అవిడియా - ఎపిసోడ్ 3

Posted by అశోక్ వర్మ | 12:21 PM

ఈ అవిడియాకు భలే ఎగ్జైట్ అయ్యాడు శంకర్. తనకు ఎగ్జైట్మెంట్ వచ్చినా, ఏడుపు వచ్చినా ఆపడం కష్టం. సగటు భారతీయ మహిళకన్నా ఎక్కువ emoticons చూపిస్తాడు. తన జీవితంలో ఈ మాత్రం అవిడియా వచ్చి, చాలా రోజులయ్యింది. అర్ధరాత్రి అయినా ఫేస్‌లో కల కలర్‌ఫుల్‌గా కనపడుతోంది. తనలో తానే ఆలోచించుకుంటూ మధ్య మధ్యలో 'వావ్, సూపర్ ' అనుకుంటుంటే సుకుమార్‌కి ఏమీ అర్థంకాలేదు. సినిమా హాంగ్ ఒవర్‌లో వున్నాడనుకున్నాడు. కాని శంకర్ మాత్రం తన పక్కన ఇంకోడున్నాడు అన్న విషయమే మర్చిపోయాడు.

తనకు ముందు నుంచి టీచింగ్ అంటే ఇష్టం. కాలేజ్ రోజుల్లో ఒక క్లాస్ సెమినార్ తర్వాత లెక్చరర్ వచ్చి, 'బహుశా నేను చెప్పినా ఇంత బాగా చెప్పేవాడిని కాదేమో, కీప్ ఇట్ అప్' అన్న ప్రశంస తన లైఫ్‌లో పద్మశ్రీ అవార్డ్‌లా భావిస్తుంటాడు, శంకర్. తనది చదవడంలోనూ, టీచింగ్‌లోనూ భిన్న శైలి. 1500 పేజీలున్న A.K.Sawhney బుక్ ని 1.5 hrs లో చదివేసాడు. చదివెయ్యడం అంటే మొత్తం అవుపోసన పట్టడం కాదు. రేపటి పరీక్షకు నీ దగ్గర ఎంతుంది, నాకెంత అవసరం అన్నది తెలుసుకుని అంత వరకు మాత్రమే ATM నుంచి డబ్బులు డ్రా చేసుకున్నంత వీజీగా తీసేసుకునేవాడు.

ఇది నిజానికి కరెక్ట్ పద్ధతి కాదు. మార్కుల కోసం చదవడం, పరీక్ష అయిపోగానే ఇక పట్టించుకోకపోవడం సరికాదు. కాని మన ఎడ్యుకేషన్ సిస్టం ఇలాగే వుంది. చదువుకునే రోజుల్లో knowledge కన్నా knack ముఖ్యం. ఉద్యోగ వేటలో knAkతో పాటు, నాలుక ముఖ్యం. పరీక్షల్లో ఇంపార్టంట్ చాప్టర్ కాదని తెలిస్తే మహాత్మా గాంధీ పాఠం అయినా మూడో తరగతి పిల్లాడు నిర్దయగా ఇగ్నోర్ చేసే రోజులు మనవి. అందుకే శంకర్ కూడా ప్రాక్టికల్‌గా వుండాలనుకున్నాడు.

ప్రజలకు ఏమి కావాలి, తను ఏమి ఇవ్వగలడు అని ఆలోచిస్తున్నాడు. అస్సలు ప్రజలు ఎందుకు ఒక గురువుని ఆశ్రయిస్తున్నారు ? 20 ఏండ్ల వయసొచ్చాకా ఒక లెక్చరర్ అవసరం లేకుండానే ఎటువంటి సబ్జెక్ట్‌నైనా నేర్చుకునే మెచ్యురిటీ వుంటుంది. కానీ వేల మంది ఇలా కోచింగ్ సెంటర్స్‌కు ఎందుకు వస్తారు ? అన్న ప్రశ్నకు సమాధానం కాసేపటికి తనకే తెలిసింది. అందరికీ ఇన్స్టంట్ కాఫీలా పెద్దగా శ్రమ లేకుండానే ఎంత కావాలో అంతే తెలుసుకోగలగాలి అన్న కుతూహలం ఎక్కువ. ఈ రోజుల్లో అబ్బాయిలందరూ ఇడియట్ సినిమాలో రవి తేజలా ఉండాలనుకుంటరు. రెక్‌లెస్‌గా ఉంటునే కష్టపడకుండానే బాగా మార్కులు రావాలి, మంచి ఉద్యోగం కావాలి, అందులో పని అస్సలు ఉండకూడదు, ఏమి చెయ్యకుండానే వేలకు వేలు కంపెనీ నుంచి దోచేసుకోవాలి....ఇలాంటి సినిమాటిక్ స్వర్గం యొక్క ద్వారాలకు సున్నం కొట్టే వాళ్ళు అమీర్‌పేట్ ఇన్స్టిట్యుట్స్‌లో వుంటారనే వారిని వెంటపడుతున్నారు అని అర్థమయ్యింది.

