15-జనవరి-2009
లప్పంగిరిగిరి - 3
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!
* దెబ్బ తగిలిన చోటే ఎవడో ఒకడు కాలెడతాడు. సరిగ్గా అదే విధంగా ఏనాడూ లేనిది చాలా త్వరగా లేచాను. కాని పండగ రోజు సెలవు కాబట్టి ఈ రోజు పేపర్ రాలేదు. తాగుబోతుకి సాయంత్రం అవ్వగానే చుక్క దొరక్క పోతే ఎంత చిరాకు పడతాడో ఒక్క కొత్త పేపర్ ముక్క దొరక్క వర్చువల్ నరకం చూసాను.

* ఈ చిరాక్స్ తోనే మన రెగ్యులర్ టిఫిన్ సెంటర్‌కి వెళ్లగానే పార్సిల్ కౌంటర్ అతను నన్ను చూడగానే ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాడు. నా రోటీన్ టిఫిన్ 'సింగిల్ ఇడ్లి, సింగిల్ వడ ' కాబట్టి. టైపింగ్‌లో స్పేస్ బార్‌తో వచ్చే స్పేస్‌లో కూడా వెరైటి వుంటే బాగుంటుందనుకునే వెరైటిక్కమాలోకం అయిన నేను ఇలా ఒకే టిఫిన్‌కు ఫిక్స్ అయ్యిపోవడమేంటా అని అందరికీ డవుటు.

దీన్ని యీక్‌పాయింట్‌గా పట్టుకుని ఆడుకోవాలనుకునే ఫ్రెండ్స్ ఒక సారి ఉండబట్టలేక 'ఏంట్రా ఎప్పుడూ ఒకే టిఫిన్ తింటావా ? అందులో ఏమన్నా విటమిన్ ASDFGH.... లు వున్నాయా ? అని అడిగితే...

'నాకు ఇడ్లిని చూస్తే ఇలియానా, చట్నీని చూస్తే ఛార్మి, గుర్తొస్తారురా' అని చెప్పా.

'ఆహా మరి వడను చూస్తే వాణి విశ్వనాథ్ గుర్తొస్తుందా ?' అని ఒకడు, 'వడి వుక్కరసి....???' అని ఇంకోడు....ఇలా గెస్ చేస్తుంటే....'కాదు, వ్లాదిమిరో పుతినో పులిహారో పూం పుహారవకొవ్, ద గ్రేట్ రష్యన్ సూపర్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని సెప్పీ సుక్కలు చూపించి ఎస్కేపా.

నిజానికి ఈ టిఫిన్ అలవాటు చేసుకోడానికి ముఖ్య కారణం అత్యంత వేగంగా పార్సిల్ లభించే టిఫిన్ ఇదే. దోస, పూరి లాంటి దీర్గకాలిక, ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లకన్నా ఇదే మేలు అని అలా ఫిక్సయిపోయా.

ఇడ్లి ఒక్కటే తీసుకుంటే పేషంట్ టిఫిన్ అవుతుంది. వడ ఒక్కటే తీసుకుంటే వాలంటరీ రిటైర్మెంట్ వస్తుంది. అందుకే ఇడ్లి, వడకి పెళ్లి చేసి కాపురానికి కడుపులోకి పంపుతుంటా.

మా వాలకం చూసి టిలీగ్ (కలిసి పని చేసేవారిని కలీగ్ అంటే, కలిసి టిఫిన్ తీసుకెళ్లే వారిని టిలీగ్ అనే కదా అనాలి ?) షాక్ అవుతుంటే ఆడికి సెప్పే ఓపిక లేక పార్సిల్ తీసుకుని వచ్చేసా.

* నగరం నడి ' బొడ్డు ' లో కె. రాఘవేంద్ర రావు 'B.A' గారి సినిమాక్స్ మల్టిప్లెక్స్ స్టార్ట్ అయ్యిందని తెలిసి ఎగ్జైట్ అయ్యా. ఎందుకంటే అంతకు వారం క్రితమే నేను అక్కడికి వెళ్లాల్సి వచ్చింది కాబట్టి. చిన్నప్పటి నుండి వున్న బలమైన కోరికలలో గురువుగారి వాయిస్ వినాలన్నది ఒకటి. ఎందుకంటే ఆయన బయట ఎక్కడా ఏ ఫంక్షన్స్‌లోనూ మాట్లాడరు కాబట్టి.

