శభాష్ శభాష్ శభాష్ - 7
నాకు బల్లి అంటే చాలా అలర్జి. అఫ్‌కోర్స్ ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుందిలేండి !!! మా ఓనర్ వాళ్ల ఆస్థాన బల్లి ఒకటుంది. నాకు అదంటే అస్సలు పడదు. నిజానికి ఆ ప్రాణి పేరంటేనే పడదు. అందువల్ల ఎప్పుడైనా దానిని రెఫర్ చెయ్యాల్సి వస్తే కష్టంగా ఉంటుందని దానికో నాన్-నిక్ నేం ( ముద్దు పేరుకు ఆపోజిట్ ) పెట్టుకున్నా - ' బ్రెట్ లీ ' అని. క్రికెటర్ బ్రెట్ లీ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇలా పిలుచుకుంటే కాస్తన్నా అలర్జీకి శాంతి చేసినట్టుంటుంది అని అలవాటు చేసుకున్నా.

ఇక విషయానికి వస్తే మా ఇంట్లో హాల్ లాంటి రూంలో నెక్స్ట్ రూం ఎంట్రన్స్ పైన ట్యూబ్ లైట్ ఉంటుంది. దానికి లెఫ్ట్ సైడ్ నా కంప్యూటర్ ఉంటుంది. ఎదురుగా పైన వెంటిలేటర్స్ ఉన్నాయి. ఒక రోజు ఈవినింగ్ కాస్తా రాత్రవుతున్న సమయంలో, నేను యమ హుషారుగా ఉన్నప్పుడు బ్రెట్ లీ గాడు ఎంటర్ అయ్యాడు. ఆడు ట్యూబ్ లైట్ దగ్గరకు వెళ్లేలోపలే, నేను నా సిస్టం దగ్గరనుంచి ' హుష్ హుష్....ఉఫ్ ఉఫ్ఫ్ ..........జూం పచక్..' ఇలా రక రకాల సౌండ్స్, గట్టిగా చప్పట్లు కొట్టి వాడిని తరిమేసాను. 1 మినిట్ తర్వాత వాడు మళ్ళీ వచ్చాడు. ఈ సారి ఇంకా విచిత్రమైన సౌండ్స్ చేసి బెదరగొట్టి పంపించేసాను. ఈ సారి 10 మినిట్స్ తర్వాత 100 మీటర్స్ స్ప్రింట్ రేస్‌లా ' ఒక్క సారి వచ్చిపోమ్మా మెరుపు తీగా ' సీన్ లోలా నేను సౌండ్ చేసే లోపలే చటుక్కున వచ్చి లటుక్కున లైట్ దగ్గరకు చేరుకున్నాడు.

ఛ అనుకున్నా. అడుంటే నాకు ఏ పని జరగదు. నేను ఏది ఆలోచించాలన్నా అటూ ఇటూ తిరుగుతూ నడుస్తూ అలోచిస్తేనే మైండ్ వర్క్ అవుతుంది. అలా ఒక విషయం గురించి ఆలోచించాల్సిన పని ఉన్నింది. దానికోసం ఆ ట్యూబ్ లైట్ కింద నుంచి నెక్స్ట్ రూంకీ ఈ రూంకి వాక్ చేస్తూ ఆలోచించాలి. ఇప్పుడు బ్రెట్ లీ గాడు ఎక్కడ మీద పడతాడో అన్న భయం పట్టుకుంది. వాడిని ఎలాగైనా తరిమెయ్యాలని నా ఆరాటం కమ్ పోరాటం.

రక రకాల ప్రయత్నాలు చేసాను. ట్యూబ్ లైట్‌కి సమాంతరంగా చీపురు కట్ట పుచ్చుకుని....' ఆ జజ్జినక జజ్జినక జనారే.....' అని ఎంత ట్రై చేసినా, ఫుల్ బాటిల్ మూత నిండా మందు కొట్టిన వాడిలా బ్రెట్ లీ గాడు అస్సలు పట్టించుకోలేదు.

ఇక నా సోలో వాయిస్ ఏమి చెయ్యలేదు అని, దీన్ని భయపెట్టడం ఎలాగా అని ఆలోచిస్తూ నా సిస్టం దిక్కు చూసా, అప్పుడు ఐడియా తట్టి బీభత్సమైన సినిమా సాంగ్స్ ప్లే చేస్తే పారిపోతుందని, ' హే మండపేట మలక్‌పేట నాయుడుపేట పెటరాప్...' సాంగ్ ప్లే చేసా. అయినా వాడు నో రెస్పాన్స్. పక్షవాతం ఏమన్న వచ్చిందేమో అని డవుట్ వచ్చి, వాల్యూం పెంచా, కొంచం కదలిక వచ్చింది. దాంతో సౌండ్ ఫుల్‌గా పెంచేసా. బయటకు ఏమన్నా వినిపిస్తోందేమోనని బయటకు వచ్చి సౌండ్ వింటే టూ మచ్ గా వస్తోంది. మా ఇంటి చుట్టు పక్కన వాళ్లంతా ఒల్లంతా పెటరాప్ తుల్లింతలతో తట్టుకోలేకపోతుండడం చూసి వామ్మో అని సౌండ్ తగ్గించా. నెక్స్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రజలను పరుగులు పెట్టించడంలో పేరు గాంచిన మహా మహా సెగ--బ్రిటీస్ పాటలన్నీ ట్రై చేసా, అయినా బ్రెట్ లీ గాడు పోలేదు.