ఈ విషయంలో క్లారిటీ వచ్చాక శంకర్ మొహంలో ఇంకా వెలుగు వచ్చింది. తను పరీక్షల్లో వాడే ట్రిక్స్, ఇంకా రక రకాలా సిట్యుఏషన్స్‌లో తెలుసుకున్న స్టడీ టెక్నిక్స్ అన్నీ వాడితే వండర్‌ఫుల్‌గా కోర్స్ ప్రిపేర్ చెయ్యొచ్చు అనిపించింది.

మేనేజ్‌మెంట్ సైన్స్ ఎగ్జాం అప్పుడు ఒక గంటలో 3 పేజీల సిక్రెట్ కోడ్ నోట్స్ వ్రాసుకుని, ఎగ్జాంలో 30 పేజీల అడిషనల్స్ నింపేసిన విషయం గుర్తొచ్చి నవ్వుకున్నాడు. ప్రతీ క్లాస్‌లో ఒకరిద్దరిన్నా తప్పక ఫాలో అయ్యే టెక్నిక్:

చ్యాప్టర్‌లో వున్న ఇంపార్టంట్ పాయింట్స్‌ని అత్యంత బ్రీఫ్‌గా వ్రాసుకుని ఆ పాయింట్స్ గుర్తునేలా వాటినుంచి ఒక ఆల్ఫాబెట్‌ను తీసుకుని, మిగతా పాయింట్స్ నుంచి కూడా ఇలా ఒక్కొక్క అక్షరం తీసుకుని 'CHIRANJEEVI' లాంటీ బాగా గుర్తుండే పేరుతో ఒక ఆర్డర్‌లో పెట్టి ఇప్పుడు ఒక్కొక్క అక్షరానికి దానికి సంబందించిన పాయింట్‌ని మననం చేసుకుంటూ మెధడనే బ్రీఫ్ కేస్‌లో పడేస్తే ఎగ్జాం లో జాం జాం అని పెన్ దూసుకెలిపోతుంది.
ఈ టెక్నిక్‌ను యూజ్ చేసే శంకర్ మార్కులు బాగా సంపాదించేవాడు. ఇది కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుంది అని తన నమ్మకం.

నెక్స్ట్ ఎవరో చెప్పగా విన్న ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది శంకర్‌కు:

ఒక సారి ఒక మాస్టారు 'SWOT' అనాలిసిస్ గురించి చెబుతూ

S - Strength

W - Weakness

O - Opportunity

T - Threat
అని చెప్పాల్సిన విషయాన్ని, ఇలా మాములుగా చెబితే క్లాస్ అవ్వగానే సగం మంది మర్చిపోతారని సదరు మాస్టరు గారు దీనికి మసాలా ఆడ్ చేసి దానిని అందరూ గుర్తుంచుకునేలా:
- నీ భార్య నీ Strength
- నీ పక్కింటోడి భార్య నీ Weakness
- నీ పక్కింటోడు ఇంట్లో లేకుంటే నీకు Opportunity
- నువ్వు ఇంట్లో లేకుంటే నీకు Threat

ఇలా చెప్పారంట. అంతే క్లాస్‌లో నవ్వులే నవ్వులు, కెవ్వులే కెవ్వులు. ఇది విన్న వారు బహుశా జీవితంలోనే SWOT అంటే మర్చిపోరేమో.
శంకర్ కూడ మర్చిపోలేదు. మరీ ఇలా కాకపోయినా, సబ్జెక్ట్లోని మ్యాటర్‌ను రియల్ లైఫ్ తో కామేడిగా లింక్ చేస్తే బాగా గుర్తుంటుంది అనిపించింది.

