21-జనవరి-2009
లప్పంగిరిగిరి - 9* ఎప్పటినుంచో చూడాలనుకుంటున్న సినిమా 'సుబ్రమణియపురం' చూసేసా. ఒక్క byte తమిళ్ రాకపోయినా అత్యంత కష్టపడుతూ సినిమా చూడటం మొదలెట్టా. మొదటి 30 నిమిషాలు నాకు సినిమా అస్సలు అర్థం కాలేదు. 2008 అని చూపించి సెంట్రల్ జెయిల్ నుంచి ఒకతను విడుదల అవుతాడు. అతనిని ఇంకోడు జెయిల్ బయటే కత్తితో పొడుస్తాడు(అనుకుంటా ఆ చీకటిలో అది కత్తో, బాకో, చాకో, కత్తి పీటో సరిగ్గా కనిపించలేదు). సినిమా 1980s కు వెళ్తుంది. 4-5 స్నేహితులు. ఏవో గాలి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అందులో ఒకతనికి మన కలర్స్ స్వాతి అంటే ఇష్టం. తనకు కూడా అతనంటే ఇష్టం. ఈళ్ళ మధ్య సీన్స్ బావున్నాయి. ఎక్సెలెంట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో స్వాతి కళ్ళను, హీరో మూతిని తిప్పడంతోనే చాలా రీళ్ళు తిప్పేసాడు దర్శకుడు.
30 నిమిషాల తర్వాత కూడా నాకు ఇది ఏ టైప్ సినిమానో అర్థం కాలేదు. కాని ఆ తర్వాతే అస్సలు సినిమా మొదలయ్యింది. ఇక చూస్కో నా రంగ సామి ('సామి రంగా' కన్నా ఇది ఎఫెక్టివ్‌గా ఉంటుందనీ...) హత్యలే హత్యలు. టూ మచ్ యాక్షన్ ఫిలిం. 2 కోట్ల బడ్జెట్‌తోనే 20 కోట్ల సినిమా ఎఫెక్ట్ తీసుకురాగలిగారు. 5 మంది బ్యాచ్‌లో ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అతను మాత్రమే మిగిలి హీరో, తన ఫ్రెండ్ తో సహా అందరూ మగ జెంట్స్ చనిపోవడం ఈ సినిమా ప్రత్యే-కథ.
హీరోయిన్‌ను అడ్డు పెట్టుకుని హీరో్‌ని ట్రాప్ చేసే సీన్ హిందీ సినిమా ' గ్యాంగ్‌స్టర్ 'ను గుర్తుకు తెచ్చింది. ఆ సీన్‌లో స్వాతి చూపిన నటన అమోఘం. ఎప్పుడూ 37 పళ్ళు (తనకి ఒక ఎత్తు పన్ను ఎక్స్‌ట్రాగా వుంది) చూపిస్తూ తెగ నవ్వుతూ ఉండే స్వాతి అంతలా ఏడ్వడం ఇదే ఫస్ట్ టైం అనుకుంట. చెయ్యిని తలకు కొట్టుకుంటూ, 'అయ్యో అయ్యో...' అని ఏడ్చే సీన్ చూస్తే భలే నవ్వొచ్చింది. పక్కనే బండ రాయి ఉంది దానికి కొట్టుకుని ఉంటే ఇంకా ఎఫెక్ట్ బావుండేది అనిపించింది.
హీరో ఫ్రెండ్‌గా డైరెక్టర్ శశికుమార్ చేసాడనుకుంటా. చాలా బాగా చేసాడు. ఈళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ సీన్‌లు బావున్నాయి. ఈళ్ళు ఫ్రెండ్స్ కాదు అన్న దమ్ములు లాంటి అణు బాంబులు పేల్చకండి. బదిరులకు వార్తలు చూస్తున్న ప్రేక్షకుడిలా యమ కాన్సెంట్రేషన్‌తో చూసి అర్థం చేసుకున్నది సెప్తున్నా.
ఇంకో ఫ్రెండ్ హ్యాండ్ ఇవ్వడం చాలా సినిమాల్లో చూసిందే. ఓవరాల్‌గా చూస్తే ఇదేమంత డిఫరెంట్ స్టోరి కాదు కాని కచ్చితంగా డిఫరెంట్ సినిమా అనిపిస్తుంది. హీరో,డైరెక్టర్ మొదటి హత్య చేసాక సినిమా చాలా ఊపుతో వెళ్తుంది.
అవలీలగా ఇతరుల ప్రాణాలు తీసిన హీరో తన ప్రాణం డేంజర్‌లో పడడంతో కాపాడమని ఒక గృహిణి కాళ్ళమీద పడే సీన్, హీరో చావుకి ఫ్రెండ్ ప్రతీకారం తీర్చుకునే సీన్, ఇంకో ఫ్రెండ్ ఈడికి హ్యాండ్ ఇచ్చే సీన్ చాలా బాగా తీసారు.
