ఛీ నా బతుకు - 6

Posted by అశోక్ వర్మ | 7:20 AM

ఛీ నా బతుకు - 6

2004 లో CAT కోచింగ్ కోసం TIME ఇన్స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాలని హైదరాబాద్ వచ్చాను. సిటి గురించి ఏమీ తెలియదు. TIME ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ కనుక్కుందామని వాళ్లకు ఫోన్ చేసాను. ఎవరో అమ్మాయి, కౌన్సలర్ అనుకుంటా లిఫ్ట్ చేసింది. నాకు సరిగ్గా వినపడకపోవడంతో ( అంటే జనరల్‌గా కాదు అటువైపు చాలా గోల గోలగా వున్నింది అందువల్ల ) తను చెప్పేది అర్థం కాకపోవడంతో మళ్ళీ మళ్ళీ అడగాల్సి వచ్చింది. ఆ అమ్మాయికి విసుగొచ్చి B ఫర్ Bombay, C ఫర్ Chennai............అని ఇలా ఆ అడ్రెస్‌లోని డీటెయిల్స్ చెప్తోంది, నాకు ఏమీ అర్థం కాక, " నో నో ఐ వాంట్ సీట్ ఇన్ హైదరాబాద్....H...H ఫర్ Hyderabad " అని చెప్పాను. అంతే ఆ అమ్మాయి ఫోన్ రిసీవర్ పక్కన పెట్టేసి తన కలీగ్స్ అందరితో, వీడెవడో B ఫర్ Bombay అని అడ్రెస్ రాసుకోవడంలో హెల్ప్ చేస్తోంటే...హైదరాబాద్‌లో సీట్ కావాలి, బాంబేలో కాదు అని అంటున్నాడు, అనగానే ఆ బ్యాచ్ బ్యాచ్ అంతా దొర్లి దొర్లి నవ్వుతున్నారు. నాకు ఆ కాల్ ఫినిష్ అయినా 10 నిమిషాలకుగానీ అస్సలు మ్యాటర్ అర్థం కాలేదు !!!

4 comments
  1. Anonymous May 5, 2009 at 8:16 AM  

    N for Nennukuda,C for chalasepu, N for navvukunnanu ::))....

  2. indira May 5, 2009 at 8:17 AM  

    N for Nennukuda,C for chalasepu, N for navvukunnanu ::))....

  3. రాధిక May 5, 2009 at 9:40 AM  

    :) ha ha..

  4. నేస్తం May 5, 2009 at 8:06 PM  

    నేనూ కూడా ఒకసారి ఇలాగే తికమక పడ్డాను.. నేను కాల్ చేసిన చైనా అమ్మాయి పేరు చెప్పమంటే , ఈమే ఏంటి ఇండియా ,పాకిస్తాన్ అని పేర్లూ చెప్పుతుంది అనుకున్నా ... తరువాత అర్ధం అయింది :)