ఇది తలుచుకుంటుండగానే టెంత్ క్లాస్‌లో శంకర్ వెళ్ళిన ట్యూషన్ గుర్తొచ్చింది. వాళ్ళు ఇలాంటి టెక్నిక్స్ చాలా చెప్పేవారు. ముఖ్యంగా ప్రతి మ్యాథ్స్ ప్రోబ్లం పైన 1995,1997,1998 ఇలా యే యే సంవత్సరాల్లో ఆ ప్రోబ్లం పరీక్షల్లో వచ్చిందో చెప్పేవారు. ఎక్కువ సార్లు రిపీట్ అయిన ప్రోబ్లం పైన సహజంగానే చాలా మంది విద్యార్థులు ఇంటరెస్ట్ చూపించేవారు. మాస్టారు, ఇది చాలా ఇంపార్టంట్ ప్రోబ్లం అని చెప్పినా చాలా మంది స్టూడెంట్స్ పట్టించుకోరు కానీ ఇలా చెప్తే ఆటోమాటిక్‌గా ఇంటరెస్ట్ వస్తుంది అని వారు వాడిన విధానం అప్పట్లో శంకర్ వాళ్ళకు ఆక్సిజన్ మరియూ హైడ్రోజన్. అందుకేనేమో మంచినీళ్ళ ప్రాయంగా అందరూ మ్యాథ్స్‌లో కుమ్మేసేవారు. ఇదే టెక్నిక్‌ను సాఫ్ట్‌వేర్ కోర్సెస్‌లో వాడొచ్చు అనిపించింది శంకర్‌కు. రక రకాల కంపెనీల ఇంటర్వ్యూల్లో చాలా ప్రశ్నలు రిపీట్ అవుతుంటాయి. సో కోర్స్ లో ఇలా ఆ కంపెని పేర్లు చెప్పి ప్రోబ్లం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే నిద్రపోయేవాడుకూడా ఆవులింతలు ఆపి అవురావురమంటూ వింటాడు.

శంకర్ ఇంకో విషయం గమనించాడు. మన ఆంధ్రలో స్టూడెంట్స్ అందరూ కాలేజ్‌లో మాటాడేది తెలుగులోనే, చదివేటప్పుడు, ఫ్రెండ్స్‌తో సందేహాలు క్లారిఫై చేసుకునేటప్పుడు చాలా కాజువల్‌గా తెలుగులో మాటాడుకుంటారు. అలా వుంటేనే వాళ్ళకు త్వరగా సులభంగా అర్థమవుతుంది. కాని సెమినార్లప్పుడు మాత్రం డయాస్ ఎక్కగానే ఇంగ్లిష్‌లో చెప్పాల్సి వస్తుంది. అలాగే ఇంగ్లిష్‌లో క్లాస్ చెప్పకుంటే చీప్‌గా వుంటుంది అని లెక్చలర్లు అందరు ఇంగ్లిష్‌లోనే క్లాస్ చెప్తారు. కోచింగ్ సెంటర్స్‌లో కూడా ఇంగ్లిష్‌లో చెప్పకపోతే ఆ భాష కూడా రాదనుకుంటరేమో అని భయపడి అంత కంఫర్టబిలిటి లేకపోయినా అందులోనే చెప్పాడానికి ట్రై చేసి స్టూడేంట్స్‌కి సబ్జెక్ట్‌ని ఇంకా క్లిష్టంగా మారుస్తుంటారు. ఒక రకంగా ఇంగ్లిష్‌లో చెప్పడం వల్ల స్టూడెంట్స్‌కు చాలా ఉపయోగం. ఉద్యోగంలో చేరిన తర్వాత ఈ నాలెడ్జ్‌ని యూజ్ చేసే టైంలో అది హెల్ప్ అవుతుంది. కాని నేర్చుకునే విషయం పైనే ఎఫెక్ట్ పడుతుంది అన్నప్పుడు ఇంగ్లిష్‌లో ఎక్స్‌ప్లెయిన్ చెయ్యాల్సిన అవసరం లేదనిపించింది శంకర్‌కు. రోజులో 90% సాతం తెలుగులో మాట్లాడున్నప్పుడు ఆ భాషకే బుర్ర బాగా బదులిస్తుంది అనిపించింది. ఈ జెనరేషన్ లాంగ్వేజ్ అయిన తెలుగు+ఇంగ్లిష్‌ను కలిపి చెప్తే బావుంటుందనుకున్నాడు. ఫ్రెండ్స్‌తో సరదాగా ఎలా టింగ్లిష్‌లో మాటాడుతాడో అలానే క్లాస్ సెషన్లో చెప్పాలనుకున్నాడు.