హీరో, హీరోయిన్ మధ్య వున్న ఒక సాంగ్ చాలా బావుంది. అది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా వస్తూంటుంది. 'సుబ్రమణియపురం' టైటిల్ సాంగ్ కూడా బావుంది. ఇది చూసినప్పటినుంచి 'సుబ్రమణియపురం..సుబ్రమణియపురం' అనే పాడుకుంటున్నాను.
1980s బ్యాక్‌డ్రాప్ భలే చూపించారు. మాసిన గడ్డాలు, లుంగీలతో సాహా చాలా కేర్ తీసుకున్నారు.
ఇంతక ముందు తమిళ్‌లో సూపర్ హిట్ అని మాత్రమే తెలుసు. ఇప్పుడు ఎందుకో కూడా తెలిసింది.
* నాదొక త్రిశంకు డి.వి.డి ప్లేయర్. మంచి సినిమా డి.వి.డి లు తప్ప చెత్త సినిమా అని తెలిస్తే చాలు ఫార్మాట్ ఏంటా అని పట్టించుకోకుండ వెంటనే పనిచేస్తుంది. దీనితో విడాకులు తీసుకుందామంటే అత్తయ్యకు (మదర్ బోర్డ్) సరిపోయే కొత్త కోడలు దొరకట్లేదు.
ఇందులో వి.సి.డిలను మాత్రం ఫార్మాట్ ఫీలింగ్ లేకుండా యాక్సెప్ట్ చేస్తుంది. బయట డి.వి.డి/వి.సి.డి స్టోర్స్‌లో నాకు కావాల్సిన సినిమాలు తప్ప అన్నీ వి.సి.డి ఫార్మాట్‌లో ఉంటాయి, అవి మాత్రం DVDల్లోనే ఉంటాయి.
ఇలా రకరకాల VCD షాప్‌లు తిరగడం వల్ల మరియూ కొందరు గురూజీల సౌజన్యంతో సిటీలో అతి పెద్ద కలెక్షన్ ఉన్న డి.వి.డి/వి.సి.డి షాప్‌ల గురించి తెలిసింది. అవి ఇక్కడ వ్రాసుకుందామనిపించింది.
- కరిజ్మా, యూసఫ్‌గూడా: వీళ్ళ దగ్గర పేరున్న ఏ టాలీ/బాలీ/హాలీ/కోలి..ఏ వుడ్ సినిమా అన్నా లభిస్తుంది. యూసఫ్‌గూడా బస్తి జంక్షన్ దగ్గర నుంచి ఎల్లారెడ్డిగూడా వెళ్లే రోడ్లో మొదట్లోనే రైట్ సైడ్‌లో వుంటుంది ఈ షాప్.
- Fribji, బంజారా హిల్స్: మొదట్లో ఈ షాప్ కరిజ్మాకు దగ్గర్లోనే ఉండేది. ఈ మధ్యే మార్చినట్టున్నారు. పంజాగుట్ట నాగార్జున హిల్స్ నుంచి బంజారా హిల్స్‌కు వెళ్లే రోడ్లో మొదట్లోనే లెఫ్ట్ సైడ్ వస్తుంది. వీళ్ళ కలెక్షన్ చూసి నా కళ్ళు తిరిగిపోయాయి. బహుశా ఇంగ్లిష్ మూవీ ఏదీ ఇక్కడ దొరకకుండా ఉండదేమో అనిపించింది. అక్కడున్న క్యాటలాగ్‌లు చదవడానికే సంవత్సరాలు పడుతుంది. ఇక అన్ని సినిమాలు చూడాలంటే మూడు జన్మలు కూడా సరిపోకపోవచ్చు.
ఎక్సెలెంట్ రీసోర్స్ ఫర్ ఇంగ్లిష్ మూవీ ఫ్రీక్స్.
- సినిమా పారడిసో: ఇది జూబ్లీ హిల్ల్స్ నుంచి పంజాగుట్ట, నాగార్జున హిల్స్ వైపు వస్తున్నప్పుడు చట్నీస్ రెస్టారెంట్ పక్కనే కనిపిస్తుంది. ' సఖి ' ఫిలిం హీరోయిన్ షాలిని, అంజలి షామిలి సోదరుడైన రిచర్డ్స్ అలియాస్ ' ఎ ఫిలిం బై అరవింద్ ' రిషి మరియు సినిమాటోగ్రఫర్ సంతోష్ శివన్ కలిసి పెట్టినదే సినిమా పారడిసో. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమయ్యే ఇరాన్, కొరియన్...లాంటి వరల్డ్ సినిమా కలెక్షన్ ఉన్న స్టోర్ ఇది.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో పుర ప్రముఖులు దీనికి రెగులర్ కస్టమర్స్. ఇక్కడ మెంబర్‌షిప్, రెంటల్స్ కొంచెం కాస్ట్లీ.
- న్యూ భారత్ ఎంటర్‌ప్రైజెస్, అబిడ్స్: ఈ స్టోర్‌కు ఒక్క సారే వెళ్ళాను. మైండ్ బ్లాక్ అయ్యింది. ఒక సగటు మూవీ బఫ్ గెస్ చెయ్యలేనంత కలెక్షన్ వుంది వీళ్లదగ్గర. వీళ్లది పక్కా లోకలైజ్డ్ మార్కెట్.
తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లిష్ సినిమాల్లో ఏదన్నా సినిమా వి.సి.డి/డి.వి.డి రిలీజ్ అయ్యిందని మీకు తెలుసుంటే చాలు కళ్ళుమూసుకుని ఈ షాప్‌కు వస్తే అది ఉంటుంది. ఇది రెంటల్ షాప్ కాదు కొనుక్కోవాలి.
నేను ఈ షాప్ కలెక్షన్ చూసి సరదాగా, ఫలానా సినిమా వి.సి.డి ఉండే చ్యాన్సెస్ ఏ లేవు అని నోటికొచ్చిన రెండు మూడు సినిమా పేర్లు సెప్తే, గబుకున్న ఆ షాప్ బాయ్ వెళ్ళి లటుకున్నా తెచ్చి నా చేతిలో పెట్టాడు. ఈళ్ల ముందు మనమింకా బాల నటులమని అర్థమయ్యింది.
అబిడ్స్ బిగ్ బజార్ దగ్గర వున్న, హాలీవుడ్ ఫుట్ వేర్ షాప్ పక్క వీధిలో లో.......పలికి వెళ్లి ఆల్‌మోస్ట్ డెడ్ ఎండ్‌కు వెళ్లాక రైట్ టర్న్ తీసుకోవాలి. తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి. ఆ వీధి గుండా వెల్తుంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఈ షాప్. ఇందులో మంచి డిస్కౌంట్లు కూడా వున్నాయి.
పూర్తి చిరునామా:
న్యూ భారత్ ఎంటర్ప్రైజెస్,
4-3-51/72/5,
హెచ్.వి.ఎస్ కాంప్లెక్స్,
కందస్వామి లేన్,
హైదరాబాద్ - 95
ఫోన్ నంబర్: 24752067, 24750038
- మోజర్ బేయర్, మెహదీపట్నం: నాణ్యమైన సినిమా వి.సి.డి/డి.వి.డి లను అత్యంత తక్కువ ధరలలో ఇవ్వాలన్న కాన్సెప్ట్ మీద వచ్చిన మోజర్ బేయర్ కంపెనీ కొంత వరకు సఫలీకృతమైందనే చెప్పాలి. 'నీ స్నేహం' లాంటి కొన్ని సినిమాల క్వాలిటీ బాలేకున్నా చాలా మటుకు మంచి క్వాలిటీనే ఇస్తున్నారు.
వీళ్ళ ముఖ్య బ్రాంచ్ ఒకటి మెహదీపట్నంలో ఉంది. అంబా ధియేటర్ ఆపోజిట్‌గా ఉంటుంది. కరెక్ట్‌గా ఎలా చేరుకోవాలో నాకు గుర్తులేదు. అంబా, అంబా....అని అడుగుతూ వెళ్తె కనుక్కోవచ్చనుకుంటా. ఈ కంపెనీ నుంచి రెలీజ్ అయిన ఏ సినిమా వి.సి.డి/డి.వి.డి అయినా ఇక్కడ లభిస్తుంది.
హమ్మయ్య అన్నీ చెప్పేసానోచ్ !!!

అదరగొట్టారు... మీరు నవ్వించని టపాలేదేమో !!
చాలా ఉపయోగకరమైన సమాచారం అందించారు..
"మగజెంట్స్"...:)! స్వాతి అసలెందుకు నవ్వుతుందో నేను కనిపెట్టలేకపోయాను....కలర్స్ కాలం నుంచీ!
ముఖ్యంగా అశోక్ ఇలాగే సిటీ అంతా తిరుగుతూ మరి కొన్ని షాపులు కనిపెట్ట ప్రార్థన. సినిమా పారడిసో లో కొంతకాలం సినిమాలు తెచ్చాము.న్యూ భారత్ కి, ఫ్రిబ్జీ కి ఒకసారి వెళ్ళాల్సిందే!
మీరు బాలనటులైతే ఈ లెక్కన మేమింకా 'సిసింద్రీ ' వయసులో ఉన్నామనుకోవాలి.
అదిరింది. ఈ సినిమా నేనూ చూశా!
మీకు ఉచితంగా మంచి DVD format లోని సినిమాలు కావాలంటే, ఒక టెరాబైట్ హార్డ్ డిస్క్ తీసుకొని నా దగ్గరకు వచ్చేయండి. :)
పక్కనే బండ రాయి ఉంది దానికి కొట్టుకుని ఉంటే ఇంకా ఎఫెక్ట్ బావుండేది అనిపించింది.... just adurs.
సినిమా డిస్క్రిప్షను చాలా బావుంది.
Now I am really curious to watch it.
దేశీ సినిమా వీసీడీలు కొనుక్కునేందుకైతే బషీర్ బాగ్ బాబూఖాన్ బిల్డింగునిండా షాపులే షాపులు.