శభాష్ శభాష్ శభాష్ - 3
ఎవరన్నా టవల్‌తో ముఖం తుడుచుకుంటారు. సో న్యాచురలీ కళ్ళు కూడా తుడుచుకున్నట్టే. కాని ఒక రోజు పరధ్యానంలో టవల్‌తో కన్నును లైట్‌గా హర్ట్ చేసుకున్నా. ఈ విచిత్రాన్ని ఇంకెవరితోనూ షేర్ చేసుకునే ధైర్యం లేక ఛీ నా బతుకు అని నాలో నేనే అనుకుంటూ రికవర్ అవుతుందేమో అని అని వెయిట్ చేసాను. అయినా కాకపోవడంతో ఇంటి దగ్గరున్న ఒక కంటి స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్లాను. అతన్ని కలవడం అదే మొదటి సారి.
అతను అడిగిన మొదటి ప్రశ్న: " ఏం చేస్తుంటావ్ ? ". కొంచం షాక్ అయ్యా. ఎవరన్నా ఏమి ప్రాబ్లం, ఏం పేరు...etc అడుగుతారు కానీ ఇదేం ప్రశ్నరా బాబు అనుకున్నా. సాఫ్ట్‌వేర్ వాడిని అని చెప్తే కన్నుకు, నా లైఫ్‌కి వున్న బావ-బామ్మర్ది రిలేషన్ తెలుస్తుందని, డాక్టర్ దగ్గర యే విషయం దాచకూడదని: " సాఫ్ట్‌వేర్ " అన్నాను.
నా కంట్లో ఆయన టార్చ్ లైట్ వెలుగు, తన ఫేస్‌లో వేరే వెలుగు వచ్చింది. ఎలా జరిగింది అన్నాడు. ' టవల్‌తో....టర్కీ టవల్‌తో... ' అని చెప్పగానే షాక్ అయ్యాడు. ఏం పర్లేదు చాలా చిన్న ప్రాబ్లం eye drops వాడితే రెండు రోజుల్లో రికవర్ అవుతుంది అని చెప్పడంతో ఊపిరి పీల్చుకునేంతలో ఫీ కింద 200 ఇవ్వమనడంతో కాస్త బ్రీథింగ్ ప్రాబ్లం వచ్చింది. అది గమనించి అతను: " అదేంటయ్యా అలా చూస్తావ్ ? మీ సాఫ్ట్‌వేర్ వాళ్లకేం తక్కువ ? మెడికల్ బిల్స్ సబ్‌మిట్ చేసుకోవచ్చుగా ? కావాలంటే ఎలాంటి బిల్ అయినా ఇస్తా " అన్నాడు.
అమ్మో ఇతనెవరో MBBS.Tech చదివినట్టున్నాడు అనుకుని, ' సార్ మీరు పొరపాటుబడ్డారు. నేను ' సాఫ్ట్‌వేర్.. ' అన్నాను కాని ' సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ' అనలేదు సార్. ' సాఫ్ట్‌వేర్ కోర్స్ ' చేస్తున్నా " అని చెప్పడంతో ఆయన ఫేస్‌లో వెలుగు పోయింది, నా ఫేస్ వెలిగిపోయింది. ఫీ చాలా తగ్గింది !!!

Post a Comment