ఇలాంటి టెక్నిక్‌లన్నీ వాడితే కోర్స్ బ్రహ్మాండంగా వస్తుందని కాన్‌ఫిడెన్స్ వచ్చింది. శంకర్ రెండేల్ల నుంచి జాబ్ చేస్తూ మధన పడుతున్న విషయాల్లో ఇది కూడా ఒకటి: ఇక్కడ సంపాదిస్తున్న నాలెడ్జ్‌ని కంపెనీకే కాకుండా ఎలా ఉపయోగించుకోవచ్చా అనీ. మొదట్లో అమీర్‌పేట్‌లో ఇన్స్టిట్యూట్స్‌లోనే పార్ట్ టైం లెక్చరర్‌గా జాయిన్ అవుదామనుకున్నాడు. కాని ఒకే క్లాస్‌ని చెప్పిందే చెప్పి తనకు తనే బోర్ గా ఫీల్ అయ్యే చాన్సెస్ వున్నాయని నచ్చలేదు తనకు. పైగా టైమింగ్స్ ప్రోబ్లం కూడా వుండి ఆ అవిడియా డ్రాప్ చేసుకున్నాడు.

ఇప్పుడు అమీర్‌పేట్ పై ఉన్న క్రేజ్ చూసాక, వి.సి.డి/డి.వి.డి అవిడియా వచ్చాక తనలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇలా సి.డి లో కోచింగ్ క్లాస్సెస్ తేవడం వల్ల ఉపయోగాలు ఏంటి అన్న పాయింట్ పైన దృష్టి పెట్టాడు. అంతలోనే తన ఇల్లు రాగానే సుకుమార్‌ని తీసుకుని లోనికి వెళ్లాడు. వెంటనే పేపర్, పెన్ తీసుకుని పాజిటివ్ పాయింట్స్ అన్నీ వ్రాయడం మొదలెట్టాడు.
1. దిల్‌సుఖ్‌నగర్, పఠాన్ చెరువు లాంటి ఏరియాస్ నుంచి కూడ కేవలం ఒక గంట క్లాస్ కోసం 3-4 గంటలు ప్రయాణం చేస్తున్నవారు ఎందరో వున్నారు. రోజుకి గంట సెపే క్లాస్ వుంటుంది కాబట్టి కోర్స్ పూర్తి అవ్వడానికి 1-3 నెలలు పడుతుంది. వాళ్ళందరికి ఇలాంటి సి.డిలు దొరికితే జర్నీ శ్రమ తగ్గుతుంది, త్వరగా నేర్చుకునే వీలుంటుంది.

2. ప్రతి ఇంట్లో ఇప్పుడు విసిడి/డివిడి ప్లేయర్ వుంటోంది. సో ఇంట్లోనే క్లాస్ ఈజీగా అటెండ్ అవ్వొచ్చు.

3. ఒక కోర్స్‌లో జాయిన్ అయిన వాళ్ళు ఒకే సారి ఒక చాప్టర్ వినే సౌలబ్యం వుంది. ఒక వేల క్లాస్ మిస్స్ అయినా, రిపీటెడ్‌గా వినాలన్నా కుదరదు. సి.డి ల వల్ల ఈ ప్రోబ్లం వుండదు. తమకు నచ్చినప్పుడు/నచ్చినన్ని సార్లు చూసుకోవచ్చు.

4. ఈ రోజుల్లో హ్యాండీ కామ్‌తో షూట్ చేసి, ఎడిటింగ్ చేసి వి.సి.డి/డి.వి.డి లో తేవడం చాలా సులభం. ఎవరి మీదా డిపెండ్ అవ్వకుండా ఒకరిద్దరు చేసుకోదగ్గ పని. చాలా తక్కువ ఖర్చుతో మాస్టర్/మెయిన్ కాపి తయారుచెయ్యొచ్చు. తన ఆఫీస్ వర్క్ డిస్టర్బ్ కాకుండా ఫ్రీ టైంలోనే ఇదంతా చెయ్యొచ్చు.

5. ఒక్క సారి కష్టపడి కోర్స్ ప్రెపేర్ చేసి, ఒక బోర్ద్ పైన తన రూంలోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండగా, షూట్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ మళ్ళీ చెప్పే శ్రమ ఉండదు.