ఒరెయ్ బ్రెట్ లీ గా ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు ? ఈ రేంజ్ లో సావ గొడుతున్నావ్ !!! నువ్వు కడుపుకి పురుగులు తింటున్నావా ? లేక అవి తినే గడ్డి తింటున్నావా ? నీ కన్నా నీ తమ్ముడు బ్రూస్ లీ గాడు ఎంతో మేలు. చంగ్ చంగ్ మని ఎగురుకుంటూ వచ్చినా ఎక్కువ సేపు ఉండకుండా వెళ్లిపోతాడు. అస్సలు నువ్వు బల్లివా పశువ్వా ? నన్ను బలి పశువు చేస్తున్నావ్ కదరా !!!! అని రకరకాలుగా తిట్టుకున్నా.

అప్పుడే పవర్ పోయింది. ' ఎస్ ఎస్...' అని గంగూలీ వికెట్ తీస్తే ఇచ్చే ఎక్స్‌ప్రెషన్‌తో ఆనంద పడ్డా. ఇప్పుడు బ్రెట్ లీ గాడు కొంచం కదిలాడు. ఆడు ఎళ్లిపోతున్నాడోచ్ అని ఆనందపడేంతలో పవర్ వచ్చింది. మళ్ళీ వాడు లటుక్కున లైట్ కిందకు పరిగెత్తాడు. ఓ నో....అనుకున్నా, కాని వెంటనే ఐడియా తట్టింది. నేనే లైట్ ఆఫ్ చేసా. అయినా వాడు మహా ముదురులా ఉన్నాడు, ఇంచ్ కూడా కదలలేదు. ఇలా కాదు అని బయటకు వెళ్లి బయట లైట్స్ మూడు వేసా. పక్కింటి పోర్షన్ వాడు, నిద్రపోతున్నట్టు ఉన్నాడు. వాడిని నిద్రలేపి మీ ట్యూబ్ లైట్ వెలుగుతోందా ? పవర్ పోయి వచ్చింది. 2 - ఫేజ్ వచ్చిందనుకుంటా. మీది ఒక సారి వేసి చూస్తారా అని అడిగా. వాడు వేసాడు. బానే ఉందే అన్నాడు. వెయిట్ బాసు వెయిట్, నాది కూడా ఇలాగే వెలిగింది, కొంచం సేపు అలానే ఉంచు ప్రాబ్లం రాకపోతే నా లైట్ స్టార్టర్‌లో ప్రాబ్లం ఉనట్టు, మార్చుకుంటా అని చెప్పి కన్విన్స్ చేసా.

ఇప్పుడు మా ఇంట్లో చీమ కూడా ఎంటర్ కాలేనంత చిమ్మ చీకటి. బయట మాత్రం వెలుగే వెలుగు. పక్క పోర్షన్‌లో లడ్డూలా లైట్ ఊరిస్తోంది. ఇదంతా సైలెంట్‌గా అబ్జర్వ్ చేస్తున్న లీ గాడు, ఛీ నీ ఎంకమ్మ ఎంత కక్కుర్తి గాడివిరా !!! అన్న ఎక్స్‌ప్రెషన్‌తో చివరికి విస విసా వెళ్లిపోయాడు !!!

8 comments
  1. Unknown May 18, 2009 at 8:20 AM  

    Yemi talent basu ... :) Itanki telugu padalni bhale gammattu ga manage chestaru meeru ... monnane mee blog link dorikindi ...aa roje mee "chee naa batuku" ... "Shabhash (3)" ... anni oka roju lo ne chadiva ... :) Super ...

  2. Rani May 18, 2009 at 8:30 AM  

    wow! ilaanti super smart ideas meeku ela vastaayi?

  3. పానీపూరి123 May 18, 2009 at 12:32 PM  

    మరి. మళ్ళీ బ్రెట్ లీ రాలేదా?

  4. శరత్ కాలమ్ May 18, 2009 at 12:42 PM  

    మీ బల్లి శాస్త్రం బావుందే :)

  5. హరే కృష్ణ May 18, 2009 at 10:07 PM  

    పంచ్ కొంచెం పెంచు ..lengthy గా అనిపించింది ..బావుంది పోస్ట్

  6. విశ్వక్శేనుడు May 19, 2009 at 1:59 PM  

    బాసు ఎమీ అనుకొననటె నాదొక యెదవ సలహా. లైట్ దగ్గర నెమలిఈక గాని కోడిగుడ్డు పొక్కులు గాని పెడితే బల్లులు రావు అని ఎవరో చెబితె విన్న. మా ఊళ్ళో వున్నప్పుడు పక్కింటి వాల్లు చేస్తే చూసా. ఒకసారి ట్రైల్ వెయ్యండి.

  7. సుజ్జి May 20, 2009 at 6:16 AM  

    well writen..:)

  8. కథాసాగర్ June 10, 2009 at 9:30 PM  

    బల్లి కి నిక్ నేమా ---అది కూడా బ్రెట్లీ పేరు.. కేక ..