16-జనవరి-2009
లప్పంగిరిగిరి - 4
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!

* 'అరుంధతి..తి..తి..తి..తి..(echo).......కల కల కల కల ' అని ' చంద్రముఖారుంధతి ' combo కల రావడంతో ఉలిక్కిపడిలేచాను. గత మూడు నాలుగు రోజులనుంచి ఎక్కడ చూసినా అరుంధతి డిస్కషనే. అనుష్కాకి ఇంత మంది ఫ్యాన్స్ వున్నారా అని ఆశ్చర్యమేసింది. సినిమా రిలీజ్ రెండు రోజులు పోస్ట్ పోన్ అవ్వడంతో ఇంకా ఎక్కువ వాకబులు వినాల్సి వచ్చింది. ట్రెయిలర్స్ చూసి చాలా మంది మెస్మెరైజ్ అయినట్టున్నారు. నేను ఇంత వరకు చూడకపోయినా ఆళ్ళ వల్ల ఇలాంటి కల వచ్చింది. ఆపీస్‌కు రాగానే, మళ్ళీ అరుంధతి డిస్కషన్ మొదలయ్యింది. ఈ గోలంతా వింటున్న నానాంధ్రులలో (నాన్-ఆంధ్రులు) ఒకతను - 'ఇదేమన్నా అరుంధతి రాయ్ ఇన్స్‌పైర్డ్ స్టోరి నా ? అని డవుట్ అడగగా భలే నవ్వొచ్చింది, అవునూ తన స్టోరిని కూడా సినిమాగా తీయొచ్చొన్న ఆలోచనకూడా వచ్చింది. ఆపీస్ అయ్యాక సాయంత్రం మిత్ర బృందంతో వుండగా ఒక సొ సొ గా తెలుగు తెలిసిన సొగ్గాడు, సోదిగాడు అప్పుడే వచ్చి 'ఎస్ దిస్ అరుణ్ ఈజ్ ఇన్‌డీడ్ వెరీ వెరీ అతి ' అనగానే ఒక సెకండ్ ఎవరికీ అర్థం కాలే. తర్వాత బల్బ్ ఎలిగింది, మా ఫ్రెండ్ ఒకడు అరుణ్ అని వున్నాడు. మేము 'అరుంధతి...అరుంధతి ' అని మాట్లాడుతుండగా ఎంటర్ అయిన వాడు, 'అరుణ్...అతి, అరుణ్...అతి ' అనుకున్నాడంట.

ఇది తెలిసి నేను, 'ఓరినీ పెంట మైండ్‌లో పెంటియం ప్రాసెసర్ పెట్టా....' అని నా నోటికి స్నాక్స్ తినిపించా.

