18-జనవరి-2009
లప్పంగిరిగిరి - 6
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!


* ఆదివారం అంతా 'నిద్రో నిద్రతి నిద్రితః ' ఫిలాసఫి ఫాలో అయ్యాక, ఒక ముఖ్యమైన మెయిల్ రావాలి, వచ్చిందా అని gmail ఓపన్ చేసాను. మొదటి మెయిల్ క్లాస్‌మేట్ శ్రీవిద్యది. చాలా రోజులకు గుర్తొచ్చానేమిటబ్బా అని ఓపన్ చేస్తే, ఏదో లింక్ వుంది. అది ఏంటా అని చూస్తే...

మీ క్రష్‌ల పేరు చెబితే చాలు లవ్ మీటర్, వారు మీరంటే ఎంత మోతాదులో చెవులు,జుట్టు కోసేసుకుంటారో ఒక ప్రూవెన్ మ్యాథమెటికల్ ఫార్ములా ప్రకారం క్యాల్‌కులేట్ చేసి చెవులు, జుట్టు కత్తిరించి చూపిస్తాం అన్న లెవెల్లో మ్యాటర్ వుంది.

కుశలప్రశ్నలు వెయ్యకుండా క్రష్‌ల ప్రశ్నలు వేసిందేమిటబ్బా అనుకుంటూ సరే కానీ అని:

1. తెలంగాణ శకుంతల
2. పావలా శ్యామల (వర్షం సినిమాలో త్రిష అమ్మమ్మ)
3. తెలంగాణ శ్యామల ఆర్ పావలా శకుంతల

అని టైప్ చేసి సబ్‌మిట్ కొట్టగానే

Oops హేయ్ (బ్యాక్‌గ్రౌండ్‌లో చప్పట్లు) నువ్వు మోసపోయావ్, నీ బతుకు క్రష్‌లు చింపిన విస్తరయ్యింది, నువ్వు పప్పులో కాలేసావ్, చారులో చెయ్యేసావ్, ఉప్పులో పెరుగేసావ్...నీ సీక్రెట్స్ అన్నీ శ్రీవిద్యకు తెలిసిపోయాయోచ్ అన్న రేంజ్‌లో యానిమేషన్ బొమ్మ ఎగురుతూ చెప్పింది.

ఇప్పటివరకు శ్రీవిద్య నుంచి రిప్లయ్ రాలేదు.

* రెండో మెయిల్ Dr. Ahmed ALSAGA నుండి వచ్చింది. ఈడెవడా అని చూస్తే, వెస్ట్ ఆఫ్రికాలో వేస్ట్ ఫెలో అని తెలిసింది. ఈయన గారు ఒక బిజినెస్ ప్రపోజల్ పెట్టారు. తను బ్యాంక్ ఆఫీసర్ అంట. 2000లో ఒక ఫామిలీ మొత్తం ప్లేన్ క్రాష్‌లో చనిపోయారంట. కావాలంటే చెక్ చేసుకో అని BBC వెబ్‌సైట్ న్యూస్ లింక్ ఇచ్చాడు. ఆ కుటుంబ పెద్దమనిషి అకౌంట్‌లో డబ్బులు అలానే వుండిపోయాయంట. దాన్ని దొబ్బేద్దామా ? అన్నది తన అవిడియా. 55:35 రేషియోలో పంచుకుందాం, 10% ఖర్చులకు ఓకేనా ? ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని, లైవ్‌గా ఐతే చెయ్యి మూతి దగ్గర పెట్టి మెల్లగా చెప్తారు కదా అలా ఈడు బ్రాకెట్లు వేసి చెప్పాడు.

అస్సలు యాడ్నుంచి వస్తార్రా మీరంతా ! అనుకున్నా. ఈడి పేరుని ALSAGA అని కాకుండా ALL SEGA అని పలకాలేమో అనిపించింది. ఈ-మెయిల్‌ని స్పామ్ అని మార్క్ చేస్తుండగా 2004లో జరిగిన విషయం గుర్తొచ్చింది.