ఒకసారి ETVలో తన ప్రోగ్రాం వస్తోందని తెలిసి చూడడానికి ఎంతో ట్రై చేసాకాని మిస్ అయ్యా. అలాంటిది వున్నపలంగా సినిమాక్స్‌కు వెళ్లాల్సి రావడం, గురువు గారిని చూడడంతో ప ని ని స స రింగ్ టోన్ రియల్ లైఫ్‌లో ప్లే అయ్యింది. పలకరిద్దామని అనుకుంటూ, నమస్తే సార్, నేను బి.అశోక్ వర్మ 'B.Tech' అనబోయాను కాని నమస్తేకే మాటలు ఆగిపోయాయి. ఒక గొప్ప రుషిని చూస్తున్న ఫీలింగ్‌తో అలా వుండిపోయాను. మొత్తానికి ఆయన వాయిస్ వినగలిగాను. కన్‌స్ట్రక్షన్ పనిలో ఆయన బిజీ గా వుండడంతో పెద్దగా ఇంటరాక్షన్ కుదరలేదు. అయినా చాలా హేపిస్.

త్రివిక్రమ్ గురూజీని కలిసిన తర్వాత అంతగా ఎగ్జైట్ అయిన క్షణం ఇదే. పనిలో పనిగా థియేటర్స్ అంతా షుగర్ (చక్కెర) కొట్టా. చాలా బావున్నాయి అనిపించింది. ఆరేసుకుని పడుకోడానికి వీలున్న ఒకే ఒక మల్టిప్లెక్స్ ఇది. ఇది వారం క్రితం సంగతి. నిన్న మల్టిప్లెక్స్ ఓపెన్ అయ్యిందని తెలిసి, ఈ రోజు సినిమా చూద్దామని టికెట్స్ బుక్ చేద్దామని ట్రై చేస్తే విచిత్రమైన ప్రాబ్లెం వచ్చింది.

cinemax.co.inలో టికట్స్ బుక్ చెయ్యాలంటే మినిమం 2 చెయ్యాలి. ఇదెక్కడి అన్-న్యాయం, అన్-ధర్మం, అన్-చట్టం, అన్-అన్నీ... నేనొప్పుకోను అని రకరకాలుగా అనుకున్నా. నేను ఎప్పుడు ఎల్లినా ఏకాకి గానే ఎల్తా. పోనిలే దోకాకి అవదామంటే, ఏ....కాకీ దొరకడంలేదు :(((

* సచిన్ టెండుల్కర్ ఫిలిం నగర్ దేవాలయంకు వచ్చాడని తెలిసి మరో సారి ఎగ్జైట్ అయ్యా. నేను ఆ దేవస్థానంను చాలా సార్లు దర్శించాను కాబట్టి. ఎప్పుడో చదువుకున్న transitive property గుర్తొచ్చింది. నేను గుడిని చూసాను. సచిన్ కూడా గుడిని చూసాడు. సొ నేను సచిన్‌ని చూసాను !!!

అని అల్పానందం పొందాను. ఎప్పుడో చదువుకున్న మ్యాథ్స్ తప్పులుంటే క్షమించండి అస్సలు అర్థమే లేదనుకుంటే మిమ్మల్ని నేను క్షమిస్తాను.

* శశిరేఖ పరిణయం సినిమా పాటలు కాజువల్‌గా పెట్టుకుని వింటుంటే, 'ఓ బుజ్జమ్మా' మరియు ' ఏదో....కొత్తగా వుంది ఈ వేళ ' పాటలు బాగా నచ్చాయి. మొదటిది సింగర్ రంజిత్ వల్ల బాగా వచ్చింది.

రెండో పాట బాధలో వున్న వారు వింటే:

జెంట్ ఐతే బ్రాందిలాగా...
లేడి ఐతే బఫెట్ లాగా అనిపిస్తుంది.


