ఛీ నా బతుకు - 5

Posted by అశోక్ వర్మ | 6:37 AM

ఛీ నా బతుకు - 5
మా ఫ్రెండ్‌గాడి కంపెనిలో వాళ్ల మేనేజర్ చాలా స్ట్రిక్ట్. ఇంటర్నెట్ యాక్సెస్...లాంటి విషయాల్లో చాలా రెస్ట్రిక్షన్స్ వున్నాయంట. రోజూ మునిసిపాలిటి వారు నీళ్ళు వదిలినట్టు ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట మాత్రమే నెట్ వచ్చేలా చేసారు. ఆ మేనేజర్ తన టీం మెంబర్స్ స్క్రీన్స్ అన్నీ తనకు కనిపించేలా తన సీట్ ఏర్పాటు చేసుకుని, ఎప్పుడూ మానిటర్స్‌ను మానిటర్ చేస్తుంటాడంట.

వీడేమో ఫైవ్ ఇంద్రియాలు లేకున్నా బ్రతికేస్తాడు కానీ ఫైవ్ మినిట్స్ ఇంటర్నెట్ లేకుంటే వుండలేడు. ఇలా కొద్ది రోజులు కష్టాలు పడ్డాక మనవాడికి ఒక మంచి ఐడియా వచ్చింది. వాళ్ల మేనేజర్ సీట్‌లో లేని, నీళ్ళు వదిలే అతి తక్కువ టైంలోనే idlebrain, greatandhra లాంటి సైట్స్ లోని మ్యాటర్ అంతా తన నోట్‌పాడ్‌లో copy, paste చేసుకుంటాడు. తర్వాత అందులోంచి పార్ట్లు పార్ట్లుగా కోడింగ్ వర్క్‌స్పేస్‌లో paste చేసుకుని కామెంట్లలాగా చేసుకుంటాడు.

దూరం నుంచి మేనేజర్ చూసినా కోడ్ రివ్యూ చేసుకుంటున్నాడేమో అనుకుంటాడు, అన్నది వీడి ప్లాన్। ఇది బాగా వర్కవుట్ అయ్యింది। ఈ విషయం టీం మెంబర్స్ అందరికీ తెలిసి, వాళ్లు కూడా ఇదే లాజిక్ ఫాలో అవ్వడం మొదలెట్టారు.

ఇలా ఉండాగా ఈ మధ్యనే ఒక రోజు, ఒకతని కోడ్‌ని ఆ మేనేజర్ రివ్యూ చేస్తుంటే..మధ్యలో కోడ్ కామేంట్స్‌లో....

Ravi Teja and Illeana starring Kick is going to release in May


అన్న మ్యాటర్ చూసి మొదట ఆ మేనేజర్, తర్వాత తనని చూసి ఆ టీం మెంబర్, ఈ మ్యాటర్ తెలిసి మిగతా అందరూ అవాక్కయారు !!!


సదరు క్యాండిడేట్ మ్యాటర్ చదువుకున్నాక డిలిట్ చెయ్యడం మర్చిపోవడం వల్ల ఇలా దొరికిపోయారు। అప్పటినుంచి ఆ మేనేజర్ చూపిస్తున్న డాట్ నెట్‌కు (చుక్కల వల) రోజూ ' ఛీ నా బ ' అనుకుంటూనే ఉన్నాడంట !!!

9 comments
  1. సుజ్జి May 3, 2009 at 8:37 AM  

    :)))

  2. రాధిక May 3, 2009 at 8:39 AM  

    :)

  3. మధురవాణి May 3, 2009 at 9:10 AM  

    హ్హ హ్హ హ్హా :)

  4. పరిమళం May 3, 2009 at 9:30 AM  

    ha..hha..hhaa...

  5. నాగప్రసాద్ May 3, 2009 at 9:53 AM  

    డాట్ నెట్‌ = చుక్కల వల = చుక్కల వల్ల. :):)

  6. పానీపూరి123 May 3, 2009 at 1:00 PM  

    మేము అలా దొరకకుండా ఉండటం కోసం....
    ఒక డమ్మీ File Create చేసుకుని చూసుకునే వాళ్ళం... :-)

  7. రవి May 4, 2009 at 4:13 AM  

    :-)

  8. నేస్తం May 4, 2009 at 9:52 PM  

    ha ha .. :)

  9. హరే కృష్ణ May 6, 2009 at 4:21 AM  

    మున్సిపాలిటీ ప్రొద్దున్న సాయంత్రం ..భలేగా పోల్చావు.. ఒక మంచి ఐడియా కూడా ఇచ్హావ్.(note పాడ్)..పోస్ట్ బావుంది.. ఇంకా రాస్తుండు ..టైమింగ్ Excellent నీది!