ఇప్పుడంటే సిక్స్ పాక్ బ్రెయిన్ వుంది కాని అప్పట్లో చాలా అండర్ వెయిట్. ఒక రోజు సుముహుర్తానికి, దుర్ముహుర్తానికి అటు ఇటుగా ఉన్న సమయంలో సురేష్ గాడు కాల్ చేసాడు. ఈడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎవరన్నా జీవితంలో సుఖ సంతోషాలు ప్రసాదించు దేవుడా అని మొక్కుకుంటారు గాని ఈడి పేరంట్స్ మాత్రం తెలివిగా సుడిని ప్రసాదించు దేవా అని మొక్కుకున్నాక పుట్టాడంట. అందుకే ఈడ్ని మేమంతా సురేష్ అని కాకుండా, సుడేష్ అని పిలుస్తుంటాం.

EAMCET ఎగ్జాంలో మేమంతా నానా ఫార్ములాల వెంటపడి ఫిజిక్స్‌లో (16,17)/50 సాధిస్తే, ఈడు వున్న టైం అంతా మ్యాథ్స్ చేసి చివర్లో టైం లేదని ఫిజిక్స్ బిట్లన్నింటికీ B ఆప్షన్ పెట్టేసి 19/50 సంపాదించాడు.

చాలా గ్యాప్ తర్వత కాల్ చేసిన వీడు:

నీకో ముఖ్య విషయం చెప్పాలి. ఎవరికీ చెప్పకురా....

నేను: కొంపదీసి ఎవరన్నా అమ్మాయి తగిలిందా ? ఈ లవ్ మారేజ్‌లు అవి నా వల్ల కాదు బాబొయ్. కావాలంటే స్క్రీన్‌ప్లే రాయగలను, డైరక్షన్-ప్రొడ్యూసర్-ప్రేక్షకులను నువ్వే చూసుకో...ఇంతకి ఆ అమ్మాయి ఎవరు ?

ఆడు: అహెయ్ తగిలింది అమ్మాయి కాదు, లాటరీ కోటి రుపాయలు

(నేను మూర్చపోయినంత పనైయ్యింది. ఆడికి లాటరీ తగిలినందుకు కాదు. కోటి రుపాయల లాటరీ తగిలితే ఎవరికీ చెప్పకుండ నా మీద నమ్మకం ఉంచి చెప్పినందుకు. 'రాజా' సినిమా క్లైమాక్స్‌లో వెంకీ మెలికలు తిరిగినట్టు...తిరిగిపోయా..మధ్యలో..ఎస్.ఏ.రాజ్ కుమార్ ఆల్ టైం సెంటి ట్యూన్ల బ్యాక్‌గ్రౌండ్‌లో 'రే...రే...' అని నేను అంటుంటే...)

ఆడు: అప్పుడెప్పుడో రెడిఫ్ మెయిల్‌లో USలో ఉండే కృష్ణాగాడు ఏదో పంపిస్తే ఫిల్ చేసి పంపించారా. దానికి తగిలింది. ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావాట్లేదు. ఎవడిదో నంబర్ ఇచ్చి కాల్ చెయ్యమన్నారు.

నేను: వావ్...నువ్వు దీపావళి అప్పుడు లక్ష్మీ టపాకాయలు ఎక్కువ కలుస్తావు కదూ...అందుకేనేమో అబ్రాడ్‌లో వున్నా లక్ష్మీ దేవి గుర్తుపెట్టుకుని కరుణించింది. KBC కోటీశ్వరుడు హర్షవర్ధన్ నవాటే తర్వాత నీవంతే. ట్యాక్స్‌లు పోను మినిమం అరవై లక్షలు వస్తాయిరా. రోజుకి మూడు పూటలే తింటే ఆరు తరాలు బ్రతికెయ్యొచ్చేమో. నువ్వు నిజంగా సుడేష్ మామా సుడేష్. ఐతే ఇంకేముంది ఆడికి కాల్ చెసెయ్.

ఆడు: మనకంత సీన్‌లేకే కదా నీకు ఫోన్ చేసింది. ప్లీజ్‌రా హెల్ప్ చెయ్యి....
నేను: ఇక మీదట నేను చూసుకుంటా కదా....
(ఆల్రెడి ఈడి ఫోటోని పేపర్‌లో ఊహించుకుంటూ, ఈడిచ్చే ఇంటర్‌వ్యూల్లో ఫ్రెండ్స్ లిస్ట్లో ఫస్ట్ పేరుగా నాది చూసూకుంటూ మురిసిపోయాను. మనం ఇప్పుడే కలుద్దామన్నాను. ఆడు వెంటనే వచ్చాడు. ఇద్దరం కలిసి ఇంటర్నట్ సెంటర్‌కెళ్లాం. ఆడి మెయిల్ ఓఫెన్ చేసి చూపించాడు.)