మొత్తానికి అరుంధతికి టూ మచ్ హిట్ టాక్ రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజుల్లో తెలుగు టపా రాయడానికే ఓపిక లేకుంటుంటే అలాంటిది ఇలాంటి తెలుగు సినిమా తీయడానికి శ్యాం ప్రసాద్ రెడ్డి గారు చూపిన చొరవ, సాహసం, ఓపిక, నమ్మకం ఇంకా ఇలాంటి మంచి క్వాలిటీస్ ఎన్ని వర్తిస్తే అవన్నీ నిజంగా అభినందనీయం. ఈ సినిమాను బాగా ఇగ్నోర్ చేసిన నేను ఇప్పుడు, 'నిజమే ఏ 'ప్రింట్' లో ఏ పాము వుందో ఎవరికి తెలుసు ' అని అనుకుని పశ్చాత్తాపడుతున్నా.
అర్జెంట్‌గా ఈ సినిమా చూడాలని నాలోని దెయ్యం కూడా ఉవ్విళ్లూరుతోంది.
* ఏదో పని చేసుకుంటుంటే మా ఫ్రెండ్ బాబ్జి గాడి నుంచి ఫోన్ వచ్చింది. అమ్మో వీడా అని కట్ చెయ్యలేదు, ఎందుకంటే తెలిసిపోతుందని. అలా రెండు సార్లు వచ్చి ఆ తర్వాత రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నా. అప్పుడే ఏదో కొత్త నంబర్ నుంచి కాల్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసా, చూస్తే మా బాబ్జిగాడే.
ఆడు: నాకు తెలుసు మామా నువ్వు ఇలా చేస్తావనీ....
నేను: (వార్ని....అని మనసులో) వార్నర్ బ్రదర్స్‌కు పరిచయం చెయ్యాల్సిన వ్యక్తివిరా నువ్వు...
ఆడు: ఈ పొగడ్తలకేం కాని...నీకు తెలిసిన డాక్టర్‌లు ఎవరన్నా ఉన్నారా ?
నేను: యే....? చిన్నప్పుడు టీకాలు ఏసుకోలేదా...మా ఈధిలో ఏస్తున్నారు వచ్చెయ్
ఆడు: టీ..కాఫీ లకే దిక్కులేదు, ఇంక టీకాలు కూడానా ? ఏమిలేదు....అప్పిచ్చు వాడు వైద్యుడు కదా అందుకు
నేను: మరి అప్పిప్పిచ్చువాడూ ?
ఆడు: స్తెథస్కోప్ అనుకోరాదే...పేషంట్ హార్ట్‌బీట్ తెలుసుకుని యాజ్ ఇట్ ఈజ్‌గా డాక్టర్ చెవులో ఊదేవాడనుకో...
నేను: అయినా డాక్టర్‌లు...అప్పు అది B.C కాలంలో కదరా ?
ఆడు: ఈ O.C కాలంలో కూడా ఆళ్ళే బెస్ట్‌రా బాబు..
నేను: (అమ్మో వీడు చాలా ఫ్లోలో వున్నాడు...అందులో నేను కొట్టుకుపోకుండా చూసుకోవాలి...)
ఆడు: ఏం మచ్చా సైలెంట్ అయ్యావ్. నువ్వెలాగో సాయం చెయ్యవని తెలుసు. అందుకే నీకు తెలిసిన వాళ్లతో అన్నా...
నేను: నేను ఏ సాయానికైనా రెడీ రా ఒక్క ఆర్థిక సాయం తప్ప.
ఆడు: అంటే అది ఒక్కటీ వుంటే ఇంకే సాయం అడగరు కదా...ఈ సారికి మాట సాయం ఒక్కటీ చెయ్యి, ఆళ్లకి చెయ్యి ఇవ్వకుండా వుండే పూచి నాది.
నేను: అయినా ఉన్నట్టుండి డాక్టర్‌ల పైన పడ్డావేంట్రా ?
ఆడు: రిసెషన్ బాబాయ్ రిసెషన్. దీని ఎఫెక్ట్ మీ మీద ఏమో కాని నా మీద చాలా పడింది. ప్రతి ఒక్కడూ ఇదే రీజన్ సెప్పి తప్పించుకుంటున్నాడు. మన దేశంలో రోగాలకు కరువు ఎప్పుడూ వుండదు కదా...సొ ఇప్పుడు డాక్టర్‌లే కరెక్ట్ అనీ..
నేను: ఆహహ...నీ బ్రేయిన్ బే ఆఫ్ బెంగాల్ అంత విశాలమైనది, లోతయినదిరా. అందుకేనేమో ఎక్కువగా అల్పపీడనాలు, వాయుగుండాలు వస్తుంటాయి....సర్లే కాని నాకు తెలిసిన డాక్టర్ ఒకడున్నాడు...కానీ అతనితో కష్టం. వాడు తెలివైన వాడు.
ఆడు: అంటే ఆవులిస్తే పేగులు లెక్కెట్టే టైపా ?
నేను: కాదు....
ఆడు: మరి...ఆవులిస్తే గేదలు లెక్కేట్టే టైపా?
నేను: కాదు...
ఆడు: మరి....ఎవడ్రా వాడు ?
నేను: ఆవులిస్తే డెయిరి ఫామ్ పెట్టే టైపు...వెటర్నరి బిజినెస్ మాన్...
ఆడు: అదేంటి ?
నేను: పేరుకి వెటర్నరి డాక్టర్, సైడ్ బిజినెస్‌లు చాలా వున్నాయి మరి
ఆడు: ఇంక ఆడు నాకేం ఇస్తాడు ? హలో...హలో...అరె సిగ్నల్ సరిగ్గా రావడం లేదు నేను మళ్ళీ కాల్ చేస్తా.
ఎవడన్నా దొరికితే సెప్పు, సిగ్నల్ లేకపోయినా కాల్ చేస్తా...

