్‌గా అవి పెట్టి సోల్డరింగ్ చెయ్యమన్నాను. వాడు చేసాడు. నా ఐడియా అంతా C లాంగ్వేజ్‌లో ఒక ఫంక్షన్ ఉంది. దానికి ఒక వాల్యూ ఇస్తే అదే వాల్యూని ప్రింటర్ పోర్టుకు పంపిస్తుంది. అక్కడ ఈ LEDs బోర్డ్‌ని కనెక్ట్ చేస్తే ఆ వాల్యూ ప్రకారం లైట్స్ వెలుగుతుంటాయి, ఆఫ్ అవుతుంటాయి. అలా ఒక ప్రోగ్రాంలో రక రకాల వాల్యూస్ పంపేట్టు రాసా, అది రన్ చేస్తే లైట్స్ బాగానే డిస్కో లైట్స్‌లా వెలగడం వచ్చింది. ఇదే చూపిద్దాం అన్నాను. మా టీమ్‌మేట్స్ అంతా నా దిక్కు అదోలా చూసారు. నాకూ భయం వేసింది HOD ఎలా రిసీవ్ చేసుకుంటాడో అని. అమ్మో ఇదే చూపిస్తే చాలా రిస్క్ ఉందని, ఇంకేదన్నా చేసి కవర్ చెయ్యాలి, ఏం చెయ్యాలా అని టెన్షన్ పడ్డా.

ఇంకా ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ డాక్యూమెంట్ చెయ్యాలి. ఆ వర్క్‌తో రాత్రి 12 అయ్యింది. మరుసటి రోజు ప్రెజెంటేషన్. మాదే మొదటి బ్యాచ్. HOD ముందు రన్ చేసి చూపించాలి. వామ్మో చాలా మూడింది అనుకున్నా. అప్పుడే పవర్ పోయింది. ఛ అనుకున్నా. మళ్ళీ కాసేపటికి వచ్చింది. సిస్టం రీస్టార్ట్ అవుతోంది....బీప్ సౌండ్ వచ్చింది...అంతే ఒక ఐడియా తట్టింది.

C లాంగ్వేజ్‌లోనే ఇంకో ఫంక్షన్ వుంది. దానికి ఒక వాల్యూ ఇస్తే దాని ప్రకారం బీప్ సౌండ్ స్పీకర్‌తో సౌండ్ వస్తుంది. దానితో, ' జ న గ ణ మ న ' సాంగ్‌ని కంపోజ్ చెయ్యడానికి ట్రై చేసాను. రక రకాల వాల్యూస్ ( ఫ్రీక్వెన్సీస్) పంపిస్తుంటే...' కుయ్ కుయ్...పం పం....పొయ్య్య్య్య్య్య్...'
ఇలా బీప్ సౌండ్సే వస్తున్నాయి. కానీ చాలా అటెన్షన్ పెట్టి వింటే కొంచం ' జ న గ ణ మ న ' లానే అనిపిస్తుంది. అప్పటికే 2-3 AM అయ్యింది. ఆ తరువాత మా కంప్యూటర్స్ బ్రాంచ్ ఫ్రెండ్ గాడిని నిద్ర లేపి Cలో గ్రాఫిక్స్‌లో నేషనల్ ఫ్లాగ్ తయారు చేసే టిప్స్ తీసుకుని నేషనల్ ఫ్లాగ్ చేసేసాం.

సో ఇప్పుడు మా ప్రాజెక్ట్ రన్ చేస్తే కంప్యూటర్ స్క్రీన్ పైన నేషనల్ ఫ్లాగ్ ( గాలికి ఊగుతున్న ఎఫెక్ట్ ) + ' జ న గ ణ మ న ' సాంగ్ ఆడియో ( విత్ కుయ్ కుయ్ బీప్ సౌండ్స్ ) + డిస్కో లైట్స్ ఇన్ సింక్ విత్ ద సాంగ్ వస్తుంది. ఇలా ప్రాజెక్ట్ రెడీ అయ్యింది.

నెక్స్ట్ డే ప్రెజెంటేషన్‌లో మొదటి బ్యాచ్ మాదే. ఎలా రీసీవ్ చేసుకుంటాడో అని, నాకు కాస్త టెన్షన్ గానే వుంది. ప్రాజెక్ట్ రన్ చేస్తే ఏమి వస్తుందో మా టీమ్‌మేట్స్‌కు కూడా తెలీదు. మొత్తానికి తెగ బిల్డప్ ఇచ్చి ఇంట్రో చెప్పాను. రన్ చేసాను. మా క్లాస్‌మేట్స్‌కి మైండ్ బ్లాక్ అయ్యింది. కుయ్ కుయ్ సౌండ్‌లేందో, డిస్కో లైట్స్ ఏందో........అని షాక్ అయ్యారు.
బీప్ సౌండ్ ఆడియో చాలా లో గా వుంటుంది. సో సైలెన్స్ ప్లీజ్ అని అందరినీ కామ్‌గా వుండమని చెప్పాడు, HOD. మళ్ళీ ప్లే చెయ్యి అన్నాడు. ఈ సారి ఆడియో వాల్యూం పెంచు అన్నాడు. సార్ అది సిస్టం ఇన్‌బిల్ట్ స్పీకర్, పెంచడం కుదరదు, మనమే అటెన్షన్ పెంచాలన్నాను. ok ok అని అందరూ అటెన్షన్ మోడ్ లోకి వచ్చారు. HOD నఖశిఖ పర్యంతమూ ఆ సౌండ్స్‌ను ఒంటబట్టించుకుని శబాషో...శబాష్ అని తెగ మెచ్చుకున్నాడు. మా టీమ్‌మేట్స్, క్లాస్‌మేట్స్ ఎక్స్‌ప్రెషన్స్ చూడాలి, అందరూ నా దిక్కు రక రకాలుగా చూసారు.
" దీన్ని ఇలానే బాగా డెవలప్ చెయ్యి, మనం కాలేజ్‌కు డిపార్ట్‌మెంట్ గిఫ్ట్‌గా ఇద్దాము, ఏదన్నా పెద్ద పెద్ద మీటింగ్స్ అప్పుడు యూజ్ చేసుకుంటారు ", అని HOD తెగ ఆనంద పడ్డాడు. ఆ తర్వాత పని ఉండి మిగతావారి ప్రాజెక్ట్స్ చూడకుండానే వెళ్లిపోయాడు. మొత్తానికి చాలా నారో ఎస్కేప్ !!!

1 comments
  1. హరే కృష్ణ May 6, 2009 at 4:32 AM  

    నీ ధైర్యానికి సభాష్..కుమ్మావు..good one