నేను: రెయ్ ఇదే మనకు ప్రూఫ్. బంధువులకు గాని రిలేటివ్స్‌కు గాని....

ఆడు: (చిన్న గా నవ్వి...) ఇద్దరు ఒకటే కదరా....?

నేను: ఇదిగో అసలే నేను ఎగ్జైట్మెంట్లో వున్నా నన్ను డిస్టర్బ్ సెయ్యకు. సో బంధువులకు గాని, నాకు తెలియకుండా నీకు పెళ్లైయుంటే నీ నాక్ తెలియని వైఫ్‌కు గానీ, ఎవ్వరికీ దీని గురించి చెప్పకు. ఇప్పుడే ప్రింట్ అవుట్ తీసిపెట్టుకుందాం.

(అని ప్రింట్ అవుట్ తీస్తున్నప్పుడు ఆ నెట్ సెంటర్ వాడి దృష్టి దీని మీద ఎక్కడ పడుతుందా అని...
నేను: బాసు, CD లోని మాటర్ అంతా floppyలోకి రావాలంటే ఏం చెయ్యాలి ?
(ప్రింట్ బటన్ నొక్కిన వాడు, ఒక్కసారి షాక్ అయ్యి నన్ను పైకి కిందకి చూసి...)
నెట్ సెంటర్ వాడు: ఇంకో CD తీసుకుని, కాపీ చేసుకుని దాన్ని floppy అనాలి.

ప్రింట్ అవుతున్న ప్రింట్ అవుట్ దిక్కు చూస్తున్న నేను షాక్ అయ్యి ఆడి దిక్కు చూసా. సర్దుకుని వెంటనే ప్రింటవుట్ తీసేసుకున్నా. అందులో UK లాటరీ వాడు, మలేషియా వాడి అడ్రెస్ ఇచ్చి ఫోన్ నంబర్ ఇచ్చాడు. అది ట్రై చేస్తే కనెక్ట్ కాలేదు. మా సుడేష్ గాడి మొహంలో తుఫాను తాకిడికి వరదలు ముంచుకొస్తున్నాయి. ఇలాంటప్పుడే చాలా షార్ప్‌గా ఆలోచించాలి అనీ, ఇంతకీ మలేషియా కన్‌ట్రి కోడ్ ఎంత బాసు అని నెట్ సెంటర్ వాడి నడిగితే నాకేం తెలుసు అని వాడన్నాడు. సుడేష్ గాడి కుడి కన్నులో గండి పడింది. కంట్రోల్ మామా కంట్రోల్ అని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుండగా గూగుల్ స్క్రీన్ కనిపించింది. ఛ ఇది వుండగా ఇంత సేపు ఆలోచిస్తున్నామేంట్రా అని గూగుల్‌లో సెర్చ్ చేసి ఆడికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసాడు. అదేదో ఉర్దోరబిక్‌హింగ్లిష్‌లో మాట్లాడాడు. కంగ్రాట్స్ అని చెప్పి, స్టాంప్ డ్యూటి/ట్యాక్స్‌ల పేర్లు ఏవో చెప్పి 20,000 ఫస్ట్ పంపిస్తే ఆ తర్వాత మీకు డబ్బు ఏరొప్లేయిన్‌లో గావాల్నా/ షిప్‌లో గావాల్నా...అని సెప్తుంటే కృష్ణ భగవానుడు (కమెడియన్-వెంకీ సినిమాలో) గుర్తొచ్చాడు.

అమ్మో అమ్మో ఇందులో ఏదో తిరకాసు వుందని ఫస్ట్ టైం అప్పుడూ లైట్ ఎలిగింది. మల్లీ గూగుల్ స్క్రీన్ కనపడడంతో వెంటనే నేను ఆ మలేషియా వాడి పేరు కొట్టా అంతే, 0.1 సెకండ్స్లో పది లక్షల రిజల్ట్స్ వచ్చాయి. మీ భగవాన్ ఒక Rs 4,20,420 నోటు అని రక రకాలుగా తిడుతూ ఆడు దొరికితే కుమ్మెయ్యండి అని అందరి అరుపులు కనిపించాయి.