ఈ సినిమా గురించి ఫస్ట్ టైం విన్నప్పుడు, శశి అనే అబ్బాయి, రేఖ అనే అమ్మాయి పెళ్లికి సంబందించిన స్టోరి అనుకున్నా. నాకు సినిమా మాత్రం అంతగా నచ్చలేదు. మా జెనీ డార్లింగ్ ఏది చేసినా నచ్చుతుంది కాని ఈ సినిమాలో తను సరిగ్గా అతకలేదు. చందమామ సినిమా కూడా మొదట్లో నచ్చలేదు, చూడగా చూడగా బాగా నచ్చింది. అందులో 'నవ్‌దీప్-ఆహుతి ప్రసాద్ తాగి గొడవ పడే సీన్ ' ఈ మధ్య కాలంలో నాకు హాట్ ఫేవరెట్.

ఇలా వంశీ కృష్ణ (ఆయన వెరైటి కోసం కృష్ణ వంశీ అని పెట్టుకున్నారు. నేనూ వెరైటి కోసం ఇలానే పిలవాలనుకుంటున్నా) 'సినిమా చూడగా చూడగా బాగుండును ' లాజిక్ కూడా దీనికి వర్క్ అవుట్ కాకపోవచ్చు. జెనీ ప్లెయిన్ సారీస్‌లో చాలా క్యూట్‌గా వుంది.
సో ఈ రోజు ఫస్ట్ టైం కాటన్ సారీస్‌తో కల్లోకి ఎంటర్ అవ్వబోతోందన్నమాట :)

10 comments
  1. Anonymous January 16, 2009 at 1:40 PM  

    దెబ్బ తగిలిన చోటే ఎవడో ఒకడు కాలెడతాడు.
    నమస్తే సార్, నేను బి.అశోక్ వర్మ 'B.Tech' అనబోయాను కాని నమస్తేకే మాటలు ఆగిపోయాయి.

    Good ones. More plss

  2. teresa January 16, 2009 at 5:15 PM  

    :))

  3. సిరిసిరిమువ్వ January 16, 2009 at 7:04 PM  

    :) మీ పద ప్రయోగాలు బాగున్నాయి.

  4. వేణూశ్రీకాంత్ January 16, 2009 at 9:53 PM  

    నిజం చెప్పండి ఫోటోలో కనిపిస్తున్న రాముడు మంచి బాలుడు మీరేనా !!!
    కెవ్వు కేక.. బాగా నవ్విస్తున్నారు..

  5. నేస్తం January 16, 2009 at 11:07 PM  

    మీ టపాలు కూడా నాకు చుడగా చుడగా నచేస్తున్నాయి
    ;p హ...హ చాలా బాగా రాసారు నాది శ్రీకాంత్ గారి ప్రశ్న యే :)

  6. Shiva Bandaru January 17, 2009 at 12:35 AM  

    మీ పోస్టులన్నీ కేక

  7. krishna rao jallipalli January 17, 2009 at 9:36 AM  

    నగరం నడి ' బొడ్డు ' లో కె. రాఘవేంద్ర రావు 'B.A' ... చమక్కులు అదిరాయి. వీలు చూసుకొని మిగతా పోస్టులు చదవాలి. వేరి వేరి గుడ్.

  8. మధురవాణి January 17, 2009 at 2:50 PM  

    మళ్ళీ మళ్ళీ బావుందని చెప్పాల్సి వస్తుంది మీ బ్లాగ్ లో :))))))
    అద్దరగొట్టేసారు :)))))

  9. సుజాత వేల్పూరి January 17, 2009 at 7:41 PM  

    వేణూ శ్రీకాంత్ లాగే ఆశ్చర్యపోతున్నాను అశోక్ నేను కూడా! నిజం చెప్పండి, ఆ ఫొటో మీది కాదు కదా? ఆ ఫొటో ఏంటీ, ఇలాంటి ఖతర్నాక్ టపాలేంటసలు? మీ టపాలు మొత్తం చదవలేదు ఇంతవరకూ, వెనకపేజీలకెళ్ళి చదవాలి మొత్తం!

  10. చైతన్య.ఎస్ January 17, 2009 at 9:08 PM  

    బొడ్డు,ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అదిరాయి, బాగుంది :)