6. హైదరబాద్‌కు రాలేని, ఇంకా ఇంజినీరింగ్ చదువుతున్న వారు రాష్ట్రవ్యాప్తంగా వేలల్లో వున్నారు వారందరికి హెల్ప్ అవుతుంది.

7. సినిమా సి.డిలు రిలీజ్ చేసే కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంటే వాల్లే కాపీలు ప్రింట్ చేసి స్టేట్ మొత్తం మర్కెటింగ్ చేసేయ్యగలరు.
ఈ రోజుల్లో ప్రతీ వీధిలో సినిమా వి.సి.డి షాప్‌లు వుంటున్నాయి. అక్కడే ఈ వి.సి.డిలు కుడా పెట్టొచ్చు.

8. శంకర్‌కు తెలిసిన బాగా స్టఫ్ వున్న ఫ్రెండ్స్ చాలా మంది బెంగుళురు, హైదెరాబాద్‌లల్లో వివిధ కంపెనీల్లో రక రకాలా టెక్నాలజీల్లో వర్క్ చేస్తున్నారు. సో తన ఫర్స్ట్ అటెంప్ట్ క్లిక్ ఐతే ఈ ఫ్రెండ్స్ తో తన ఫార్మాట్‌లో చెప్పించి ఇంకా ఎక్కువ కోర్సెస్‌కు వి.సి.డీలు చెయ్యొచ్చు. ఇది కూడా క్లిక్ ఐతే స్కూల్ లెవెల్ నుంచి టీచర్ అవసరం ఉన్న ప్రతీ చోటా వి.సి.డిలు తేవొచ్చు. దీన్నే ఒక పెద్ద బిజినెస్‌గా మార్చొచ్చు.

9. తక్కువ మార్జిన్ ఇన్‌కమ్ ఎక్స్‌పెక్ట్ చేస్తే పైరసీ కూడ వుండదు.

బాబొయ్ చాలా విషయమే వుంది ఈ అవిడియాలో అనుకున్నాడు. చాలా సేపటి నుంచి శంకర్ నే గమనిస్తున్న సుకుమార్‌ని తను ఇప్పుడు చూసి, సారీ చెప్పి ఈ స్టోరీ మొత్తం చెప్పాడు. సుకుమార్ కుడా ఐడియా బావుంది, కాని ప్రాక్టికల్‌గా చాలా ప్రోబ్లంస్ వుండొచ్చు అన్నాడు.

సుకుమార్‌తో డిస్కస్ చేస్తూ నెగటివ్ పాయింట్స్ వ్రాయడం స్టార్ట్ చేసాడు, శంకర్:

1. హ్యాండీ కాంతో వచ్చే క్వాలిటి 5 మినిట్స్ చూడడానికి OK కాని గంటలు గంటలు చూడాలంటే ఎవరికైనా ఇబ్బందే.

2. ఎవరికన్నా కష్టంగా దొరికే వాటిపైనే క్రేజ్ ఎక్కువ. ఏదన్నా ఇన్స్టిట్యుట్‌లో చెప్పే విషయం శూన్యం అని తెలిసినా గంటలు గంటలు ప్రయాణం చేసి గుంపులో తోసుకుంటూ, ఇలా రక రకాల కష్టాలు పడి క్లాస్ వింటే వచ్చే కిక్, ఆరెసుకుని పడుకుని సినిమా చుస్తున్నట్టు చూస్తే రాదు అని చాలా మంది స్టూడెంట్స్ ఫీల్ అవ్వొచ్చు.

ఇంత కంటే ఎక్కువ నెగిటివ్ పాయింట్స్ ఆ టైంకి తట్టకపోవడంతో శంకర్‌కు ఇది వర్క్ అవుట్ అవుతుంది అనిపించింది. హ్యాండీ కాంతోనే తన మొదటి కోర్స్ తీసి, రెస్పాన్స్ బావుంటే నెక్స్ట్ కోర్సెస్‌కు హై డెఫినిషన్ కెమెరా వాడొచ్చు అనుకున్నాడు. రెండో నెగటివ్ పాయింట్ నిజమే అయినా ఇలాంటి వాటి అవసరం నిజాంగా వున్న వాళ్లకన్న ఇది ఉపయోగపడుతుందని, ఎలాగో చాలా తక్కువ బడ్జెట్‌తో చెయ్యొచ్చు కాబట్టి ట్రై చెద్దాం అని శంకర్ డిసైడ్ అయ్యాడు. సుకుమార్ మాత్రం బాగా ఆలోచించి ఇందులో దిగమని సలహా ఇచ్చి బెంగుళురు వెళ్లిపోయాడు.