సుడేష్ గాడు, నేను ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఏం మాట్లాడకుండా వుండిపోయాం.
కాసేపటికి తేరుకున్న నేను, " మామా నువ్వు ఎవ్వరికీ చెప్పొద్దు నేనూ ఎవ్వరికీ చెప్పను. ఇలాంటివన్నీ నమ్మకూడదురా, స్వశక్తితోనే మన స్లిప్పర్స్ పైన మనం నిలబడాలి", అన్నాను.

ఇంకొంచం ప్రొసీడ్ అయ్యుంటే యే రేంజ్ బకరాలయ్యుండే వాళ్లమో తలుచుకుని మూర్ఖంగా ఇరుకున్నందుకు ఏడ్వాలో, తెలివిగా బయటపడినందుకు ఆనందించాలో అర్థం కాని విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్‌తో అక్కడనుంచి వెళ్లిపోయాం.

అప్పటి నుంచి గూగుల్‌కు సంబందించిన వార్తయినా గూగుల్‌లో వెతికి కన్‌ఫర్మ్ చేసుకోనిదే నేను ఏదీ నమ్మడం లేదు. అద్గదీ సంగతి.

మొత్తానికి ఈ రోజు పొద్దున్న లేస్తూనే దావూద్ ఇబ్రహీం ఫోటో ఏమన్నా చూసానా అని డవుట్ వచ్చి మళ్లీ పడుకున్నా.

9 comments
  1. ప్రపుల్ల చంద్ర January 19, 2009 at 4:35 PM  

    "నిద్రో నిద్రతి నిద్రితః"
    "తెలంగాణ శకుంతల" హ హ హ..
    ఎప్పటిలా అదరగొట్టేసారు...

  2. నేస్తం January 19, 2009 at 5:06 PM  

    హహహ నాకు ఇలాంటి లాటరీలు బోలెడు తగిలెసాయి ... మీ ఫ్రెండ్ లా తెగ సంతోషపడి పోతుంటే నా ఫ్రెండ్ నా కళ్ళు తెరిపించింది తనకు వచ్చిన లాటరీల సంగతి చెప్పి..చాలా బాగా రాస్తున్నారు.. ఎన్ని మాటలు మింగేసారు .. బలే ఉన్నాయి మీ కబుర్లు

  3. Anonymous January 19, 2009 at 7:59 PM  

    కుమ్మేసారు సారు! మీది నిజంగానే సిక్స్ పాక్ బ్రెయిన్ !

  4. Anonymous January 19, 2009 at 9:23 PM  

    (అని ప్రింట్ అవుట్ తీస్తున్నప్పుడు ఆ నెట్ సెంటర్ వాడి దృష్టి దీని మీద ఎక్కడ పడుతుందా అని...
    నేను: బాసు, CD లోని మాటర్ అంతా floppyలోకి రావాలంటే ఏం చెయ్యాలి ?

    superb..

  5. మధురవాణి January 20, 2009 at 12:08 AM  

    superb :)))))))

  6. karthik January 20, 2009 at 5:22 AM  

    super basu!!

  7. చైసా January 20, 2009 at 5:42 AM  

    super, c.d floppy keaka :))

  8. krishna rao jallipalli January 20, 2009 at 10:23 AM  

    టపా అదిరింది. అటువంటి మెయిల్స్ తో మనం కూడా ఆడుకొవాలి.. అదీ దిమ్మ తిరిగేలా. ఎలాగంటీ.. వాడి బాంకు పేరు అక్కౌంట్ నెంబర్ అడిగి ఇదిగో పంపిస్తున్నాను, అదిగో పంపిస్తున్నాను అని కొన్ని రోజులు ఏడిపించి ఆఖరికి మా దేశంలో డాలర్లు దొరకవు అని చావు కబురు చల్లగా చెప్పాలి. ఇటువంటి మెయిల్స్ తో ఎంతో టైం పాస్ చేయవచ్చు అనేక రకాలుగా. అప్పుడప్పుడు నేను ఇదే పని చేస్తాను.

  9. రాధిక January 20, 2009 at 1:02 PM  

    :) krishna rao garu ...:)