కాల్చేస్తా...కాల్చేస్తా...అన్న మాట రీసౌండ్‌లో వస్తూ కాల్ కట్ అయ్యింది. నెక్స్ట్ టైం ఈడి నుంచి కాల్ వస్తే ఎలా అవాయిడ్ చెయ్యాలా అని ఆలోచిస్తూ పడుకున్నా.

8 comments
  1. జీడిపప్పు January 17, 2009 at 9:25 PM  

    'ఓరినీ పెంట మైండ్‌లో పెంటియం ప్రాసెసర్ పెట్టా....'
    టీ..కాఫీ లకే దిక్కులేదు, ఇంక టీకాలు కూడానా ?
    ఆవులిస్తే డెయిరి ఫామ్ పెట్టే టైపు...వెటర్నరి బిజినెస్ మాన్...
    ఎవడన్నా దొరికితే సెప్పు, సిగ్నల్ లేకపోయినా కాల్ చేస్తా...

    కేక పుట్టిస్తున్నావు గురు. Waiting for your next post

  2. నేస్తం January 17, 2009 at 10:22 PM  

    ఆవులిస్తే డెయిరి ఫామ్ పెట్టే టైపు
    :)))))

  3. శ్రీనివాసమౌళి January 17, 2009 at 10:58 PM  

    Kevvu kEkalu ashOkaa dials...
    'ఓరినీ పెంట మైండ్‌లో పెంటియం ప్రాసెసర్ పెట్టా....'
    ఆవులిస్తే డెయిరి ఫామ్ పెట్టే టైపు...వెటర్నరి బిజినెస్ మాన్...
    ఎవడన్నా దొరికితే సెప్పు, సిగ్నల్ లేకపోయినా కాల్ చేస్తా...

    baagunnAyi... idi ayaskantam.com site ki blog version aa lEka seperaTe blog aa?

  4. నాగప్రసాద్ January 18, 2009 at 12:15 AM  

    మీ పోటోకు, మీరు వ్రాస్తున్న టపాలకు పోలిక కుదరడం లేదు. దయచేసి ఎప్పుడో పదవ తరగతిలో తీయించుకున్న ఆ ప్రొఫైల్ ఫోటోను తీసివేసి, కొత్తది పెట్టండి. (పిల్లాట = Just kidding). :)))

    మీ టపాలన్నీ కేక.

  5. చైతన్య.ఎస్ January 18, 2009 at 12:43 AM  

    ha.haaa :))

  6. సుజ్జి January 18, 2009 at 3:12 AM  

    :)) chala baaga raastunnaru. keep it up

  7. dhrruva January 19, 2009 at 8:20 PM  

    Seems your blog is going to be another "Rendurella Aaru" (GAUTHAM)

    really superb...ga undhi boss kummeyyi !!!

  8. చిటపటలు.. May 7, 2009 at 4:24 AM  

    నేను గత వారం నుండి మీ బ్లాగ్ ఫాలో అవుతున్నా..ఇది నా ఫేవోరేట్..(పెంటియం ప్రొసెసెర్,వార్నేర్ బ్రదర్స్, డైరీ ఫాం) .. ..అబ్బా అసలు ఏ టైం లో ఏ విధంగా మీరు పదాలు ని ప్రయోగిస్తున్నారో వూహించడం(ఆఫీసు లో నవ్వు ఆపడం ) చాలా కష్టం.. మీకు నా అభినందనలు ..