తనంత కాంఫిడెంట్‌గా సుకుమార్ కనిపించకపోవడంతో ఇందులో ఇంకేమైనా ప్రోబ్లెంస్ వస్తాయా అని ఆలోచిస్తుంటే శంకర్‌కు ఒక పాయింట్ తట్టింది. "మరి ఇంత వరకు ఎవరు ఇలా వి.సి.డి/డి.వీ.డీల్లో కోర్సెస్ తేలేదా ? ఒక వేల తెస్తే ఎందుకు క్లిక్ అవ్వలేదు ? అన్న ప్రశ్నలు వచ్చాయి. కొందరు కలీగ్స్ తో కనుక్కుంటే, సికెందరాబాద్‌లో ఇలానే ఎవరో చేస్తున్నారని ఓ మాదిరి రెస్పాన్స్ వుందని తెలిసింది. ఒక రోజు అనుకోకుండా అమీర్‌పేట్ ఎదురుగా విశాలాంద్రా బుక్ హౌజ్ వాళ్ళు బుక్ స్టాల్ల్ పెడితే శంకర్ కాజువల్‌గా అందులో బుక్స్ చూడడం స్టార్ట్ చేసాడు, అప్పుడు అక్కడ ఒక కంపెని వి.సి.డి లు చూసాడు, LKG rhymes నుంచి రకరకాలా సబ్జెక్ట్స్ పైన వి.సీ.డీలు రీలీజ్ చేసారు ఆ కంపెని వాళ్ళు. వాటి సేల్స్ గురించి వాకబు చేస్తే చాలా డల్‌గా వున్నాయని తెలిసింది. ఈ సంఘటనలతో కాస్త నిరుత్సాహంలో, బాగా కన్‌ఫ్యూజన్‌లో పడ్డాడు శంకర్.

వాళ్ళ అటెంప్ట్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయా అని ఇంకొంచం రీసేర్చ్ చేసాడు,

1. కోర్స్‌లో యే స్పెషాలిటీ లేదు.

2. ధర చాలా ఎక్కువ.

ఈ రెండు ప్రధాన కారణాలు అని అర్థమయ్యాయి. తన ప్లాన్ పరంగా వెళితే ఈ సమస్యలను ఈజీగా క్రాస్ చెయ్యొచ్చు అనిపించింది. పైగా పెద్ద కాంపీటిటర్స్ లేకపోవడం కలిసొచ్చే అంశంలా తోచింది. ఎలాగైనా ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాడు.

ఇక మొదలెత్తడమే తరువాయి అనుకుని, కోర్స్ మెటీరియల్ ప్రిపేర్ చేసుకునే పనిలో పడ్డాడు శంకర్. కాని అప్పుడే పిడుగులా రిసెషన్/ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చింది. చూస్తుండగానే వేడి వేడి జిలేబీలాగా ఉండే అమీర్‌పేట్ కాస్తా జింబాబ్వేలా తయారయ్యింది. తను కల కన్నది ఇంకో యాంగిల్లో నిజమయ్యి యెవరికీ ఉపయోగం కలగకుండా మైత్రివనం వీధి కల తప్పింది. ఇన్స్టిట్యూట్స్ మరియూ చుట్టూ వుండే హాస్టల్స్ చాలా అవిరయిపోయాయి. కోర్స్ల కోసం సిటీకి వచ్చిన వేల మంది తిరుగుముఖం పట్టారు.

సరిగ్గా తను స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పుడే ఇలా జరగడం శంకర్‌కు పెద్ద షాక్. టవున్‌లల్లో వుండే స్టూడెంట్స్‌కైనా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రొసీడ్ అవ్వాలని అనుకున్నా, అందరికీ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ పై నిరాసక్తత పెరుగుతుండడంతో రాంగ్ టైమింగ్ అవుతుంది అని ఆగిపోయాడు. ఈ అవిడియాను విత్ హోల్డ్‌లో పెట్టి ఇంకేదన్నా చేద్దాం అని మళ్ళీ కొత్త ఐడియాల వేటలో పడ్డాడు....శంకర్

(ఇంకా వుంది)

0 comments